అమరావతి -సచివాలయం.
జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు :
అమరావతి సచివాలయం లో వెలిగొండ ప్రాజెక్ట్ పురోగతి పై పవర్ పాయింట్
వెలిగొండ ప్రాజెక్టు – జాతికి అంకితం – నిజాలు
వెలిగొండ ద్వారా 43.58 టీఎంసీల కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించడం.
30 మండలాలలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు 15.25 లక్షల జనాభా కు తాగునీరు.
Nimmala Ramanaidu Press Meet on Veligonda Dt.28.01.2026 PPT PDF
1996లో చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
06.03.2024న అసంపూర్తి పనులతో పోలీస్ పహారా మధ్య జగన్ జాతికి అంకితం చేశారు .
ఇది ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలను నిలువునా మోసం చేయడం.
అసలు నిజాలు తెలుస్తాయనే ఉద్దేశంతో నిర్వాసితులను, రైతులను 144, 151 వంటి పోలీసు సెక్షన్లతో ఇంటికే పరిమితం చేసి జాతికి అంకితం అనే డ్రామా చేశారు.
పూర్తి కాని టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు
తేదీ 06.03.2024 నాటికి హెడ్ రెగ్యులేటర్ లో 4300 క్యూ. మీ పని మిగిలి ఉంది .
అత్యవసరమైన హాయిస్ట్ పనులు మొదలు పెట్టలేదు.
అసంపూర్తి పనుల వలన నీరు వదిలితే కూలిపోయే పరిస్థితి.
కూటమి ప్రభుత్వం 2200 క్యూ. మీ వింగ్స్, రిటర్న్లు పనిచేయడం జరిగింది .
మిగిలిన 2100 క్యూ. మీ పనులు శ్రీశైలం నీటిమట్టం తగ్గగానే జూన్ లోపల పూర్తి చేస్తాం. నీటిని నల్లమల్లసాగర్ కు చేరుస్తాము.
పూర్తి కాని టన్నెల్ – 1 పనులు
టన్నెల్-1 లో ఇంకా 1,20,000 క్యూ. మీ మట్టి తీయాలి.
ఈ మట్టి వలన 3,000 క్యూసెక్కుల టన్నెల్ పూర్తి సామర్ధ్యం మేరకు నీటిని తీసుకోలేము.
టన్నెల్-2 పనులను చేయడానికి అనుగుణంగా టన్నెల్-1 లో చేసిన 5 మార్గాలను తప్పనిసరిగా పూడ్చి వేయాలి.
పూర్తి కాని టన్నెల్ – 2 బెంచింగ్ పనులు
2024 నుండి 18 నెలల కాలంలో 4,563 మీటర్ల మేర బెంచింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది.
ఈ పురోగతి కూటమి ప్రభుత్వం నిబద్ధతకు తార్కాణం.
నేడు కొనసాగుతున్న బెంచింగ్ పనుల వేగం చంద్రబాబు చిత్తశుద్దికి నిదర్శనం,
జగన్ పాలనలో బెంచింగ్ పనుల మందగతి వారి ప్రభుత్వ నిర్వాకానికి ఉదాహరణ.
పూర్తి కాని టన్నెల్ – 2 లైనింగ్ పనులు
తేదీ 06.03.2024 నాటికి టన్నెల్ -2 లో 6,940 మీటర్లు మేర ఉన్న లైనింగ్ పనులు పూర్తి చేయలేదు.
ఈ లైనింగ్ పూర్తి కాకపోతే సొరంగ మార్గం కుప్పకూలే అవకాశం ఉన్నది.
SLBC కి సంబంధించి గత సంవత్సరం నందు సొరంగ మార్గం కొంత భాగం కుప్ప కూలి 8 మంది చనిపోయిన ప్రమాదం దీనికి ఉదాహరణ.
2024 నుంచి నేటి (27-01-2026) వరకు (18 నెలలలో) 3708 మీటర్లు పనులు జరిగాయి.
6940 మీ లైనింగ్ పనులు పూర్తికాకుండానే ప్రాజెక్టు పూర్తైనట్లు జగన్ ప్రచారం మరో విడ్డూరం.
పూర్తి కాని TBM తొలగింపు పనులు
టీబీఎం టన్నెల్-2 లో 11.847 కి.మీ వద్ద 10 మీ ల వ్యాసం తో పూర్తి సొరంగాన్ని మూసివేస్తూ అడ్డంగా ఉంది.
ఇది 175 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది అడ్డంగా ఉండటం వలన 8,500 క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న టన్నెల్ నుండి ఒక చుక్క నీరు కూడా ముందుకు పోయే అవకాశం లేదు.
గత ప్రభుత్వ నిర్వాకం వలన 30.12.2023 న గుత్తేదారులు రిట్ పిటిషన్ ద్వారా గౌరవ హైకోర్టు నుండి స్టే పొందారు.
సమస్యను పరిష్కరించడానికి ఏ విధమైన ప్రయత్నం చేయకుండా, జాతికి అంకితం చేశారు.
ఈ సమస్య పరిష్కారం కాకుండా నీరు తీసుకోలేము.
పూర్తి కాని ఫీడర్ కాలువ పనులు
టన్నెల్స్ నుంచి వచ్చిన నీరు రిజర్వాయర్లో చేర్చడానికి అత్యవసరమైనది ఫీడర్ కెనాల్.
ఈ ఫీడర్ కెనాల్ పరిస్థితి ఎలా ఉందంటే 100 క్యూసెక్కుల వర్షం నీటికే గండ్లు పడ్డాయి .
భౌగోళిక పరిస్థితి మరియు నేల స్వభావాన్ని బట్టి లైనింగ్ ,సిసి వాల్ లేకుండా నీరు ముందుకి పోయే అవకాశం లేదు.
11,500 క్యూసెక్కుల నీటిని ఫీడర్ కెనాల్ ద్వారా రిజర్వాయర్లోకి మళ్లించుటకై కూటమి ప్రభుత్వం రూ.456 కోట్లతో లైనింగ్ & CC వాల్స్ కొరకు పరిపాలన అనుమతి ఇచ్చారు.
ఈ పనులు ఈ నెలలోనే ప్రారంభమవుతున్నాయి .
వెలిగొండ నందు ఒక పక్క శంకుస్థాపన, భూమి పూజ జరుగుతుంటే ఈ పనులు మొదలే పెట్టకుండా జాతికి అంకితం చేయడం అనేది ప్రజలను ఎంతగా మభ్యపెట్టడమో ఆలోచించండి.
పూర్తి కాని కాలువ హెడ్ రెగ్యులేటర్ పనులు
గత ప్రభుత్వం లో జాతికి అంకితం చేసేనాటికి తీగలేరు, తూర్పు ప్రధాన కాలవ రెగ్యులేటర్ల పనులు పూర్తి కాలేదు.
నల్లమల సాగర్ లో నీరు నిల్వ చేయడానికైనా, విడుదల చేయడానికైనా, హెడ్ రెగ్యులేటర్లు అత్యవసరం.
కూటమి ప్రభుత్వం లో తీగలేరు సివిల్ పనులు పూర్తయ్యాయి.
గేట్లు తయారీ జరుగుతుంది.
తూర్పు ప్రధాన రెగ్యులేటర్ పనులు జరుగుతున్నాయి.
ఈ పనులన్నీ జూన్ 2026 కు పూర్తి అవుతాయి.
పూర్తి కాని 9.60 కి. మీ డైవర్షన్ రోడ్డు పనులు
తేదీ 06.03.2024 నాటికి అత్యవసరమైన డైవర్షన్ రోడ్డు పనులు 85 శాతం మిగిలి ఉన్నాయి.
రిజర్వాయర్ లో నీటిని నింపినప్పుడు ఈ రోడ్డు 13 గ్రామాలకు రహదారిగా ఉంటుంది. ఇది పూర్తి కాకుండా నీరు నింపలేము.
