Celebrations in villages of capital Amaravati area
రాజధాని గ్రామాల్లో మిన్నంటిన సంబరాలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు,

రాయపూడి , జూన్ 12: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అమరావతి రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు, రైతు కూలీల సంబరాలు అంబరాన్ని అంటాయి. తుళ్లూరు రైతు ఽధర్నా శిబిరంలో ఎల్ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేసి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వీక్షించారు. పసుపు బెలూన్లు ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు.
మహిళలు రోడ్డు మీదకు వచ్చి నృత్యాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. తుళ్లూరులో తెలుగు యువత అధ్యక్షుడు మూల్పూరు నరేశ్ ఆధ్వర్యంలో పది చోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.