19.09.2023
డోన్: 77 చెరువులకు జలకళ కార్యక్రమం
డోన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఏమన్నారంటే…ఆయన మాటల్లోనే
బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ మంత్రి
అందరికీ నమస్కారం, పండుగ రోజు ఇంటికి వచ్చిన అల్లుడికి బహుమానం ఇచ్చి పంపుతాం, కానీ పండుగ పూట మనకు బహుమానం ఇవ్వడానికి మన అన్న వచ్చారు. కరువు ప్రాంతం డోన్, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయంలో వర్షపాతం తక్కువ, రకరకాల కరువులతో శతాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రాంతం, డోన్ నియోజకవర్గం ఒక్క ఎకరా కూడా నీటి పారుదల లేని ఇది ఇంతవరకు, ఈ పరిస్ధితుల్లో గత సీఎం చంద్రబాబు రెయిన్ గన్‌ల ద్వారా నీటిని కురిపిస్తానన్నాడు కానీ మన సీఎంగారు 77 చెరువులు, వంద గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నారు.
రైతుల త్యాగం తెలిసిన ప్రభుత్వం తెలిసిన సీఎంగారు ఇప్పుడు ఉన్నారు, ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుంది, గాజులదిన్నె ప్రాజెక్ట్ అనేక ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్ట్, ఈ విజయం మీదే, ఒక చెరువు కట్టాలంటే ఒక రాజుకు ఎన్నో గుణాలు ఉండాలంట, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే నమ్మకం సీఎంగారిది, రాయలు కట్టిన చెరువులు ఇక్కడ ఉన్నాయి, దశాబ్దం కింద ఒక్కగానొక్క కొడుకు రాష్ట్రానికి సేవ చేయాలని ముందుకొస్తే ధైర్యంగా పంపిన అమ్మ విజయమ్మను, మన సీఎంగారిని ఎంత అభినందించినా తక్కువే, డోన్ మాత్రమే ఈ రాష్ట్రంలో ఏకైక మాడల్ నియోజకవర్గంగా ప్రకటించారు. ఈ రోజు తండ్రి కొడుకులు యాత్రలు చేస్తున్నారు, ప్రతి ఊరికి వెళ్ళి అభివృద్ది ఎక్కడ అంటూ పచ్చి అబద్దాలు చెప్తున్నారు, ఒక్క డోన్ నియోజకవర్గంలోనే రోడ్లు చూడండి, మన సీఎంగారు మనపై చూపిన అభిమానం వల్లే ఇదంతా, మా నియోజకవర్గంలో పిల్లలకు చక్కటి చదువులు కావాలని అడిగిన వెంటనే స్కూల్స్, జూనియర్ కాలేజ్‌లు, హాస్టల్స్ కడుతుంది వాస్తవం కాదా అని అడుగుతున్నా, వేలాదిమంది పిల్లలు మంచి చదువులు చదువుతున్నది ఎవరి వల్ల, మన సీఎంగారి వల్ల, డోన్ నియోజకవర్గంలో 300 కోట్లతో 130 పైగా గ్రామాలకు ఓవర్ హెడ్ ట్యాంక్‌లతో శుభ్రపరిచిన నీరు అందబోతుంది ఎవరి వల్ల, మన సీఎంగారి వల్ల కాదా, అనేక క్షేత్రాలు, షాదీఖానాలు కడుతుంది వాస్తవం కాదా, పర్యాటక కేంద్రాలు కడుతుంది వాస్తవమా కాదా, డోన్‌లో అభివృద్ది సీఎంగారి చల్లని చూపు వల్లే, సాధ్యం కాని పని చేపట్టడమే ముందు చేయాలి, ఇవన్నీ చేసింది సీఎం గారా కాదా, ప్రతిపక్ష నాయకుడు అవకతవకలు చేసి రూ. 300 కోట్లకు పైగా కుంభకోణం చేస్తే దానికి నిరాహర దీక్షలు, దానికి తోడ్పాటు, ఎంత అన్యాయం, ఏపీ ప్రజలకు చైతన్యం లేదని, పిరికివారమని అందుకే తను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే వ్యక్తి వీరికి సపోర్ట్, ఇదంతా ప్రజలకు తెలియజేసేలా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు వివరిస్తాం.
సీఎంగారు ఎంత సింపుల్‌గా ఉన్నారో చూడండి, కాకీ ప్యాంట్, వైట్ షర్ట్ మాత్రమే, ఏపీలో ప్రతి పేదవాడికి ధన, మాన, ప్రాణ రక్షణ మన సీఎంగారు ఇస్తున్నారు, సీఎంగారికి ఒక విన్నపం, మా నియోజకవర్గంలో సూక్ష్మ సేదం ఇంకా ప్రోత్సహించాలి, డోన్ పట్టణానికి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, బేతంచెర్లలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను,
జై హింద్
జై జగనన్నా.