మూడు కేసుల్లోనూ ప్రధాన సూత్రధారి,A-1 ముద్దాయి చంద్రబాబే-స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎస్ డి సి)
కుంభకోణంతోపాటు,
ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్,
రాజధాని మాస్టర్ ప్లాన్ తో కలిపి మూడు స్కామ్ లలో ప్రధాన సూత్రధారి, A-1 ముద్దాయి మాజీ సీఎం చంద్రబాబు నాయుడని,నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మూడు కేసుల్లో సిఐడి కీలక ఆధారాలను సేకరించి, ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిందన్నారు. స్కిల్ కేసులో రూ 371 కోట్ల కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉండటం మనందరికీ తెలిసిన విషయమే నన్నారు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మూడుసార్లు మార్చి బాబు, మాజీ మంత్రి నారాయణ ఇతర మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు వారి వందిమాగతులు, బినామీలకు చెందిన వందలాది ఎకరాలు పక్కగా రింగ్ రోడ్ పోయేలా వంకర టింకరగా అలైన్మెంట్ను మార్చారన్నారు. దానితో తమ భూముల విలువలు లక్షల కోట్లకు అమాంతంగా పెంచుకునేలా రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చినందువల్ల ఈ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయారన్నారు. అలాగే రాజధాని భూముల కుంభకోణం లో ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీల, పేదలకు చెందిన అసైన్డ్ భూములను భయపెట్టి, బలవంతాన తక్కువ ధరలకు లాక్కొని, ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చి, తమకు తమ బినామిల పేర్లతో, విలువైన ప్లాట్లను కొట్టేసిన కేసులో బాబు, నారాయణ లింగమనేని బ్రదర్స్, లోకేష్ తదితరులు వరుసగా A-1, A-2…… A-6 గా సిఐడి సిట్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిందన్నారు.
ఈ కేసులే కాకుండా అన్నమయ్య జిల్లా, అంగళ్లు, పుంగనూరులో జరిగిన విధ్వంసం, పోలీసులు పై దాడి ఘటన కేసు ఎఫ్ ఐ ఆర్ లో కూడా బాబు A-1 ముద్దాయిగా ఉన్నారు. ఇప్పటికే స్కిల్ కేసులో A-1 ముద్దాయిగా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు, తను చేసిన అనేక ఆర్థిక నేరాల కేసుల్లో A-1 ముద్దాయిగా ఉన్నాడన్నారు. దీనితో వరుస అరెస్టులతో పాటు, 10 నుండి 20 ఏళ్ల పాటు జైలు శిక్షలు కూడా పడొచ్చని పలువురు న్యాయాన్నిపుణులు అభిప్రాయపడుతున్నారనీ మూర్తి తెలిపారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్