పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (24-07-2023) సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్నారు.
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు, అక్కడ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మోడల్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
23.07.2023
అమరావతి
పేదలందరికీ మంచి జరగాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి న్యాయపరమైన చిక్కులను సైతం పరిష్కరించి, అమరావతిలో కేవలం పెత్తందార్లే ఉండాలన్న దుష్ట సంకల్పాన్ని చేధించి..
సీఆర్డీఏ పరిధిలో పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల నిర్మాణం
. జగనన్న కడుతున్నవి ఇళ్లు కాదు.. అవి ఊళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ వద్ద నేడే (24.07.2023) శంకుస్థాపన చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
50,793 ఇళ్ల నిర్మాణానికి నేడే శంకుస్థాపన..
పేద అక్కచెల్లెమ్మలకు ఒక గూడు ఏర్పడాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో, అడ్డంకులన్నీ అధిగమించి పేదల పక్షాన నిలబడి.. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు 26 మే, 2023న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించి, నేడు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న జగనన్న ప్రభుత్వం..
పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానం..
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు..
ఇందులో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం..
రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న లేఅవుట్లలో రూ. 32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పన..
తద్వారా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు లొకేషన్ ను బట్టి కనీసం రూ. 5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు
లబ్ధి.. రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుండి రూ.3 లక్షల కోట్ల సంపద, .. అడ్డంకులను అధిగమిస్తూ రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు..
• ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా యూనిట్ కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందిస్తూనే.. మరోవైపు పావలా వడ్డీకి రూ. 35 వేలు చొప్పున బ్యాంకు రుణం.. దీంతో పాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సీడీపై అందించడంతో ఇంకో రూ. 40 వేల మేర లబ్ధి..
అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందన్న పెత్తందార్లు వితండ వాదాలకు చెక్ పెడుతూ.. పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తోన్న జగనన్న ప్రభుత్వం..
• “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమం క్రింద సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో 25 లేఅవుట్ల అభివృద్ధి.. 50,793 పేద అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కటి కనీసంగా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు విలువ కలిగిన ఇళ్ల స్థలాలు ఇప్పటికే ఉచితంగా పంపిణీ..
ఈ లేఅవుట్లలో రూ. 1,371.41 కోట్ల వ్యయంతో ఉచితంగా 50,793 ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం.. మౌలిక వసతుల కల్పనకు మరో రూ.384.42 కోట్లు..
• పేద ప్రజలకు విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్ వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం..
లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు 2 దశల్లో రూ. 168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు..
ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షలకు పైగా విలువైన ఆస్తి…