ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ఏ పార్టీ అనిచూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
ఎ్రరగుంట్లలో 1391 ఇళ్లకు రూ.48,74,34,136 అందించాం
ఇంత చొన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?
ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మల ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది
ఎ్రరగుంట్లలో ప్రజలతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి
నంద్యాల: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని, మన తలరాతలు మార్చేవని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నియోజవర్గంలోని ఎ్రరగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:
ఈ యర్రగుంట్ల దాదాపుగా 2 సచివాలయాల పరిధికి సంబంధించిన గ్రామం ఇది. ఒక సచివాలయంలో 1486 ఇళ్లు, మరో సచివాలయంలో 1519 ఇళ్లు.. ఈ రెండు సచివాలయాల పరిధిలో మొత్తం 3005 ఇళ్లు ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగాను. ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ ప్లే చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట కూడా చేయడం జరిగింది.
ఈ గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఏయే పథకాల్లో ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారని చెప్పి, ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించాను.
యర్రగుంట్ల గ్రామంలో 93.60 శాతం లబ్ధిదారులు
నిజంగా బహుశా ఎవరికీ కూడా ఊహకు అందని విషయాలు.. ఈ ఒక్క సచివాలయం గమనిస్తే చాలు, ఈ యర్రగుంట్ల పరిధిలోని 3005 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే, ఓ సచివాలయం పరిధిలో 1486 ఇళ్లకు గానూ… ఏకంగా 1391 ఇళ్లు అంటే 93.60 శాతం వివిధ పథకాల్లో లబ్ధి పొందగా… అదే యర్రగుంట్ల రెండో సచివాలయం పరిధిలో 1519 ఇళ్లకు గానూ, 1448 ఇళ్లుకు చెందిన లబ్ధిదారులు వివిధ పథకాల్లో లబ్ధి పొందారు.. అంటే ఏకంగా 95.32 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరింది.
గమనించినట్లయితే, ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికీ అందింది అని డీటెయిల్స్ తెప్పిస్తే, అదే సచివాలయంలోనే డిస్ ప్లే చేశారు.
అర్హతే ప్రామాణికంగా..
ఆశ్చర్యం కలిగించే నంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాలా ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ రైతు భరోసా, ఓ అమ్మ ఒడి, ఓ ఆసరా, ఓ వైయస్సార్ చేయూత, ఓ జగనన్న విద్యాదీవెన, హౌసింగ్ కు సంబంధించిన డైరెక్టుగా డీబీటీ, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న వసతి దీవెన, సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులు, క్రాప్ ఇన్సూరెన్స్, జగనన్న తోడు, చేదోడు, కాపు నేస్తం, వైయస్సార్ బీమా, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, కోవిడ్ కు సంబంధించిన టైమ్ లో కోవిడ్ సహాయం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, సున్నావడ్డీ పంట రుణాలు, కల్యాణమస్తు, వాహన మిత్ర, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్.. ఇలా మొత్తంగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం.. ఎక్కడా ఎవరూ కూడా లంచాలు అడగడం లేదు. ఎక్కడా ఎవరూ కూడా వివక్ష చూపించడం లేదు. ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, అడగడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు.
3005 ఇళ్లకు రూ.48.74 కోట్లు
అర్హత ఉంటే చాలు.. ఆ ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాలను చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్లు నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 3005 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెబుతున్నాను. రూ.48,74,34,136 నేరుగా వివిధ పథకాల ద్వారా అందాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు.. వైయస్సార్ పెన్షన్ కానుక కింద రూ.16,52,71,500 ఈ ఒక్క ఊర్లో నే అందింది. నా అవ్వాతాతల ముఖంలో, వితంతువులైన అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, వికలాంగులైన అక్కచెల్లెమ్మలు, సోదరుల ముఖాల్లో అండ, తోడు కనపడాలని ఈ కార్యక్రమం జరిగింది.
