నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ…
అత్యాధునిక సదుపాయాలతో 13 లక్షల వ్యయంతో భవన నిర్మాణ పనులు ప్రారంభం…
అంబేద్కర్ కోనసీమడాక్టర్ బి.ఆర్ జిల్లా :
అంబేద్కర్ కోనసీమడాక్టర్ బి.ఆర్ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామంలో స్థానిక న్యూకాలాని సమీపంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి వైకాపా సీనియర్ నాయకులు సొసైటీ డైరెక్టర్ నెక్కంటి వెంకట్రాయుడు (బుజ్జి), సర్పంచ్ ఏడిద సత్య శ్రీ మెహర్ ప్రసాద్, వైకాపా గ్రామ అధ్యక్షుడు గొడవర్తి వెంకటేష్, సోమవారం భూమి పూజ చేసి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ,పిల్లలను దృష్టిలో ఉంచుకొని సరైన సదుపాయాలతో నూతన అంగన్వాడీల నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు కేటాయించారని తెలిపారు. సుమారు ,రూ.13 లక్షలతో వ్యయంతో అంగన్వాడీ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు, అంగన్వాడి కేంద్రాలను ఫ్రీ స్కూలుగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధునికరిస్తున్నారని,అద్దె భవనాలలో నడుస్తున్న అంగనవాడి కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం శాశ్వత భవనాలు ఏర్పాటు చేసి మౌలిక వసతులతో నూతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నెక్కంటి పరిమళాదేవి సూర్యప్రకాష్, మేడవరపు లక్ష్మణరావు, కంచర్ల గంగారావు, దొడ్డ సుబ్బారావు, దొడ్డ నాగమణి, పితాని గోపి, వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.