కూటమి ప్రభుత్వం లో డైవర్షన్ రోడ్ పనులు తిరిగి మొదలుపెట్టి మట్టి రోడ్ పూర్తి చేయడం జరిగింది.
WBM పనులు మొదలైనాయి. కల్వర్టు పనులు పురోగతిలో ఉన్నాయి.
నాడు జగన్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా దగా చేసాడు.
11 ముంపు గ్రామాల్లోని మిగిలిన 7,225 నిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకుండా, జాతికి అంకితం చేయడం చూస్తే, ముంపు బాధితులను జగన్ ప్రభుత్వం ఎంత ఘోరంగా నిర్లక్ష్యం చేసిందో స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ నిర్వాసితుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించటానికి గాను దాదాపు రూ. 886 కోట్లు అవసరం.
5 సం!!ల జగన్ పాలనలో ఒక్క రూపాయు కూడా నిర్వాసితులకు చెల్లించలేదు.
పూర్తి కాని R & R పనులు
వేములకోట మరియు దేవరాజుగట్టు పునరావాస కేంద్రముల పనులు 2014-19 లో చేసిన పనులు తప్ప, 2019-24 మద్య పనులు జరగలేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు పురోగతిలో వున్నాయి.
గత ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన తేదీకి పూర్తి కాని ప్రాజెక్ట్
తేదీ 20.02.2020 న ప్రాజెక్టును సందర్శించినప్పుడు, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు మొదటిగా ప్రకటించిన తేదీ 31.08.2020.
రెండోసారి తేదీ 07.10.2021 న ఒంగోలు బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 31.08.2022.
మూడోసారి తేదీ 24.08.2022 న చీమకుర్తి బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 30.09.2023.
నాలుగోసారి తేదీ 12.04.2023 న మార్కాపురం బహిరంగ సభలో, ప్రాజెక్ట్ పూర్తి చేయుటకు ప్రకటించిన తేదీ 31.10.2023.
ఇవన్నీ సాధ్యం కాకపోయేటప్పటికి ఎన్నికలకు ముందు 06.03.2024 న జాతికి అంకితం అంకితం అంటూ డ్రామా ఆడారు.
అసంపూర్తిగా ఉన్న పనులతో మభ్యపెట్టి జాతికి అంకితం అంటే ప్రకాశం,నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు ద్రోహం చేయడమే.
జాతికి అంకితం – బడ్జెట్ పై వై కా పా నాయకుల ద్వంద వైఖరి
నాడు వెలిగొండ పూర్తయినట్లుగా తేదీ 06.03.2024 న జగన్ జాతికి అంకితం చేశారు.
నేడు వై కా పా MLA లు వెలిగొండ కు బడ్జెట్ కేటాయింపులు సరిపోవు, ఇంకా ఎక్కువ కేటాయించాలని అంటున్నారు.
బడ్జెట్ కేటాయింపులు కోరడం ద్వారా పూర్తవ్వని ప్రాజెక్టును పూర్తయినట్లుగా జగన్ చెప్పి ప్రకాశం జిల్లా రైతులను, ప్రజలను మోసం, దగా చేశారని స్వయంగా వై కా పా MLA లు అంగీకరిస్తునారు.
2024 – 25 మరియు 2025 – 26 లో రూ . 393.49 కోట్లు మరియు రూ . 309.13 కోట్లు కేటాయించటం జరిగింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ 570.85 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. 2024-25 లో రూ 366.41 కోట్లు మరియు 2025-26 లో డిసెంబర్ వరకు రూ 204.44 కోట్లు ఖర్చు చేయటం జరిగింది. ఫీడర్ కెనాల్ లైనింగ్ & వాల్స్ కు రూ. 456 కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది.

























































