టెక్సాస్ కాల్పుల ఘటన లో హైదరాబాద్ కు చెందిన యువతి మృతి
హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది.
ఐశ్వర్య అమెరికాలో ఫర్‌ఫెక్ట్ జనరల్ కంట్రాక్ట్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. తల్లి పేరు అరుణ. కూతురు మరణవార్త తెలిసి వీరు శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
శనివారం టెక్సాస్‌లోని ఆలెన్ నగరంలో రద్దీగా ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 9మంది చనిపోయారు. మృతుల్లో తెలుగు అమ్మాయి ఐశ్వర్య ఉన్నారు. ఈ కాల్పుల్లో చిన్నారి సహా మరో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో మరో తెలుగమ్మాయి ప్రియాంక ఉన్నట్లు సమాచారం. బుల్లెట్ గాయాలైన ఆమెకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుణ్ని కాల్చి చంపేశారు. స్పాట్‌లోనే ఏడుగురు చనిపోయారని… మరో ఇద్దరు ఆసుపత్రిలో చనిపోయినట్టు ప్రకటించారు. దుండగుడు ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇది మాటలకు అందని విషాదమని టెక్సాస్ గవర్నర్ ప్రకటించారు. బాధితులకు సాయం అందించేందుకు అదికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అమెరికాలో తుపాకీ మోత సర్వసాధారణమైపోయింది. గన్ వయలెన్స్ ఆర్కైవ్ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 195కు పైగా కాల్పులు జరిగాయి.
కారు నుంచి కాల్పులు..
మాల్ వెలుపల నల్ల దుస్తులు ధరించిన దుండగుడు తుపాకీతో కారులో నుంచి దిగి కారు డోర్ వెనుక నుంచి షాపుల వెలుపల ఉన్న వారిపై కాల్పులు ప్రారంభించాడు. పక్కనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఉన్న ఓ వ్యక్తి ఈ మొత్తం ఘటనను షూట్ చేశాడు. ఈ వీడియోలో పలు రౌండ్ల బుల్లెట్లు కాల్చిన సౌండ్ వినిపించింది
A young woman from Hyderabad died in the Texas firing incident
Hyderabad: It is known that 9 people were killed in a shooting in a mall in Allen, Texas, USA. However, a 27-year-old Telugu girl lost her life in this incident. Tatikonda Aishwarya Reddy of Sarurnagar, Hyderabad was killed by thugs.
Aishwarya is working as a project manager in Perfect General Contracts Company in America. Her father’s name is Narsireddy. Rangareddy is working as a judge in the district court. Mother’s name is Aruna. They were overwhelmed with grief after hearing the news of their daughter’s death. A girl settled in America is crying after losing her life in the firing of thugs.
A gunman opened fire at a busy shopping mall in Allen, Texas on Saturday. 9 people died in this firing. Telugu girl Aishwarya is among the dead. Seven others including a child were injured in the firing. It is reported that Priyanka is another Telugu girl among them. She is currently being treated at the hospital with bullet injuries.
As soon as the police got the information about the shooting, they reached the spot and shot the assailant dead. Seven people died on the spot…two others were declared dead at the hospital. They are inquiring into the reasons why the assailant indulged in such atrocity. The governor of Texas declared that this is a tragedy beyond words. The officials said that they are making all arrangements to help the victims. Gun ownership has become more common in America in recent times. According to the Gun Violence Archive, there have been more than 195 shootings in America so far this year.
Firing from the car
Outside the mall, the assailant, dressed in black, got out of the car with a gun and started shooting at people outside the shops from behind the car door. A man in the adjacent parking lot shot the entire incident. In this video, the sound of multiple rounds of bullets is heard