మూర్తి యాదవ్ ఆరోపణలపై లీగల్ నోటీసు జారీకి న్యాయ నిపులను సంప్రదించిన సిఎస్.
అమరావతి,29 మే:ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని మీడియా ముఖంగా పలు మార్లు నిరాధారమైన అవాస్తవ ఆరోపణలు చేసిన నేపధ్యంలో మూర్తి యాదవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిఎస్ జవహర్ రెడ్డి బుధవారం న్యాయ నిపుణులతో సంప్రదించడం జరిగింది. గతంలో జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులపై కూడా వివిధ సందర్భాల్లో ఈవిధమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయా ఆరోపణలపై న్యాయపరంగా అప్పుడు ఆ ప్రముఖుల తరపున న్యాయ పరంగా ఏవిధమైన చర్యలు తీసుకున్నారో అదే రీతిలో ప్రస్తుతం సిఎస్ పై చేస్తున్న ఆరోపణలపై కూడా న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు సిఎస్ కు వివరించారు.ఈ నిరాధార,అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసు జారీ చేయడం జరుగుతుంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారి కార్యాలయం