ADVERTISEMENT
Andhra Pradesh Budget 2025-26: తొలిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటిన ఏపీ బడ్జెట్.. కారణాలు
Feb 28 , 2025
సంక్షేమానికి ఈసారి పెద్ద పీట వేసిన ఏపీ ప్రభుత్వం గతంలో పోలిస్తే భారీగా కేటాయింపులు పెంచింది. దీంతో, ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు దాటింది.
ఎన్నికల హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం తాజా బడ్జెట్ ద్వారా స్పష్టంగా చెప్పింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపడంతో 2025-56 ఏపీ బడ్జెట్ తొలిసారిగా రూ.3 లక్షల మార్కును దాటింది. నేడు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. ఏకంగా రూ.10 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు. సంక్షేమానికి, వివిధ అభివృద్ధి పథకాలకు ఈసారి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గతేడాది రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఈసారి రూ.48,340 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్ రూ. 43,402.33 కాగా ఈసారి కేటాయింపులు భారీ స్థాయిల పెరిగాయి. మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు గతంలో ఇది రూ. 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు ఉండొచ్చని అంచాన వేసింది (AP Budget 2025-26).
AP Budget 2025-26: ఏపీ బడ్జెట్‌లో ఆ రంగానికి అధిక ప్రాధాన్యత
రాజధానిని పట్టాలెక్కిస్తున్నామని చెప్పిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ బడ్జెట్ అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పలు పథకాలకు కార్యక్రమాలకు భారీ కేటాయింపులు జరిపారు. ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు రూ.18,848 కోట్లకు చేరాయి. మూల ధన అంచనా వ్యక్తం రూ.32,712 కోట్లు నుంచి రూ.40,635 కోట్లకు పెరిగింది. జలవనరుల అభివృద్ధి బడ్జెట్ రూ.16,705 కోట్ల నుంచి రూ.18,020 కోట్లకు పెరిగింది. పాఠశాల విద్యకు గతంలో రూ. 29,909కోట్లు ఈసారి కేటాయింపులు రూ.31,806 కోట్లకు చేరాయి. గత బడ్జెట్‌లో పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు కాగా ఈసారి రూ.3,156 కోట్లు కేటాయించారు. యువజన, సాంస్కృతిక శాఖకు గతంలో 322కోట్లు కాగా ఈమారు రూ.469 కోట్లకు పెంచారు. పోలవరానికి రూ.6,705 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి గత బడ్జెట్‌లో రూ.39007 కోట్లు కేటాయించగా ఈసారి నిధులను రూ.47,456 కోట్లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి వరుసగా గతంలో రూ.18497 కోట్లు, రూ.7557 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు ఎస్సీలకు రూ.20,281 కోట్లు, ఎస్టీ సంక్షేహానికి రూ.8,159 కోట్లకు చేరాయి. ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు, మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించింది.
AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొ్న్నారు. వైసీపీ ప్రభుత్వం అప్పులనే కాదు.. చెత్తను వారసత్వంగా ఇచ్చిందని అన్నారు. చెత్త పన్ను వేయడమే కాకుండా.. 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండానే వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు. తెలుగు భాషాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయింపులు చేపట్టిన విషయాన్ని వెల్లడించారు. కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామని అన్నారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT