ADVERTISEMENT
ఉత్తరాంధ్రలో సిఎం చంద్రబాబు నాయుడు పర్యటన
అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సాగిన ముఖ్యమంత్రి పర్యటన
పోలవరం ఎడమ కాలువ, భోగాపురం ఎయిర్ పోర్ట్, మెడ్ టెక్ జోన్ ను పరిశీలించిన సీఎం
జిల్లాలోని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల స్థితిగతులపై ఎయిర్ పోర్ట్ లో రివ్యూ చేసిన సిఎం
ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల హాజరు
రివ్యూలో ముఖ్యమంత్రి చర్చించి ఇచ్చిన ఆదేశాలు, ప్రస్తావించిన అంశాలు:-
• ప్రజలు కూటమిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. మళ్లీ 1995 నాటి సిఎం అని ప్రకటించాను. పాలన పరుగులు పెట్టాలి. అధికార యంత్రాంగం బాధ్యతతో పనిచేయాలి.
• నన్ను సంతోష పరిచే విధంగా అధికారులు వ్యవహరించవద్దు. ప్రజలకు మేలు చేసేలా పనిచేయండి. రెడ్ కార్పెట్లు వద్దు. మాది సింపుల్ గవర్నమెంట్…ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది మా విధానం.
• గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది. ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టులు అన్నీ మూలనపడ్డాయి. పుష్కర లిఫ్ట్ నుంచి అనకాపల్లికి నీరు తేవాలి అంటే రూ.800 కోట్లు ఖర్చుపెట్టాలి. ఇది పూర్తి అయితే 2 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది.
• విశాఖ పట్టణానికి కూటమి రుణపడి ఉంది. మాకు అలాంటి ఆదరణ ఈ ప్రాంతంలో ఉంది. విశాఖ అంటే హుద్ హుద్ ముందు…హుద్ హుద్ తరువాత అనే విధంగా మార్చాం. ఆ సమయంలోనే కొత్త ఎయిర్ పోర్టు గురించి ఆలోచన చేశాం. భోగాపురం ఎయిర్ పోర్ట్ తెచ్చాం. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి చేస్తాం. మరో 500 ఎకరాలు కూడా ఇచ్చి….ఎయిర్ పోర్ట్ అభివృద్ది చేస్తాం.
• ఎయిర్ పోర్ట్ కు అనుబంధంగా ఉండే రోడ్లను అభివృద్ది చేయాలి. 12 జంక్షన్ల వద్ద ఉన్న సమస్యను పరిష్కరించాలి. స్టేట్ హైవేకు కూడా ఎయిర్ పోర్టుతో కనెక్టివిటీ పెంచాలి.
• విశాఖ నుంచి భోగాపురం వరకు వయా భీమిలి మీదుగా బీచ్ కారిడార్ అభివృద్ది చేయాలి. రానున్న రోజుల్లో ఇవన్నీ చేపట్టి పూర్తి చేయాలి.
• మెడ్ టెక్ జోన్ ను మరింత అభివృద్ది చేయాలి. తదుపరి ఫేజ్ అభివద్ది చేయాలి. దీనిపై ప్రణాళిక సిద్దం చేయాలని కూడా ఆదేశించాను.
• బీచ్ రోడ్ ను శ్రీకాకుళం వరకు తీసుకుపోవాలి. మూలపేట వరకు రోడ్లను విస్తరించాలి.
• మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలు ఎక్కించాలి. నాడు స్థలం ఇచ్చిన దగ్గరే ట్రైబల్ యూనివర్సిటీ మొదలు పెడతాం.
• రైల్వే జోన్ కు అవసరమైన ల్యాండ్ ఇవ్వలేదనే వివాదం ఉంది. వాళ్లకు ఆమోద యోగ్యమైన స్థలం ఇచ్చి రైల్వే జోన్ పనులు పూర్తిచేయాలి
• పంచగ్రామాల సమస్యను, టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేయాలి.
• గంజాయి విషయంలో చిన్న పొరపాటు కూడా జరగకూడదు. గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి.
• గంజాయి, డ్రగ్స్ అనేది ఎక్కడా కనిపించకూడదు. పోలీసులు ఉక్కుపాద మోపాలి
• తప్పు చేసిన వారి ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదు. చట్ట ప్రకారం మనం ముందుకు వెళదాం.
• విశాఖ పోర్టులో పొల్యూషన్ ను తగ్గించాలి. దీనిపై ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి.
• ఎన్టిపిసి పవర్ స్టేషన్ ను గ్రీన్ పవర్ స్టేషన్ గా చేసేందుకు ముందుకు వచ్చారు. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపాము.
• విశాఖలో మంచి తాగునీటిని అందించాలి. నేరుగా ట్యాప్ నీరు తాగే పరిస్థితి రానున్న రోజుల్లో రావాలి. ఆ స్థాయిలో నీటి శుద్ధి జరగాలి.
• పోలవరం నీరు వస్తే విశాఖకు తాగునీటి సమస్యపరిష్కారం అవుతుంది.
• సింహాచలం భూముల్లో చాలా మంది ఇళ్లు కట్టుకున్నారు. అన్నీ పరిశీలించి వాళ్లకు అనుమతులు ఇవ్వండి. ఇలాంటి చోట కొంచెం హ్యూమన్ యాంగిల్ తో నిర్ణయాలు తీసుకోండి.
• విశాఖలో పెద్దఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి. బలవంతంగా భూములు తీసుకున్న వారి నుంచి మళ్లీ స్థలాలు వెనక్కి ఇప్పించాలి. భూ కబ్జాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరించండి.
• ఇవన్నీ రానున్న రోజుల్లో ఒక్కొక్కటిగా జరగాలి. ప్రతి అధికారి బాధ్యతగా, జవాబుదారీగా ఉండాలి.
• ప్రభుత్వం ఇకపై పరుగులు పెడుతుంది. అధికారులు కూడా ఆ స్పీడుకు సిద్దం కావాలి.
• వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరు అన్నారు. కానీ సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేశాం.
• చోడవరం -మాడుగుల మధ్యలో సెజ్ తీసుకువస్తాం. అవసరం అయిన భూములపై పరిశీలన జరపాలి.
• 13.5 శాతం నుంచి 10.3 కు గ్రోత్ రేట్ పడిపోయింది. దీని వల్ల ఒక శాతనికి రూ.15 వేల కోట్ల చొప్పున రూ.45 వేల కోట్ల రెవెన్యూ జనరేషన్ తగ్గిపోయింది. ఆ డబ్బు వచ్చి ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. అందుకే అభివృద్దికి, వెల్పేర్ కు సంబంధం ఉంది. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది…ఆ సంపదతో మళ్లీ సంక్షేమం అందించేలా ఉండాలి.
• రాష్ట్రంలో ఎకనమిక్ యాక్టివిటీ ఆగిపోయింది. ఇప్పుడు అన్నీ మొదలు కావాలి ఇప్పుడు ప్రజల్లో పెద్ద రిలీఫ్ కనిపిస్తోంది.
• రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడంపై దృష్టిపెట్టాను. మొన్నటి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ అయ్యింది.
• ఇప్పుడు అధికారులను కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో ఉంచాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT