ఢిల్లీ
ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన రైసినా డైలాగ్ నిర్వాహకులు
* 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు హాజరు
* సదస్సుకు హాజరైన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సహా ఇతర ప్రతినిధులు
* భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
* మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నిపుణులను అందించిందన్న ముఖ్యమంత్రి
* నాలెడ్జి ఎకానమీలో లీడింగ్ భాగస్వామిగా భారత్ ఉందని వెల్లడి. 60 శాతం జీసీసీలు భారత్ లో ఏర్పాటు అయ్యాయని స్పష్టం
* డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
* గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్న సీఎం
* క్వాంటం కంప్యూటింగ్ ను అందిపుచ్చుకునేలా అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు
* త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని వెల్లడి
* ఐటీ విప్లవం అందిపుచ్చుకున్నప్పుడు అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నాలెడ్జి ఎకానమీకి కేంద్రంగా మారింది
* ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతోంది.
* ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుంది
* సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు
* టెక్నాలజీని, ఇన్ ఫ్రాను మిళితం చేసి కాలుష్య రహిత నగరంగా అమరావతిని నిర్మిస్తున్నాం
* ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నాం
* సహనం అనే పునాదులపై భారతీయ సంప్రదాయ మూలాలు ఉన్నాయి. సహకార ఫెడరలిజం అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాలు పనిచేస్తున్నాయి.
* వివిధ రకాల సంస్కరణల ద్వారా వచ్చిన వివిధ పాలసీలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తాయి.
* అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నాం
* ప్రపంచంలో ఎక్కడైనా భారతీయులే అత్యుత్తమ డిప్లామాట్స్. ఎక్కడికి వెళ్లినా స్థానికులతో కలిసిమెలిసి నివసించటంలో వారికి మించిన వారులేరు
* ప్రపంచ దేశాలకు విస్తృత సేవలు అందిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ.
* ప్రత్యేకించి ఐటీ సహా వివిధ రంగాల్లో గ్లోబల్ కమ్యూనిటీకి, ప్రపంచ సంక్షేమానికి భారతీయులు సేవలు అందిస్తున్నారు.
* గతంలో భారతీయ నిపుణులు సిలికాన్ వ్యాలీ లాంటి చోటకు మేధో వలస జరిగింది. కానీ త్వరలో రివర్స్ మైగ్రేషన్ అంటే మొదలవుతుంది.
* నిపుణులు, వనరులు ఉన్న చోటుకే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.
* ప్రస్తుతం దూరాలు అనేవి ఒక అంశం కాదు. ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయి
* నాలెడ్జ్ ఎకానమీలో భాగంగా ఎక్కడైనా ఓ పెద్ద కంపెనీని ప్రారంభించి పనిచేసేందుకు అవకాశం ఉంది
* త్వరలో డేటా సెంటర్ ల కోసం గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాం.
* భారత్ లో ప్రస్తుతం సింగిల్ గ్రిడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్సఫర్మేషన్ జరుగుతోంది.
* గ్రీన్ ఎనర్జీ కారిడార్ తో పాటు ఇతర సంప్రదాయ విద్యుత్ కారిడార్ లు ఉంటాయి.
* త్వరలోనే భారత్ విద్యుత్ ను ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గ్రీన్ అమ్మోనియా కూడా ఏపీలో ఉత్పత్తి చేస్తున్నాం
* ఏఐ సహా క్వాంటం ఏఐ ఆల్గారిథమ్స్ కోసం పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి
* ఇటీవల ట్రైనింగ్ కోసం కోసం పిలుపు ఇస్తే 50 వేల మంది రిజిస్టర్ చేసుకుని శిక్షణ పొందుతున్నారు
* ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది
* అందుకే ఫెర్టిలిటీ రేటును పెంచేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించాం.
* 1.5 నుంచి 2.1కు ఫెర్టిలిటీ రేటు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
* మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్ధిక సాయం, నెలలవారీగా రూ.1 వెయ్యి అందించాలని నిర్ణయించాం
* అలాగే చైల్డ్ కేర్ లీవ్ లాంటి ప్రోత్సాహకాలను అందించాలని ఆలోచన చేస్తున్నాం
* ఓ ప్రజాప్రతినిధిగా గతంలో జనాభా నియంత్రణ పై మాట్లాడాను. ఇప్పుడు భవిష్యత్ ప్రమాదాన్ని గుర్తించి జనాభా నిర్వహణ పాలసీని ప్రోత్సహిస్తున్నాను
* పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది
* భారత్ లో గతంలో పెద్ద కుటుంబ వ్యవస్థలు ఉండేవి. దేశానికి అదో పెద్ద ఆస్తి కూడా. ప్రస్తుతం మైక్రో ఫ్యామిలీలుగా మారాయి.
* ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నాం.
* ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థానాల్లో ఉండడానికి 30 ఏళ్ల క్రితం తీసుకున్న వివిధ సంస్కరణలతో కూడిన నిర్ణయాలే కారణం
* నాలెడ్జి ఎకనామీ ద్వారా ప్రపంచ దేశాలకు నైపుణ్యాలను అందిస్తున్నాం. త్వరలోనే ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ద్వారా ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులను సరఫరా చేస్తాం
* 9 అంశాలతో కూడిన నగరాలను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నాం. క్రియేటివ్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం
* ప్రైవేటు శాటిలైట్లను కూడా తయారు చేసి లాంచ్ చేసేలా ఓ స్పేస్ సిటీని, డ్రోన్ల కోసం డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం
* ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ సిటీని ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం.
* ప్రివెంటివ్ హెల్త్ అనేది రియాలిటీ, క్యూరేటివ్ విధానంపైనా అంతా దృష్టి సారించాల్సి ఉంది
* డ్రోన్ అంబులెన్స్ కూడా త్వరలోనే రియాలిటీగా మారబోతోంది.
* మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచనల్ని అమలు చేసేందుకు భారత్ తో పాటు ఏపీ సదా సన్నద్ధంగా ఉంటుంది.














































