Chandrababu Cabinet: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం?
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న జరగనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) ఆధ్వర్యంలో తొలిసారి ఈ సమావేశం జరగనుంది.! ఆ మరుసటి రోజే 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏపీ లాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, ఇతర నిర్ణయాలను కేబినెట్‌లో పెట్టి ప్రభుత్వం ఆమోదం పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేబినెట్, అసెంబ్లీ సమావేశాలపై ఈ రోజు తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT