వేడెక్కుతున్న ఖండం
పునరుత్పాదక వనరులే ముఖ్యం
భూతాపం
ప్రపంచంలో త్వరగా వేడెక్కుతున్న ఖండం యూరప్.. ఆ ఖండంలో ఐదేళ్లలో సగటున రెండింతలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, అక్కడ మాత్రం 2.3 డిగ్రీలు పెరుగుతున్నాయని టాప్ టు వాతావరణ నిర్వహణ సంస్థలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం..
వాతావరణం వేడెక్కడం జీవకోటి పై అనంత ప్రభావాన్ని చూపుతుందని మరీ ముఖ్యంగా మనుష్యుల ఆరోగ్యం పై తీవ్ర పరిణామాలుంటాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హిమాలయాల్లోని మంచు.. సముద్రాల్లోని గ్లేసియర్లు కరిగి ఆర్థికంగా దెబ్బతీస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ, యూరప్ యూనియన్ క్లైమేట్ ఏజెన్సీ కోపర్నికస్ లు సంయుక్తంగా వెల్లడించాయి. పునరుత్పాదక ఇంధనాలైన గాలి, సోలార్ , హైడ్రోఎలక్ట్రిక్ పవర్లను వినియోగించి ఖండాన్ని కాపాడాలని కోరాయి. 2023లో అత్యధిక భూతాపం ఐరోపాలో నమోదైందన్నారు.
గతేడాది ఐరోపాలో 43 శాతం పునరుత్పాదక వనరుల నుంచే విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందు ఏడాది 36 శాతం ఉత్పత్తి అయ్యింది. ఐరోపా దేశాలు శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ కంటే పునరుత్పాదకాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2015లో జరిగిన ప్యారిస్ క్లైమేట్ ఛేంజ్ లో తీసుకున్న నిర్ణయాల మేరకు పునరుత్పాదక వనరులనుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయినప్పటికీ అడవులు తగలబడటం, గ్లేసియర్లు కనుమరుగవ్వడంతో పెరిగిన వేడిగాలులు, మంచు కనుమరుగవడంతో ఉష్ణ్రోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని కోపర్నికస్ డిప్యూటీ అధికారి ఎలిజబెత్ హండౌక్ తెలిపారు. ఈ ఏడాది 30 ఏళ్ల గ్లోబల్ రిపోర్టును ప్రచురిస్తూ భూ తాపాన్ని తగ్గించేందుకు చేయవల్సింది చాలా ఉందన్నారు. తుఫాన్లు, వరదలు, అటవీ అగ్నిప్రమాదాల తో 150 మంది చనిపోగా… పర్యావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల 13.4 billion యూరోలు నష్టపోవాల్సి వచ్చింది.