====================
జిల్లా కలెక్టర్ల సమావేశంలో నీటి భద్రతపై రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 38 వేల 400 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయిని వాటిలో ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే తొలగించడంతో పాటు ఔట్ పాల్ స్లూయిజ్ ల సక్రమంగా ఉండేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.అలాగే సర్ప్లస్ సోర్సులన్నీ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వర్షాకాలం పూర్తయ్యేలోగా అన్ని చెరువులను పూర్తిగా నీటితో నింపాలన్నారు.
అదే విధంగా భూగర్భ జలమట్టం , స్థాయి వర్షాకాలానికి ముందు 8 మీటర్లు,వర్షా కాలం పూర్తయ్యాక 3 మీటర్లు ఉండాలని అన్నారు.
వివిధ డ్రైన్లపై ఉండే ఆక్రమణలను దశల వారీగా తొలిగించే విధంగా చూడాలన్నారు.జిల్లా కలెక్టర్లు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, డ్రైన్లపై ఎప్పటి కప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించారు.
రైతుల నుండి వసూలు కావాల్సిన నీటి సెస్ కు సంబంధించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు నీటి సెస్ చెల్లించాలని అడగకుండానే 90 కోట్ల రూపాయలను రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి చెల్లించారని సిఎంకు వివరించారు.మిగతా బకాయిలు వసూలుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండానే నీటి పన్ను నిధులను స్థానికంగానే కాలువలు, డ్రైన్లు తదితర వాటి నిర్వహణకే వినియోగిస్తామనే చైతన్యం రైతుల్లో కలిగించడం ద్వారా నీటి పన్ను వసూలుకు కృషి చేయాలని సూచించారు.
==================
తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….
“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” ఒకటైన జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ది అంశంపై రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….
#మూడు లైన్ డిపార్టుమెంట్లు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నాయి, అందులో ఆరోగ్య శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమం మరియు విద్యాశాఖలు ఉన్నాయి.
#ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మధ్య వయస్సు (Median Age) ప్రస్తుతం 32.5 సంవత్సరాలు, ఇది భారతదేశ సగటు (28.4 సంవత్సరాలు) కంటే ఎక్కువగా ఉంది. ఇది రాష్ట్రంలో వృద్ధ జనాభా శాతం పెరుగుతున్నదని సూచిస్తుంది. ప్రపంచస్థాయిలో నైజర్ (14.5 సంవత్సరాలు) అత్యంత యువ జనాభా కలిగిన దేశం కాగా, జపాన్ (49.5 సంవత్సరాలు) అత్యంత వృద్ధ జనాభా కలిగిన దేశంగా ఉంది.
#మొత్తం పుట్టిన శాతం (Total Fertility Rate – TFR) రాష్ట్రంలో 1.5గా నమోదైందీ, ఇది Replacement Level (2.0) కంటే తక్కువ. అంటే, రాష్ట్ర జనాభా స్థిరంగా లేక తగ్గే అవకాశం ఉంది. OECD దేశాల్లో ఇజ్రాయెల్ (2.9) అత్యుత్తమ స్థాయిలో ఉంది.
#జీవనాపేక్ష (Life Expectancy) ఆంధ్రప్రదేశ్‌లో 70.6 సంవత్సరాలు, ఇది భారతదేశ సగటు (72.03 సంవత్సరాలు) కంటే స్వల్పంగా తక్కువ. ప్రపంచస్థాయిలో హాంకాంగ్ (85.8 సంవత్సరాలు), జపాన్, సింగపూర్ అత్యధిక ఆయుష్షు కలిగిన దేశాలుగా నిలిచాయి.
#మహిళా శ్రామిక శక్తి పాల్గొనడం (Female Workforce Participation) రాష్ట్రంలో 31%, ఇది పురుషులతో పోలిస్తే 28% తక్కువ. దేశవ్యాప్తంగా ఇది 32.8–37% మధ్యలో ఉంది. ప్రపంచస్థాయిలో మడగాస్కర్ (82%), ఐస్లాండ్ (~80%), స్వీడన్ వంటి దేశాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి.
