‘An inquiry is required on filling up of posts and transfers of Health Department and AYUSH Medical Officers – G.O.53
Click here for – G.O.53
ఆరోగ్య శాఖ, ఆయుష్ మెడికల్ అధికారుల బదిలీ లలో పోస్టుల భర్తీపై విచారణ అవసరం
వైద్య, ఆరోగ్య శాఖలో 2019 నుంచి 2023 మధ్య కాలంలో అనేక పోస్టులను అడ్డగోలుగా భర్తీ ,బదిలీ చేశారంటూ కొద్దిరోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అధికారి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా నేషనల్ హెల్త్ మిషన్‌తోపాటు వివిధ ప్రోగ్రామ్‌లలో భాగంగా చేపట్టిన సుమారు రెండు వేలకుపైగా పోస్టుల భర్తీలో, ఇంకా కొన్ని పోస్టుల బదిలీ పై
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సదరు ఉద్యోగి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2019 నుంచి 2023 మధ్య చేపట్టిన
విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
అనకాపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ
అధికారి డాక్టర్ బాలాజీకి బాధ్యత
విశాఖపట్నం, జూన్ 12
వైద్య, ఆరోగ్య శాఖలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో అనేక పోస్టులను అడ్డగోలుగా భర్తీ చేశారంటూ కొద్దిరోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అధికారి ఫిర్యాదు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం కేంద్రంగా నేషనల్ హెల్త్ మిషన్‌తోపాటు వివిధ ప్రోగ్రామ్‌లలో భాగంగా చేపట్టిన సుమారు రెండు వేలకుపైగా పోస్టుల భర్తీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ సదరు ఉద్యోగి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు అనకాపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీని ప్రభుత్వం నియమించింది. ఆయన బుధవారం విచారణ నిర్వహించారు. అనకాపల్లి ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు గతంలో విశాఖ ఆరోగ్య శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి మరోచోటకు బదిలీపై వెళ్లిన అధికారి, ప్రస్తుతం ఆరోగ్య శాఖ కార్యాలయంలోనే పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్, మరో కిందిస్థాయి ఉద్యోగి హాజరైనట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని, ఆయా పోస్టుల భర్తీ సందర్భంగా అనుసరించిన రోస్టర్, ఇతర వివరాలను విచారణ అధికారి అడిగి తెలుసుకున్నారు. అయితే, ఫిర్యాదు చేసిన ఉద్యోగి విచారణకు హాజరుకాలేదని తెలిసింది. దీంతో మరోసారి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఫిర్యాదులో అనేక అంశాలు పేర్కొన్నప్పటికీ..వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసిన అధికారికి విచారణ అధికారి సమాచారం అందజేశారు. ఆయా వివరాలను సమర్పిస్తే మరింత లోతుగా విచారణ చేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ఆ తరువాతే వివరాలు వెల్లడిస్తామని విచారణ అధికారి, అనకాపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలాజీ తెలిపారు.
ఆరోపణలు ఎన్నో..
వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్‌తోపాటు ఇతర పోస్టులు భర్తీ చేసినప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. వీటిపై అప్పట్లోనే పెద్దఎత్తున దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు, మూడుసార్లు నోటిఫికేషన్లు రద్దు చేసి మళ్లీ తిరిగి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.
అయినప్పటికీ ఈ పోస్టుల భర్తీ ,బదిలీల వ్యవహారంపై ఫిర్యాదులు రావడం గమనార్హం.