వైయస్సార్ రైతు భరోసా కింద రూ.6,80,96,500, అమ్మ ఒడి కింద 1043 మంది తల్లులకు రూ.4,69,35,000.. ఈ ఒక్క గ్రామంలోనే అందింది. వైయస్సార్ ఆసరా కింద రూ.3,88,16,374, వైయస్సార్ చేయూత కింద 492 మంది నా అక్కచెల్లెమ్మలకు రూ.2,96,25,000, జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు రూ.2,46,41,602 కోట్లు.. ఇలా చదువుకుంటూ పోతే.. హౌసింగ్ కింద రూ.2,75,72,361, ఆరోగ్యశ్రీ కింద రూ.2,24,21,596, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.1,13,71,570 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.1,00,98,149, సున్నావడ్డీ కింద రూ.86,48,916, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67,26,205, జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు రూ.41,30,000, కాపు నేస్తం కిద రూ.31,20,000, చేదోడు కింద రూ.40,40,000, జగనన్న తోడు కింద రూ.41,30,000 లోన్లు, వైయస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21,48,200 ఇలా మొత్తంగా చూస్తూ పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.60 శాతం మంది బెనిఫిషరీస్, ఎక్కడా ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడా ఎవరూ వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము రూ.48,74,34,136.
నాన్ డీబీటీ ద్వారా కూడా..
ఇది కాక మన ప్రభుత్వం చేస్తున్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒక్కసారి గమనిస్తే, అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి 468 మందికి, ఇళ్లు అయిపోయిన వారు 144 మంది, రైస్ కార్డులకు సంబంధించి 2,594కు సంబంధించి, 8వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు 76 మందికి ఇచ్చాం. విద్యాకానుక కింద 670, సంపూర్ణ పోషణ కింద 189. వీటికి సంబంధించి నేను చెప్పడం లేదు. ఇవన్నీ ఇన్ డైరెక్టుగా ఇస్తున్నాం కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్లడం.. ఇవే చూసుకుంటే రూ.48,74,34,136.
నేను అడుగుతున్నాను. మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్న పిల్లోడిని. నా కన్నా పెద్దవాళ్లు, నాకన్నా అనుభవం గలవారు, నా కన్నా చాలా అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునేవారు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నా మీ అందరితో కూడా. ఇంత మందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నా కన్నా ముందు 75 ఏళ్ల ముసలయాన పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అటువంటి గొప్ప గొప్ప పాలనలను మీరు చూశారు కదా.. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. నేను చాలా చిన్నోడ్ని. వయసులో కూడా చిన్నోడిని. ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎక్స్ పీరియన్స్ ఉన్నోళ్లు ఏపొద్దయినా చేశారా అని అడుగుతున్నాను. ఆలోచన చేయాలని అడుగుతున్నాను.
స్కూళ్లలో సమూల మార్పులు.
ఈరోజు ఏరకంగా బతుకులు మారాయి, జీవితాలు మారాయి, వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాం అన్నది ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడం, ఇదొక్కటే కాదు జరిగింది, ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పాను. విద్యా కానుక గురించి కూడా చెప్పాను. అదే మాదిరిగా ట్యాబులు గురించి కూడా చెప్పాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్లు మారిపోయాయి. స్కూళ్లలో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. స్కూళ్లన్నీ ఇంగ్లీషు మీడియంతో కనిపిస్తున్నాయి. టెక్ట్స్ బుక్కులు కూడా ఒక పేజీ ఇంగ్లీషు ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగువల్ టెక్ట్స్ బుక్కులు మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి.
మొట్ట మొదటి సారిగా స్కూళ్లు బాగుపడ్డాయి. మొట్ట మొదటిసారిగా మన గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తున్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా, నేరుగా ఇంటికే వచ్చి చేస్తున్నారు. స్కూళ్లు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడింది. ఎప్పుడూ చూడని విధంగా రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తోంది. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయ్యింది. ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడాచాలా మందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్లినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఆ లోనులో ఒక 5 పర్సెంటో 4 పర్సెంటో కట్ చేసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళకు ఇచ్చేవారు.