దుబాయిలో మూడవ రోజు పర్యటనలో భాగంగా రేపు తెలుగు డయాస్పొరా సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
• దుబాయ్ లీమెరిడియన్ హోటల్ లో సాయంత్రం 6.30 గంటలకు తెలుగు ప్రజలతో ఎపి ఎన్ఆర్టి నేతృత్వంలో సమావేశం
• సమావేశానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్న యూఏఈలోని తెలుగు ప్రజలు
• యూఏఈతో పాటు కువైట్, సౌదీ అరేబియా, ఒమెన్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలనుంచి కూడా రానున్న తెలుగు ప్రజలు
• 2 వేల మందికి పైగా తెలుగు ప్రజలు వస్తారని నిర్వాహకుల అంచనా
• యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులు ఏర్పాటు చేసుకుని బృందాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే డయాస్పొరా మీటింగ్ కు వస్తున్న తెలుగు ప్రజలు
• ఏ దేశానికి వెళ్లినా అక్కడ తెలుగు ప్రజలతో డయాస్పొరా సమావేశంలో పాల్గొంటున్న సిఎం చంద్రబాబు
• సింగపూర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశానికి 2000 మంది హాజరు.
• యూఏఈ మీటింగ్ కు అంతకంటే ఎక్కువ తెలుగు ప్రజలు వస్తారని ఎపి ఎన్నార్టీ అంచనా.



















































