Commemoration meeting for Padma Vibhushan Cherukuri Ramoji Rao organised by the Government of AP on 27th Jun 2024
పెనమలూరు, జూన్ 26
స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
ఈనెల 27వ తేదీ పెనమలూరు మండలం తాడిగడప- ఎనికెపాడు 100 అడుగుల రోడ్డు అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించనున్న రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమం ఏర్పాట్లు బుధవారం పలువురు మంత్రులు పరిశీలించారు.
రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, ఏపీ సి ఆర్ డి ఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, సృజన, ఇరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ పేదల ఆర్థిక పరిస్థితులు వారి అవసరాలకు అనుగుణంగా మెరుగుపరచిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని, చిన్న బడ్జెట్ తో గొప్ప సినిమాలు తీసి గొప్ప విజయాలు సాధించి సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ముఖ్యంగా రైతులను ఎడ్యుకేట్ చేసేందుకు అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని, సినీ రంగ ప్రముఖులు ఎందరో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారన్నారు.
రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావు పత్రికా, సినీ రంగానికి ఎనలేని సేవలు చేశారని, వారికి ఘనంగా నివాళులర్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, దేశవ్యాప్తంగా ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని, ఇందుకోసం అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
పోలీస్ శాఖ ఐజి అశోక్ కుమార్ ,జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల జాయింట్ కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం, అదనపు సంచాలకులు వాణి, సమాచార శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు కిరణ్, కస్తూరి, సిఐఇ మధుసూదన్, ఆర్ ఐ ఈ కృష్ణారెడ్డి, జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు