విజయవాడ:
రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కోసం అష్టోత్తర శతకుండాత్మక రాజశ్యామల యాగం
• వర్షంతో వరుణదేవుడు యజ్ఞ ప్రాంగణం శుద్ధిచేయడం శుభసూచకంగా భావిస్తున్నాం
• రేపు ఉదయం 7.14 గం.లకు ఎద్దుల నాగలితో శాస్త్ర ప్రకారం యజ్ఞశాలను దున్ని, నవధాన్యాలు జల్లి 108 కుండాల నిర్మాణ ప్రారంభోత్సవం
• మే 12వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 9 గం.లకు తొలిరోజు కార్యక్రమం ప్రారంభం
• రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలని చేపట్టే యజ్ఞంలో తొలిరోజు సంకల్పం తీసుకోనున్న సీఎం
• మే 12 నుండి 17 వరకు 6 రోజుల పాటు యజ్ఞధారణను స్వీకరించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
• మే 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా పూర్ణాహుతితో ముగియనున్న కార్యక్రమం
• ప్రతి ఒక్కరికి యజ్ఞ ప్రదక్షిణకు అవకాశం, 4 క్యూలైన్ల ఏర్పాటు..
: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
రాష్ట్ర సంక్షేమం కోసం, సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం, ప్రకృతి అన్ని రకాలుగా సహకరించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడం కోసం, ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పరిపాలన మరింత బలోపేతం అవడం కోసం “అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం” నిర్వహించనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యాగం ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ వరుణదేవుడు వర్షం కురిపించి యజ్ఞశాలను శుద్ధిచేయడం శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్య శ్యామలంగా ఉండి, లోక కళ్యాణ హితార్థం రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలనే లక్ష్యంతో స్థానిక మున్సిపల్ స్టేడియంలో మే 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు 6 రోజుల పాటు వేదపండితులు, రుత్వికులు, ఘనాపాటిల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, ఆగమ నియమాలకు అనుగుణంగా రాజశ్యామల యాగం నిర్వహించనున్నామన్నారు. రేపు ఉదయం 7.14గం.లకు బ్రహ్మ ముహూర్తంలో యజ్ఞశాలను ఎద్దుల నాగలితో శాస్త్ర ప్రకారం దున్ని నవధాన్యాలు జల్లి 108 కుండాల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ చేస్తామన్నారు.
రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలని చేపట్టే యజ్ఞం మే 12వ తేదీ తొలిరోజు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంకల్పం తీసుకోనున్నారన్నారు. అదే విధంగా యాగం జరిగే 6 రోజుల పాటు దేవాదాయ శాఖ మంత్రిగా యజ్ఞధారణను స్వీకరిస్తానన్నారు. మే 17వ తేదీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహా పూర్ణాహుతితో కార్యక్రమం ముగియనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఒక మంచి యజ్ఞం చేయడానికి సంకల్పించామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటం కోసం 108 కుండాలతో అద్భుతమైన, అపూర్వమైన అఖండ పుణ్య ప్రదాయకమైన యజ్ఞాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఒక్కో కుండానికి ఇద్దరు రుత్వికులు, వారికి సహాయకులు ఉంటారని తెలిపారు. యజ్ఞ క్రతువు నిర్వహించే 2 ప్రధాన కుండాలకు 16 మంది రుత్వికులుంటారన్నారు. రుత్వికులు వారికి అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారన్నారు. మంత్ర జపం సంఖ్య ఆధారంగా కుండాల వద్ద రుత్వికుల సంఖ్యను క్రోడీకరించుకుంటారన్నారు.
