Agreement between IB (International Baccalaureate) and SCERT (State Council of Educational Research and Training) of Andhra Pradesh state government today (31.01.2024) in the presence of Chief Minister Y.S. Jagan Mohan Reddy
అమరావతి
కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియంలో బోధన, ప్రీ లోడెడ్ బైజూన్ కంటెంట్ తో కూడిన టాబ్ లు, ఐఎఫ్ పీలతో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ లాబ్ లు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఆధునిక మౌలిక సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంచే టోఫెల్ వంటి పరీక్షలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చి..
నేడు ధనిక, పేద విద్యార్థుల మధ్య ఉన్న విద్యాంతరాలను రూపుమాపేలా అంతర్జాతీయ విద్యాబోధన IBని సైతం ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్న జగనన్న ప్రభుత్వం..
మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా, నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు..
ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వ SCERTలో అంతర్జాతీయ విద్యాబోర్డు IB భాగస్వామ్యం..
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో IB (ఇంటర్నేషనల్ బాకాలారియేట్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ SCERT (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) ల మధ్య నేడు (31.01.2024) ఒప్పందం..
క్రమ పద్ధతిలో IB బోధన వైపు..
దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా IBని మన పాఠశాల విద్యాశాఖ SCERTలో భాగంగా చేస్తూ ప్రభుత్వ బడుల్లో IB విద్యా విధానం.. 2024-25 లో టీచర్ల సామర్థ్యం, నైపుణ్యం పెంచేలా శిక్షణ..! జూన్, 2025 నుండి ఒకటవ తరగతికి IB లో విద్యాబోధన.. జూన్ 2026 నుండి రెండో తరగతికి IB లో విద్యాబోధన.. ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుకుంటూ పోతూ 2035 నాటికి 10వ తరగతికి, 2037 నాటికి 12వ తరగతికి IB. రాష్ట్రబోర్డుల జాయింట్ సర్టిఫికేషన్..
(మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా, నెగ్గేలా తీర్చిదిద్దడంలో మరో కీలక అడుగు..)
ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వ SCERTలో అంతర్జాతీయ విద్యాబోర్డు IB భాగస్వామ్యం..
మన విద్యార్థులను IB విధానానికి సన్నద్ధులను చేస్తూ.. గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే ప్రక్రియకు 2019 నుండే శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం.. దీనిలో భాగంగా ఇప్పటికే..ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన- సీబీఎస్ఈ మొదలు IBదాకా ప్రయాణం.. మూడో తరగతి నుండి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్..
9 వస్తువులతో కూడిన విద్యా కానుక కిట్ లో భాగంగా బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ.. విద్యార్థులకు సులభంగా ఇంగ్లీష్ పాఠాలు అర్థమయ్యేలా…
4వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉచిత బైజూస్ కంటెంట్..
8వ తరగతి విద్యార్థులకు, బోధించే టీచర్లకు బైజూన్ ప్లే లోడెడ్ కంటెంట్ తో కూడిన ఉచితట్యాబ్ లు..
నాడు-నేడు ద్వారా ఐబీకి అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన..
6వ తరగతి ఆపైన ప్రతి తరగతిలోను డిజిటల్ బోధన.. ఇందుకోసం 6వ తరగతి ఆపైన ప్రతి తరగతి గదిలో ఉండేలా 62వేల ఐఎఫ్సీలు.. ఆధునిక డిజిటల్ విద్యాబోధనకు
1 నుండి 5వ తరగతి వరకు ప్రతి స్కూల్ లో ఉండేలా 45,000 స్మార్ట్ టీవీలు.. ఇంగ్లీష్ ల్యాబ్లకు ఊతమిస్తూ..
TOEFL: ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది నుండే ప్రతి స్కూల్లో 3వ తరగతి నుండి TOEFL ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి. తర్పీదు ఇస్తూ, TOEFL జూనియర్, ఇంటర్ లో TOEFL సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి ఆ అమెరికన్ సర్టిఫికెట్ అందజేత… ఈ మేరకు ఈటీఎస్ తో ఒప్పందం..
జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఉన్నతికి ఊతం…
ఈ 56 నెలల్లో రూ.73,000 కోట్ల వ్యయంతో విద్యారంగంలో సంస్కరణలు..
నేడు IBతో ఒప్పందం..
2024-25 విద్యా సంవత్సరంలో ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యం పెంచేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, SCERT, DIET సిబ్బంది. SSC, ఇంటర్మీడియట్ బోర్డుల సిబ్బందికి శిక్షణ అందించి IB సర్టిఫికేట్లు అందజేత.. ఈ విధంగా ఐబీ శిక్షణ పొందిన టీచర్లు, ప్రతిష్టాత్మక IB గ్లోబల్ టీచర్ నెట్ వర్క్ లో భాగం..
IB విద్యాబోధన ప్రత్యేకతలు..
ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతి..
బట్టీ చదువులకు స్వస్తి చెబుతూ థియరీతో పాటు ప్రాక్టికల్ అప్లికేషన్ పద్ధతిలో విద్యా బోధన..
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలకు ప్రోత్సాహం
ప్రస్తుత, భావి తరాల అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపకల్పన, బోధనా విధానం, మూల్యాంకనం..
క్లాస్ రూమ్ బోధనతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్), ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ కు సమ ప్రాధాన్యత..
ఇంటర్ డిసిప్లేనరీ కాన్సెప్ట్.. (నిజ జీవిత అంశాలు వివిధ సబ్జెక్టుల దృష్టికోణంలో అధ్యయనం చేయుట)..
IB విధానంలో విద్యనభ్యసించిన వారికి ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరకడం మూడు రెట్లు అధికం
IB విధానంలో విద్యనభ్యసించినవారికి ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు..