గ్రీన్ సిటీగా రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి స్వప్నమైన ప్రజా రాజధాని అమరావతిని ఆకు పచ్చని నగరంగా తీర్చుదిద్దుతున్నామని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థాసారథి అన్నారు. రాజధానిలో 30 శాతం అధిక ఆక్సిజన్ అందించే చెట్లతో సుం
దరీకరిస్తున్నామని నిష్ణాతులైన అధికారులను నియమించి రహదార్లు, పార్కులను ఆకర్షణీయమైన చెట్లతో బ్యూటిఫికేషన్ చేస్తున్నామని చెప్పారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సిద్ధార్థా హోటల్ మేనేజ్‌మెంట్ ప్రాంగణంలో ఫల, పుష్ప ప్రదర్శనలో అమరావతి నగరంలో ఏడీసీ చేపడుతున్న వివిధ గ్రీన్ ప్రాజెక్టులను సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం ఈ ప్రదర్శనలో ఏడీసీ స్టాల్‌ను ఆమె ప్రారంభించారు. ఇందులో అమరావతిలో నిర్మాణం జరుపుకుంటున్న ప్రభుత్వ భవనాలు, రహదార్ల వ్యవస్థ, పార్కులు, నర్సరీలు, వాగుల వెంబడి చేపడుతున్న సుందరీకరణల ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. నేటి తరం యువత పచ్చదనం పెంపొందించే అలవాటును చిన్నప్పటి నుంచే అలవరుచుకొని బావి తరాలకు ప్రాణవాయును అందించాలన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చే వారికి ప్రధానంగా విద్యార్థులకు రాజధానిలో చేపడుతున్న పచ్చదనం అభివృద్ధి ప్రాజెక్టులను ఏడీసీ ఉద్యానవన అధికారులు క్షేత్రస్థాయిలో వివరిస్తానని పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనలో ఏడీసీ ఉద్యానవన విభాగం ఉప సంచాలకులు బి.శ్రీనివాసులు, జి.ఆండాళ్, సహాయ సంచాలకులు డి.నవీన్‌కుమార్, కె.స్వాతి, హార్టికల్చ ఆఫీసర్ ఎన్.కిషోర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.














