#ఉత్పాదకత (Productivity – GDP per Hour) ఆంధ్రప్రదేశ్‌లో *$9.20 (అంచనా)*గా ఉండగా, భారతదేశ సగటు $8.7 (96వ స్థానం). ప్రపంచంలో లక్సెంబర్గ్ ($146), ఐర్లాండ్ ($93), నార్వే (~$87) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
#ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నిర్వహణ మరియు మానవ వనరుల అభివృద్ధి (Population Management & Human Resource Development) పథకాన్ని రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, విద్య, మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించింది. ఈ కార్యక్రమం ద్వారా జనాభా వృద్ధిని సమతుల్యంగా ఉంచడం, తల్లీశిశు మరణాలను తగ్గించడం, మరియు మహిళల ఆర్థిక–సామాజిక స్థాయిని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది.
#సంజీవని ప్లాట్‌ఫాం (Sanjeevani Platform) ద్వారా ప్రతి గర్భిణీ స్త్రీ, శిశువు, మరియు వృద్ధుడి ఆరోగ్య పర్యవేక్షణ డిజిటల్‌గా జరుగుతోంది. ఈ వ్యవస్థ ద్వారా *MMR (Maternal Mortality Rate)*ను 30లోపు, *IMR (Infant Mortality Rate)*ను 17లోపు తగ్గించడమే లక్ష్యం. మహిళల ఉద్యోగాల్లో పాల్గొనడం 31% నుండి 35%కి పెరిగింది.
#అదనంగా, ఆరోగ్యం, విద్య, పోషణ, నైపుణ్యాభివృద్ధి, మరియు వృద్ధాప్య సంరక్షణ అంశాలు సమగ్రంగా అనుసంధానం చేయబడ్డాయి. స్కూల్ హెల్త్ ప్రోగ్రాములు, న్యూట్రిషన్ సపోర్ట్ స్కీములు, మరియు నైపుణ్య శిక్షణల ద్వారా యువతలో సామర్థ్యాభివృద్ధి సాధించబడుతోంది.
#ఈ విధంగా, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి పథకం రాష్ట్రంలో ఆరోగ్యకరమైన, విద్యావంతమైన, మరియు ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
# రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను ప్రతి దశలో మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జనాభా నిర్వహణ ఫ్రేమ్‌వర్క్ (New Population Management Framework) రూపొందించింది
#ఈ మోడల్ ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి దశ — గర్భధారణ, శిశు దశ, బాల్యం, యౌవనం, వయోజన దశ, మరియు వృద్ధాప్యం — ప్రత్యేక దృష్టితో పరిగణించబడుతుంది. ప్రతి దశలో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, నైపుణ్యాభివృద్ధి, మరియు సామాజిక రక్షణ అంశాలను సమన్వయపరచడం ద్వారా సమగ్ర మానవాభివృద్ధి లక్ష్యం సాధించబడుతుంది.
# గర్భధారణ సమయంలో Sanjeevani Platform ద్వారా గర్భిణీల పర్యవేక్షణ, బాల్యంలో Nutrition & Immunization Programs, యౌవన దశలో Skilling & Employment Programs, వృద్ధాప్యంలో Elder Care & Health Support Services వంటి చర్యలు చేపట్టబడుతున్నాయి.
#ఈ మోడల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి జీవన దశలో సమాన అవకాశాలు కల్పించడం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం, మరియు దీర్ఘకాలికంగా జనాభా సమతుల్యతను కొనసాగించడం.
#ఈ *జీవన చక్ర మోడల్ (Life-Cycle Model)* రాష్ట్రంలోని మానవ వనరుల అభివృద్ధి దిశగా ఒక సమగ్ర, స్థిరమైన వ్యూహరచనగా పనిచేస్తోంది.
==========
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్..
ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.
ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.
దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వీ జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.
ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.
ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
==================
తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….
“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….
#“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.
#ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.
#జీరో పావర్టీ (Zero Poverty): ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.
