ముగిసిన కాలిగ్రఫీ తరగతులు
రాంనగర్ లో ఉన్న విశాఖ సేవాసదన్ స్కూల్లో కాలిగ్రఫీ తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 01/05/2023 నుంచి 20/05/2023 నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తంగి పార్వతి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కాశపు వి వి వి. సత్యనారాయణ, అడ్వకేట్ పాల్గొని కాలిగ్రఫీ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల రాతలో చాలా అద్భుతమైన తేడా కనిపిస్తుందని, ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని స్కూల్ మేనేజ్మెంట్ వారికి సూచించారు. ట్రైనర్ శ్రీవల్లి. కంచర్ల మాట్లాడుతూ
ఈ కాలిగ్రఫీ తరగతులకు చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలు వచ్చి రాయడంలో ఉన్న నైపుణ్యాలను చాలా చక్కగా నేర్చుకున్నారని, పిల్లలే కాక వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారని తెలిపారు. ఈ తరగతుల వలన పిల్లల్లో మంచి చేతి వ్రాత నైపుణ్యం మెరుగుపడిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం కూడా కాలిగ్రఫీ తరగతులు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఈ కార్యక్రమం పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు.