ఎన్నికల బందోబస్తు ఇతర ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ సిఎస్,డిజిపి,సిఇఒ లతో వీడియో సమావేశం.
అమరావతి,3 ఏప్రిల్:త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతలు,భద్రతా బలగాల మోహరింపు,ఎన్నికల వ్యయ నిర్వహణ సెన్సిటివిటి,నోడలు అధికారుల నియామకం, నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు పెయిడ్ హాలిడే, అంతర్జాతీయ సరిహద్దు అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర ఎన్నికల కమీషనర్లతో కలిసి వివిధ రాష్ట్రాల సిఎస్, డిజిపి,సిఇఒ తదితర అధికారులతో వీడియో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి,డిజిపి కెవి. రాజేంద్రనాధ్ రెడ్డి,సిఈఓ ముకేష్ కుమార్ మీనా,ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్ కుమార్ ప్రసాద్,రజత్ భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డిజిపి ఎస్.బాగ్చి,చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, ఎక్సైజ్ కమీషనర్ వివేక్ యాదవ్,ఎస్ఇబి డైరెక్టర్ యం. రవి ప్రకాశ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.