#*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.
#వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
#GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.
=========================

===============
అమరావతి- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభం
• ఆరు జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న కలెక్టర్లు.
• అల్లూరి జిల్లా, పార్వతీపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పై చర్చ.
• స్వర్ణాంధ్ర 2047, 10 సూత్రాల అమలు పై కలెక్టర్ల సదస్సులో చర్చ
• జాబ్ మేళాల నిర్వహణ, ఉద్యోగ ఉపాధి కల్పనపై సమీక్ష చేయనున్న సీఎం
• రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై కీలక సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి.
• లంచ్ బ్రేక్ తర్వాత శాంతిభద్రతలపై జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షించనున్న సీఎం, డీజీపీ
=====
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఉత్తమ విధానాలు (best practices) విజయగాధలుపై ఆరుగురు జిల్లా కలెక్టర్ల ప్రెజెంటేషన్..
ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఫౌండేషన్ లిటరసీ న్యూట్రిషన్ కు సంబందించిన కార్యక్రమం గురించి వివరిస్తూ మార్గదర్శి పేరిట కెరీర్ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. యాస్పిరేషనల్ ఇంజన్ నిర్మాణ్ కింద 2023 నుండి అన్ని పాఠశాలల్లో సూపర్ 50 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.యాప్ ఆధారిత టెస్టులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు పోందేలా కృషి చేసినట్టు చెప్పారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ముస్తాబు పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు ఈకార్యక్రమం ఎంతో దోహద పడిందన్నారు.వారి ద్వారా వారి కుటుంబ సభ్యుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుపడేందుకు అవకాశం కలిగిందన్నారు.
ముస్తాబు కార్యక్రమం కింద అన్ని పొఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రంగా కడుక్కుని,తల సక్రమంగా దువ్వుకుని మాత్రమే పాఠశాల లోపలికి అనుమతించేలా ఆదేశాలు ఇచ్చామని ఇది మంచి ఫలితాలు వచ్చాయని, విద్యార్థులే కాక వారి కుటుంబాల్లో వ్యక్తి గత పరిశుభ్రత స్థాయి మెరుగు పడిందని వివరించారు.
దీనిపై సియం చంద్రబాబు స్పందిస్తూ ఇది మంచి వినూత్న కార్యక్రమని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు.ఈవిధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రవేట్ పాఠశాలలన్నిటిలో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ప్రకటించారు.10 వ తరగతి వరకు అనగా సుమారు 79 లక్షల మంది విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత మెరుగు పరుచుకునేందుకు వీలుకలుతుందన్నారు.అంతేగాక ఆయా విద్యార్ధులకు చెందిన సుమారు 2 కోట్ల మందిలో ప్రభావం చూపుతుందని తెలిపారు.
ఏలూరు జిల్లా కలెక్టర్ కీర్తి జిల్లాల్లోని 16 మండలాల్లో ఐడి లిక్కర్ ప్రభావిత గ్రామాల్లోని 226 కుటుంబాలను గుర్తించి ప్రాజెక్టు మార్పు పేరిట కార్యక్రమాన్ని చేపట్టి వారిలో మద్యం అలవాటును దూరం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వారికి లైవ్లీ హుడ్ కార్యక్రమం కింద బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు.ఏలూరు జిల్లాను ఐడి లిక్కర్ రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.
ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ షిమాన్షు శుక్ల రైతులకు సంబంధించి చాంపియన్ ఫార్మర్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.ముఖ్యంగా రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పట్ల పూర్తి అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందుకై 45 రకాల వివిధ యాంత్రీకరణ పనిముట్లను గుర్తించి వాటిపై రైతుల్లో అవగాహన కలిగించేందుకు తెలుగులో కరపత్రాలు ముద్రించి రైతులందరికీ సర్కులేట్ చేశామని వివరించారు.అదే విధంగా వేరుశెనగ కు వాల్యూ ఎడిసన్ కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ అనే వినూత్న కార్యక్రమాన్ని హబ్ అండ్ స్కోప్ విధానంలో అమలు చేస్తున్నట్టు వివరించారు.విద్యార్థులకు మెరుగైన నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాదు మరియు కొంత మంది పౌష్ఠికాహార నిపుణుల సహకారంతో ఈవిధానాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందన్నారు.
ఈకార్యక్రమం విజయవంతంగా అమలుకు ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేసే రైతులను దీనితో టైప్ చేసి వివిధ రకాల కూరగాయలు స్మార్ట్ కిచెన్ కు నిరంతరం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.ప్రతి మండలంలో ఈస్మార్ట్ కిచెన్ విధానం సమర్థవంతంగా అమలు జరిగేలా మండలాల వారీగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి విజయవంతంగా అమలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని వివరించారు.
ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి ఇదొక మంచి వినూత్న కార్యక్రమని ఇది రాష్ట్రానికే గాక దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో రెవెన్యు రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు.వివిధ రెవెన్యూ రికార్డులు అన్నిటినీ డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు.
==============
అమరావతి
రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్లో ఏఐ వినియోగంపై ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతపురం కలెక్టర్ ఆనంద్.
అనంతపురంలో రెవన్యూ రికార్డులు సరిగ్గా లేకపోవటం, 22 ఏ లాంటి తీవ్రమైన అంశంగా ఉండేదని చెప్పిన అనంత కలెక్టర్.
సర్వేనెంబర్ లైబ్రరీ తయారు చేశామని వివరించిన కలెక్టర్ ఆనంద్.
రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని వివరించిన అనంతపురం కలెక్టర్.
అనంత జిల్లాలో గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రరీ సిద్దంగా ఉందని వెల్లడి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
* అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్ లో ఉంచండి.
* భూ రికార్డులకు సంబంధించిన ఆర్కైవ్స్ ను కూడా మేనేజ్ చేస్తున్నారు.. ఇలాంటి వాటికి చెక్ చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు ఉంది.
* రికార్డులు ఆన్ లైన్ లైబ్రరీలో ఉంచితే మానిప్యులేషన్ కు అవకాశం ఉండదు.
* బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి ఆలోచన చేసి ప్రతిపాదనలు కోరాం.
* 3 మెంబర్ కమిటీ సెలెక్ట్ చేసిన వాటిని కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు.
* అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ తరహాలోనే వినూత్న ఆలోచనలు చేయాలి.
* ఈ ఆరు కాన్సెప్టులూ జిల్లాల్లో గేమ్ ఛేంజర్లు గా మారతాయి.
* పూర్తిస్థాయిలో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ను మరింతగా విస్తృతపరిస్తే ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.
* ప్రజలకు ఏది కావాలో దాని పైనే కలెక్టర్ల సదస్సులో చర్చ జరుగుతోంది. ఇలాంటి చర్చలు సమావేశాలే కావాల్సింది.
* వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి మరింత వినూత్నంగా ఆలోచనలు చేసి మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ తో రావాలి.
* క్షేత్రస్థాయి నుంచే ఇన్నోవేషన్స్ రావాలి.
* ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనూ వినూత్న మార్పు వచ్చింది.
* 10 నిముషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవినీతి లేకుండా పంపిస్తున్నారు ఇది అభినందనీయం.
* ఈ తరహాలో పనిచేస్తే దేశం అంతా మన నుంచే నేర్చుకుంటారు.
* రెవెన్యూ శాఖను, రిజిస్ట్రేషన్ శాఖను అభినందిస్తున్నాను.
* 22ఏ భూముల విషయంలో ఏలూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో చేసిన మోడల్ ను ఇతర ప్రాంతాల్లోనూ చేయండి.
=================
అమరావతి
అల్లూరి జిల్లాలో సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్ ఆఫ్ నిర్మాణ్ పేరుతో అమలు చేసిన కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.
పదో తరగతి విద్యార్ధులకు మెంటారింగ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా కార్యాచరణ రూపొందించిన అల్లూరి జిల్లా కలెక్టర్.
ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధులకు టీచింగ్ ఎట్ రైట్ లెవల్ అనే విధానంతో నిర్మాణ్ రూపకల్పన.
తెలుగు, ఇంగ్లీష్ ,లెక్కలు సహా అన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకూ 90 వేల మంది విద్యార్ధులకు లబ్ది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• విద్యాశాఖ లాంఛ్ చేసిన ఈ తరహా బెస్ట్ ప్రాక్టీసెస్ ను జిల్లా కలెక్టర్లే డ్రైవ్ చేయాలి.
• టెక్నాలజీ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాలతో ప్రజలకు ప్రయోజనం కలిగించాలి.
• విద్యాశాఖలో మంచి ట్రాన్సఫర్మేషన్ జరగాలి.
• విద్యార్ధులు రాష్ట్రానికి దేశానికి, యావత్ ప్రపంచానికి భవిష్యత్ ఆస్తులు.
• కుప్పంలో విలువల బడి అనే కాన్సెప్టును కూడా ప్రారంభించారు.
• విద్యార్ధులకు విలువలు నేర్పడంతో పాటు క్రీడలు కూడా నేర్పిస్తున్నారు.
• నాలెడ్జితో పాటు విద్యార్ధులకు విలువలు కూడా చాలా ముఖ్యం.
• కలెక్టర్లు మరింత ఇంప్రూవ్డ్ మోడల్ తో ఈ తరహా కొత్త విధానాలు అమలు చేయాలి.
============================================
అమరావతి
పార్వతీపురం మన్యంలో ముస్తాబు అనే కార్యక్రమాన్ని వివరించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
పరిశుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపోందించటమే లక్ష్యంగా కార్యక్రమం
తద్వారా పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా మారుతున్నాయన్న చెప్పిన మన్యం కలెక్టర్
విద్యార్ధుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతోందని వివరించిన ప్రభాకర్ రెడ్డి.
రోగాల బారిన పడిన విద్యార్ధుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని వివరించిన మన్యం కలెక్టర్.
ముస్తాబు కార్యక్రమంపై రూపొందించిన వీడియోను ప్రదర్శించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• ముస్తాబు కార్యక్రమం నన్ను చాలా ఆకర్షించింది.
• మన్యం జిల్లాలో విద్యార్థులే ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని చెప్పే పరిస్థితి వచ్చింది.
• 79 లక్షల మంది విద్యార్ధులకు చేరేలా ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయండి.
• ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇది అమలు చేస్తే చిన్నారులకు అలవాటుగా మారుతుంది… అప్పుడు వాళ్ల ఇళ్ల పరిసరాలు కూడా బాగుపడతాయి.
• ఆలోచనతోనే ఆదాయం, సంపద సృష్టించే అవకాశం ఉంటుంది.
• చాలా మంది ఏదైనా పని చేయమంటే డబ్బులేవీ అని అడుగుతున్నారు… కానీ నిధుల్లేకుండానే అద్భుతమైన కార్యక్రమాలు చేయవచ్చు… దీనికి ముస్తాబు కార్యక్రమమే ఉదాహరణ.
• సింపుల్ ఇన్నోవేషన్ ఐడియాలతో ప్రభావం ఎక్కువ ఉంది.
================
అమరావతి
ఏలూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు మార్పు కార్యక్రమం అమలుపై ప్రజెంటేషన్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తెచ్చేలా ప్రాజెక్ట్ మార్పు అమలు చేసినట్టు వెల్లడించిన ఏలూరు కలెక్టర్.
ప్రాజెక్టు మార్పు ద్వారా 140 నాటుసారా తయారీ గ్రామాల్లో స్పష్టమైన మార్పు కన్పించిందని వివరించిన వెట్రిసెల్వీ.
నాటుసారా తయారీ కుటుంబాల ఆదాయం పెరిగేలా మైక్రో ఎంట్రప్రెన్యూర్స్ గా మారుస్తున్నామని చెప్పిన కలెక్టర్ వెట్రిసెల్వి
ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని అభినందించిన ముఖ్యమంత్రి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• ప్రాజెక్టు మార్పు అనే ఓ వినూత్న ఆలోచన ద్వారా నాటు సారా తయారీ దారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.
• కేవలం అరెస్టులు, కేసులతో వారి జీవితాల్లో మార్పు తీసుకురాలేం… ఇలాంటి కార్యక్రమాల ద్వారానే వారిలో మార్పు తీసుకురావచ్చని నిరూపించారు.
• ప్రాజెక్టు మార్పు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయండి.
• ఎక్సైజ్ శాఖ కూడా దీనిపై వర్క్ అవుట్ చేయాలి.
• స్పూర్తిని ఇచ్చేలా ఇలాంటి వినూత్న కార్యక్రమాలను అనుసరించండి.
• కేవలం నిధులతోనే అన్ని ఫలితాలను సాధించలేం.
• డ్రగ్స్ నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలి.
• డ్రగ్స్ తీసుకునే వ్యక్తులను కూడా మార్చేలా ఉపాధి కల్పించండి.
=============
అమరావతి
నెల్లూరు జిల్లాలో ఛాంపియన్ రైతు పేరిట వినూత్న కార్యక్రమం చేపట్టిన కలెక్టర్ హిమాన్షు శుక్లా.
ఛాంపియన్ రైతు ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇచ్చిన నెల్లూరు జిల్లా కలెక్టర్.
వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని వివరించిన హిమాన్షు.
ప్రతీ గ్రామంలోనూ ఓ ఛాంపియన్ ఫార్మర్ ను ఎంపిక చేసి మిగతా వారికి అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడి.
యాంత్రీకరణ పెంచటం, ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించటం, పంటల విలువ జోడింపు లాంటి ప్రక్రియలు చేపట్టామన్న నెల్లూరు కలెక్టర్.
కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించేలా చూస్తున్నామని వివరించిన హిమాన్షు శుక్లా.
ప్రకృతి సేద్యం, యాంత్రీకరణ ప్రోత్సహించేలా కార్యక్రమం చేపట్టామన్న నెల్లూరు కలెక్టర్.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• ఛాంపియన్ ఫార్మర్ అనే ఇనిషియేటివ్ బాగుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షూ శుక్లాను అభినందిస్తున్నాను.
• శాఖలన్నీ ఇంటిగ్రేట్ చేసి రైతులకు ప్రయోజనకరంగా మార్చవచ్చనేది నిరూపించారు.
• మానవ వనరులు సద్వినియోగం చేసుకునేలా ఛాంపియన్ ఫార్మర్ అనే వినూత్న ప్రయోగం బాగుంది.
• అమరావతిలోనే ఉండమని హిమాన్షును కోరాను… కానీ ఓ జిల్లాలో ఇంపాక్ట్ కలిగిస్తానని కలెక్టరుగా వెళ్లారు… చక్కగా పని చేస్తున్నారు.
• రైతు సేవా కేంద్రం, స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించే ఇలాంటి విధానాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు అవగాహన కల్పించాలి.
• చాంపియన్ ఫార్మర్ల ద్వారా స్వయం సహయక సంఘాలను ఏర్పాటు చేయడమో లేదా ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమో చేయండి.
• సీజనల్ పంటలతో పాటు హార్టికల్చర్ పంటలకు ఈ విధానాలను విస్తరించండి.
• రైతన్నా మీ కోసం కార్యక్రమం కూడా ఇటీవల రైతుల కోసం పెట్టాం. అంతిమంగా రైతులకు ప్రయోజనం దక్కాలి.
• వ్యవసాయ యాంత్రీకరణ క్లస్టర్ తో పాటు రైతులకు అందుబాటులో ఉండేలా చూడండి.
• రైతులకు వ్యయం తగ్గాలి, అత్యధిక ఆదాయం అందాలి.
