30.04.2023
అమరావతి
వచ్చే నెల 3న (03.05.2023) సీఎం వైఎస్ జగన్ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటన
విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం
విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన
విజయనగరం జిల్లా షెడ్యూల్
ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు, ఆ సెంటర్‌ను సందర్శిస్తారు, భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు.
విశాఖపట్నం పర్యటన
మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
30.04.2023
Amaravati
On the 3rd of next month (03.05.2023) CM Shri YS Jagan will visit Vizianagaram and Visakhapatnam districts.
Foundation stone laying for Bhogapuram International Greenfield Airport in Vizianagaram district, construction of Chinthapalli Fish Landing Center and surplus works of Tarakaramathirdha Sagar Project started
Foundation stone laying for Vizag IT Tech Park at Visakhapatnam – Maduravada
Vizianagaram District Schedule
They will leave Tadepalli residence at 8 am and reach the helipad at A. Ravivalasa village of Bhogapuram mandal at 10 am. Arrive at GMR Experience Center at 10.25 hrs, visit the center and lay the foundation stone of Bhogapuram International Greenfield Airport. At 10.30 a.m., the stone slabs for construction of Bhogapuram International Greenfield Airport, construction of Chintapalli Fish Landing Center and surplus works of Tarakaramathirdha Sagar Project will be unveiled. At 10.55 am they will reach the public meeting venue arranged at Savaravilli. After the meeting, they will leave for Visakhapatnam at 1.20 pm.
Visit Visakhapatnam
At 1.40 pm they will reach the helipad at IT Hills No. 3, Visakha Maduravada. Leave by road and reach the venue at IT Hills No. 4 at 2 o’clock. 2.30–3.00 Participate in the foundation stone laying ceremony of Vizag IT Tech Park. The CM will visit the photo exhibition organized there and then address the program organized with industrialists. Later, at 3.50 p.m., they will leave from there and reach Visakha MP MVV Satyanarayana’s residence at Rushikonda. There, the recently married MP’s son blesses the couple. Later, it will depart from Madhurawada Helipad at 5 pm and reach Visakhapatnam Airport at 5.20 pm. It will leave Visakhapatnam at 5.30 pm and reach Tadepalli residence at 6.45 pm.