ఏలూరు జిల్లా- పేదల సేవలో- ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
* డిమాండ్ ఆధారిత పంటలు వేసి ఎక్కువ ప్రయోజనం పొందాలి.
* సమీకృత వ్యవసాయ విధానాలు అవలంబించాలి
* డ్రోన్ లాంటి టెక్నాలజీలను వినియోగించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించుకోవాలి. దిగుబడులు పెరగాలి
* రూ.1.50 పైసలకే యూనిట్ చొప్పున ఆక్వా కల్చర్ కు విద్యుత్ సరఫరా
* ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందేందుకు రూ.850కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుంది
* కొబ్బరి, కోకో, కాఫీ లాంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాలి
* ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు అందిపుచ్చుకోవాలి. డిసెంబరు 3 తేదీన రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో చర్చించాలని నిర్ణయించాం
* సంక్షేమం,అభివృద్ధి, సుపరిపాలన ఇస్తామని మాట ఇచ్చి చేసి చూపిస్తున్నాం
* 2029కి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం.
* విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
* ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలిపాం. వీటి ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
* ఏలూరు లాంటి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కింద వీటికి చేయూత ఇస్తాం
* కొల్లేరులో ఉన్న సమస్యల్ని పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం
* 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం
* పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ. ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ చేంజర్ అవుతుంది
* గోదావరి, కృష్ణా డెల్టాల్లో నీటి ఎద్దడి సమస్యే ఉండదు. పంటల ప్రత్యామ్నాయం పట్ల రైతులు ఆలోచించాలి
* తెలంగాణా ప్రభుత్వం 10 ఎకరాల భూమి విక్రయిస్తే రూ.1350 కోట్లు వచ్చింది
* గతంలో చేసిన అభివృద్దే వల్లే ఈ స్థాయి అభివృద్ధి సాధ్యం అయ్యింది.
* అనంతపురం జిల్లాకు నీళ్లు ఇవ్వటంతో ఆర్ధికంగా ఆ ప్రాంత రైతులు నిలదొక్కుకున్నారు
* విశాఖ నగరానికి గూగుల్ సంస్థ రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
* విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు చేశాం
* అమరావతి కూడా ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నాం. మొదటి దశ పనులు 2028కి పూర్తి అవుతాయి
* పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలి
* గత పాలకులు ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదు.
* ఐదేళ్లలో గత పాలకులు చేసిన దానికీ- కూటమి 18 నెలల పాలనకూ తీవ్ర వ్యత్యాసం ఉంది
* జనవరి లోగా రాష్ట్రంలో గుంతల రోడ్లన్నీ పూడ్చి బాగు చేస్తాం. కొత్త రహదారులు కూడా నిర్మిస్తాం
* రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కాపాడేందుకు సంజీవని ప్రాజెక్టును తీసుకువస్తున్నాం
* రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
* గంజాయి పై గత పాలకులు ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదు. కఠినంగా వ్యవహరించలేదు
* గంజాయి డాన్ గా మారిన ఓ మహిళ కూడా ఇప్పుడు బయటకు వచ్చారు
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన ఒక్కటే చాలు
* ప్రస్తుతం బాబాయిని గొడ్డలితో చంపి వేరే వారిపై నెపం నెట్టే నేరాలు ఉన్నాయి
* మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది
* 2047 స్వర్ణాంధ్ర ద్వారా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తు్న్నాం
* తలసరి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.58 లక్షలకు పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం
* ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కూటమి కృషి చేస్తుంది
* కొందరు నటనతో కష్టపడుతున్నట్టు కనిపిస్తారు. వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.













