All praise for Mustabu programme:
CM directs Collectors to implement Mustabu in all educational institutions
CM ask collectors to come up with innovative ideas to benefit people
AMARAVATI: Chief Minister N Chandrababu Naidu appreciating Mustabu programme introduced in Parvatipuram Manyam district to maintain personal hygiene among school going tribal students, opined that such innovative ideas will leave huge impact on people.
Congratulating district collector Prabhakar Reddy for coming up with the innovative idea of Mustabu during second day of Collectors conference at Secretariat today, the Chief Minister said that he was very much impressed when the students themselves stated that they are very happy with the Mustabu programme and the number of sick students also came down after introducing the programme with maintenance of personal hygiene.
The Chief Minister advised the collectors to come up with innovative ideas using technology for implementing best practices and to get results. He directed the district collectors to implement the Mustabu programme in their respective districts as it will leave huge impact on personal hygiene of people. He said if the programme was implemented in all educational institutions upto to 12th class across the state over 79 lakh students will get benefit and at the same time the students will insist on their parents to maintain personal hygiene which influence over two crore people in the state. Such innovative ideas with no financial commitment will leave huge impact on society and help to improve health of people, he added.
====================================================================
కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ప్రాజెక్టును వివరించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.
పౌష్టికాహారం విద్యార్ధులకు వేడిగా, రుచిగా అందించేలా ఈ స్మార్ట్ కిచెన్ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించిన కడప కలెక్టర్.
ప్రతీ మండలానికీ ఓ స్మార్ట్ కిచెన్ పెట్టి పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్న శ్రీధర్.
స్మార్ట్ కిచెన్ కోసం 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశామని వివరించిన కడప కలెక్టర్.
బేస్ కిచెన్ నుంచి ప్రతీ పాఠశాల 3 కిలోమీటర్ల లోపే ఉండేలా ప్రణాళిక చేసుకున్నామన్న వివరణ.
ప్రస్తుతం కడపలో 5 స్మార్ట్ కిచెన్లున్నాయని… జిల్లా వ్యాప్తంగా 33 స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పిన కలెక్టర్ శ్రీధర్.
ఈ స్మార్ట్ కిచెన్ విధానం బాగుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొత్సహించారని చెప్పిన శ్రీధర్.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…
• కడప జిల్లాలో చేపట్టిన స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టు దేశానికే మోడల్ గా మారింది.
• స్మార్ట్ కిచెన్… స్మార్ట్ హెల్త్… స్మార్ట్ చిల్డ్రన్ అన్నట్టుగా ఈ విధానాన్ని తీర్చిదిద్దాలి.
• అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి.
• స్మార్ట్ కిచెన్ ద్వారా తాజా, రుచికరమైన ఆహారం అందించటం, న్యూట్రిషనిస్టుల సహాకారం తీసుకోవటం మంచి ఆలోచన.
• నాచురల్ ఫార్మింగ్ ను కూడా దీనికి ఇంటిగ్రేషన్ చేయటం చాలా బాగుంది.
• స్మార్ట్ కిచెన్ కు సర్టిఫికేషన్ కూడా తీసుకోవటం అభినందనీయం, టీటీడీ తరహాలోనే తనిఖీ వ్యవస్థ ఉండాలి.
• రైతు బజార్లలోనూ నాచురల్ ఫార్మింగ్ ఉత్పత్తులు రావాలి. సర్టిఫికేషన్ తో పాటు డోర్ డెలివరీ వచ్చేలా ఉండాలి.
• స్మార్ట్ కిచెన్ల ద్వారా అంగన్ వాడీలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకూ ఆహారం అందించాలి.
• కడపలోని అన్ని స్కూళ్లల్లో చిన్నారులకు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించండి.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ…
• కడపలోని స్మార్ట్ కిచెన్ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు చూపించాం.
• ధర్మేంద్ర ప్రధాన్ కు స్మార్ట్ కిచెన్ విధానం నచ్చింది.
• రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
• స్మార్ట్ కిచెన్ల నిర్మాణం కోసం భూములను పరిశీలించాలి