ప్రతిష్టాత్మకమైన సిఎస్ఆర్ అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు 2024 అందుకున్న విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం
అమరావతి: విఐటి – ఏపి విశ్వవిద్యాలయం 2024 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన సిఎస్ఆర్ అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డ్‌ను అందుకుంది. భారతదేశంలో 60 సంవత్సరాలకు పైగా ప్రచురణ రంగంలో ఉన్న కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ (CSR), విద్యాపరమైన నైపుణ్యం మరియు సమగ్ర అభివృద్ధికి విఐటి – ఏపి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ అవార్డు అందించటం జరిగింది.
ఈ అవార్డు ను అందుకున్న సందర్బంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ 2024 సంవత్సరానికి గాను సిఎస్ఆర్ అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. ఈ అవార్డు మా అధ్యాపకులు, సిబ్బంది, రిసెర్చ్ స్కాలర్స్ మరియు విద్యార్థుల అకడమిక్ ఎక్సలెన్స్ మరియు సామాజిక పురోగతి పట్ల అచంచలమైన అంకితభావానికి నిదర్శనామాని తెలియచేసారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ అవార్డు విశ్వవిద్యాలయం విద్య మరియు పరిశోధన యొక్క ప్రమాణాలను మరింత పెంచడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అన్నారు.
ఫోటో కాప్షన్ : న్యూ ఢిల్లీలో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సిఎస్ఆర్ (కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ) మ్యాగజైన్ ఛైర్మన్ మరియు ఎడిటర్ సురేంద్ర కుమార్ సచ్‌దేవా నుండి 2024కి ప్రతిష్టాత్మక అవుట్ స్టాండింగ్ యూనివర్సిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డును అందుకుంటున్న వి ఐ టి -ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్. వి. కోటా రెడ్డి.