ఈ మహా యజ్ఞ క్రతువు 12వ తేదీన ఉదయాన్నే 5 గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రారంభం అవుతుందని మంత్రి వెల్లడించారు. ఈ యాగం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 లేదా 1 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం పూట 1008 కలశాలతో, సప్త నదులు, మూడు సముద్రాల జలాలతో మహాలక్ష్మీ స్వర్ణ ప్రతిమకు అభిషేకం జరుగుతుందన్నారు. ప్రతి రోజు సాయంత్రం వేళ ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. యజ్ఞ క్రతువులో జరిగే ప్రతి కార్యక్రమం పురాణాల్లో చెప్పినట్లుగా, ఆగమ శాస్త్ర నియమానుసారం జరుపబడుతుందన్నారు.
ఆరు రోజుల మహాయజ్ఞంలో వివిధ ప్రతిష్టాత్మక పీఠాధిపతులు పాల్గొన్ని ప్రజలకు వారు అనుగ్రహ ఆశీర్వచనాలు అందిస్తారని వెల్లడించారు. ప్రధానంగా శ్రీశైలం కంచికామకోటి, శారద, సిద్ధేశ్వర, పుష్పగిరి, శృంగేరి, దత్త పీఠం తదితర పీఠాల పీఠాధిపతులు పాల్గొని తమ ప్రవచనాల ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తారన్నారు.
ధర్మ ప్రచారం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, భావితరాలకు హిందూ ధర్మ గొప్పతనం చాటి చెప్పాలన్న సదుద్దేశంతో ఇటువంటి యజ్ఞాలు చేయడం ద్వారా అవగాహన ఏర్పడి భగవంతుని మీద మరింత భక్తి, విశ్వాసం కలుగుతాయని భావిస్తున్నామన్నారు. ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆగమ సలహా మండలి, అర్చక ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి నిష్ణాతుల సలహాలు, సూచనలు పాటించి ఈ క్రతువు నిర్వహిస్తున్నామన్నారు. 8 ఆగమాల్లో భాగంగా శైవ, వైష్ణవ, వైఖానస, పాంచనాత్రం, వీరశైవం, తంత్రసారం, గ్రామదేవత వంటివి సంపుటీకరణ చేసి యాగ విధివిధానాలను క్రోడీకరించి రూపొందిస్తున్నామన్నారు.
యజ్ఞ క్రతువులో భాగంగా తొలి రోజు విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దివ్యకళ్యాణం, రెండవ రోజు సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి, మూడవ రోజు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, నాల్గవ రోజు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, ఐదవ రోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వార్ల దివ్య కళ్యాణాలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
రెవెన్యూ, మున్సిపల్,ఫైర్, హోం తదితర శాఖలు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి యాగం విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను ముందుగా వెస్ట్ జోన్ ఇంచార్జ్ డీసీపీ విశాల్ గున్నీ, సబ్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు.
కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Vijayawada:
Ashtottara Shatakundatmaka Rajashyamala Yagam for the welfare of the state and all-round development
• Purifying the Yajna premises of Lord Varuna with rain is considered auspicious
• Tomorrow morning at 7.14 a.m. the construction of 108 Kundals of Yajnasala will be done by plowing bullocks according to Shastra.
• On 12th May Chief Minister Shri.Y.S. The first day program started at 9 am under the leadership of Jagan Mohan Reddy
• The CM will take a vow on the first day of the yajna for the prosperity of the people of the state
• Minister Kottu Satyanarayana who will take Yagnadharana for 6 days from May 12 to 17
• The program will end with Maha Purnahuti on 17th May at the hands of the Chief Minister
• Opportunity for Yajna Pradakshina for everyone, arrangement of 4 queues..
