అమరావతి, నవంబర్ 3: ఏపీసీవోబీ (ఆప్కాబ్), డీసీసీబీలలో అవినీతి, అక్రమాలు చోటుచేసు కున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ హౌస్ కమిటీ ఈ రోజు అసెంబ్లీ భవనాలలోని కమిటీ హాల్లో సమావేశమైంది.
ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ శ్రీ ఎన్. అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. సభ్యులుగా శ్రీ ధూళిపాల నరేంద్రకుమార్, శ్రీ యార్లగడ్డ వెంకటరావు, శ్రీ బూర్ల రామాంజనేయులు , శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ మరియు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ రావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఏపీసీవోబీ, డీసీసీబీలకు సంబంధించిన ఆరోపణలపై విస్తృతంగా చర్చ జరిగింది. కమిటీ సభ్యులు ఈ అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ ఆరోపణలకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి కమిటీ తదుపరి సమావేశానికి సమర్పించాలని వ్యవసాయ మరియు సహకార శాఖాధికారులను ఆదేశించింది. కమిటీ తదుపరి సమావేశం నవంబర్ మూడవ వారంలో జరగనున్నది.


















































