26-09-2023
స్కిల్ స్కామ్ పరారీ లో ఉన్న ముద్దాయిలందర్నీ సిఐడి కోర్టుల కప్పగించాలి
-అంకంరెడ్డి నారాయణమూర్తి
సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో, టిడిపి సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ, పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తుందని, అందులో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జి పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని దుబాయ్ కి పారిపోగా, డొల్ల కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ తదితరుల ఆచూకీ తెలియటం లేదంటున్న సిఐడి వెంటనే వారందరినీ పట్టుకొని, అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు అప్పగించాలని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి డిమాండ్ చేశారు. లోకేష్ ఢిల్లీలో ఉండగా, వెన్నంటి ఉండే కిలారు రాజేష్ ఎక్కడున్నాడో ఎవరికి అంతు పట్టటం లేదని బాబు, లోకేష్ ల ఆదేశాల మేరకే, రాజేష్ పరారై ఉంటారని నారాయణమూర్తి ఆరోపించారు. లోకేష్ యువ గళం పాదయాత్రకు రాజేష్ ప్రధాన నిర్వహకుడని, టిడిపి పార్టీ ఆర్థిక వ్యవహారాలు, పదవుల పందేరాలతో పాటు, అన్ని ముఖ్య వ్యవహారాలను చెక్కబెడుతూ, చక్రం తిప్పే కిలారు ఆచూకీ తెలియకుండా పరారీలో ఉంచడం ద్వారా, కేసులకు సంబంధించిన వాస్తవాలన్నింటినీ తొక్కిపట్టాలని తండ్రీ కొడుకులు భావిస్తున్నారన్నారు.
చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ గగ్గోలు పెట్టడం అంటే కోర్టుల్ని తప్పు పట్టటమేనన్నారు. ఏసీబీ కోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ స్కామ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, అక్రమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు లాక్కోవడం, ఫైబర్ నెట్, రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో ఐటీ నోటీసులు ఇచ్చిన కేసుల్లో బాబు ఏ-వన్ ముద్దాయిగా ఉన్నారన్నారు. ఇంకా 30 కేసుల్లో చంద్రబాబు నిందితుడని, ఆ స్టే లన్నీ ఎత్తివేస్తే, బాబు జీవితాంతం జైల్లోనే మగ్గాల్సి వస్తుందన్నారు. ఈ కేసులన్నింటిలో ముద్దాయిలుగా ఉన్న వారెవరూ పారిపోకుండా వారి పాస్పోర్టులు సీజ్ చేయాలని, పగడ్బందీగా సిఐడి వారిని పట్టుకొని కోర్టులకప్పజెప్పాలని మూర్తి విజ్ఞప్తి చేశారు.
అంకంరెడ్డి నారాయణమూర్తి
నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్