: State Deputy Chief Minister, Devadaya and Charities Department Minister Kottu Satyanarayana
For the welfare of the state, to achieve all-round development, for nature to cooperate in all ways and make the state at the top in all fields, for the further strengthening of the welfare administration implemented by Chief Minister Shri.YS Jagan Mohan Reddy, “Sri Lakshmi Mahayagnam with Chandi, Rudra, Rajashyama, Sudarshana Sahitya. State Deputy Chief Minister, Devadaya and Charities Department Minister Kottu Satyanarayana said that it will be organized. After inspecting the yagam arrangements at the Indira Gandhi Municipal Stadium in Vijayawada on Tuesday, the minister told the media that it is considered auspicious for Lord Varuna to purify the Yajna by raining. With the aim of making the state prosperous and green and the people of the state flourishing in the interest of world welfare, Rajashyamala yagam will be organized from 12th to 17th of May at the local municipal stadium for 6 days under the guidance of Vedic scholars, Rutviks and Ghanapatis in accordance with the rules of Agama. Tomorrow morning at 7.14 a.m. in Brahma Muhurtam, the yajna hall will be plowed with bullocks according to Shastra, and the seeds will be sprinkled for the opening ceremony of the construction of 108 Kundals.
The yajna to be undertaken for the prosperity of the people of the state on the first day of May 12 at 9 am, Chief Minister Shri.Y.S. He said that Jagan Mohan Reddy will take resolution. Similarly, he said that he will accept yajnadharana as the minister of religious affairs for the 6 days of the yagam. He said that the program will end with Maha Purnahuti on 17th May at the hands of the Chief Minister.
The minister said that for the first time in the history of Andhra Pradesh state, we have resolved to do a good yajna. He said that every family in the state is going to perform a wonderful, unprecedented Akhanda Punya Pradayaya Yajna with 108 kundas to make every family happy and in perfect health. He said that each pot will have two rutviks and their helpers. It is said that there are 16 rutviks for the 2 main kundas that perform the yajna kratu. He said that the Rutviks perform the responsibility assigned to them effectively. It is said that the number of rutviks at Kundala is collated based on the number of mantra chants.
The Minister revealed that this Maha Yajna will begin on the 12th at 5 am during Brahma Muhurta. The Yagum is held every day from 9 am to 12 or 1 pm and again from 6 pm to 9 pm. It is said that Mahalakshmi’s golden idol is anointed every morning with 1008 kalashas, waters of seven rivers and three seas. Every day in the evening, sermons and cultural programs are organized. He said that every program that takes place in Yajna Kratu is performed according to the rules of Agama Shastra, as mentioned in the Puranas.
It has been revealed that various dignitaries will participate in the six-day Mahayagna and offer blessings to the people. Principals of Srisailam Kanchikamakoti, Sharada, Siddheshwara, Pushpagiri, Sringeri, Datta Peetham and other Peethas will participate and spread awareness about Hindu religious preservation through their speeches.
He said that by performing such yajnas with the good intention of promoting Dharma, protecting Sanatana Dharma, preserving Hindu Dharma, and conveying the greatness of Hindu Dharma to future generations, awareness will be created and more devotion and faith in God will be created. He said that this ritual is being conducted by following the advice and instructions of the experts regarding the Agama Advisory Council and Archaka Training Academy, which is formed under the aegis of Dharmika Parishad. As part of the 8 Agamas, Saiva, Vaishnava, Vaikhanasa, Panchanatram, Veerashaivam, Tantrasaram and Gramdevata have been compiled and the yaga procedures are being codified.
Deputy Chief Minister informed that as part of the yajna ritual, Vijayawada Sridurga Malleswara Swamivarla Divyakalyanam will be held on the first day, Simhachalam Srivaraha Lakshmi Narasimhaswamy on the second day, Annavaram Sri Veeravenkata Satyanarayana Swamy on the third day, Dwaraka Tirumala Sri Venkateswara Swamy on the fourth day, Srisailam Sri Bhramaramba Mallikharjuna Swami Varla Divyakalyanam on the fifth day. .
Revenue, Municipal, Fire, Home and other departments should carry out their responsibility effectively and work hard to make the Yagum a success.
West Zone in-charge DCP Vishal Gunni and Sub-Collector Aditi Singh inspected the arrangements at the Indira Gandhi Municipal Stadium.
In the program, the commissioner of the Department of Religion S. Satyanarayana, senior officers and staff of the Department of Debt and others participated.