నెల్లూరు జిల్లా: ఉదయగిరి నియోజకవర్గం , వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• అమరావతి రాజధానికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టడంపై ఉదయగిరి ప్రజావేదిక సభ నుంచి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
• మూడు ముక్కలాట ద్వారా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందారు.
• రాజధాని చట్టబద్దత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం
• కనీసం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాలేదు
• ఇవాళ పార్లమెంటులో బిల్లు పెట్టి దానిపై చర్చిస్తున్నారు. అమరావతిని ఒక్క అంగుళం కూడా కదల్చలేరు
• ఏపీకి ఏకైక రాజధాని అమరావతే.
• వింజమూరు పాతచెరువు పునరుద్ధరణలో ప్రజల భాగస్వామ్యం వహించటంపై అందరినీ అభినందిస్తున్నాను
• ఇది నా మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమం. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను
• రూ.70 లక్షల వ్యయంతో ఈ చెరువును పునరుద్ధరించేందుకు అడుగులు ముందుకు వేశారు.
• ప్రజలు ఒక అడుగు ముందుకు వేస్తే ప్రభుత్వంగా నేను వంద అడుగులు ముందుకు వేస్తాను
• సోమశిల కాలువ నీటిని రూ.34 కోట్లతో ఆ చెరువుకు తరలించేలా ఆదేశాలిస్తున్నాను
• అక్టోబరు నెల నాటికి ఆ పనులన్నీ పూర్తి చేసి నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాను
• ఒక్కసారి ఈ ప్రాంతానికి నీరు వస్తే ప్రజల జీవితాలు, జీవన ప్రమాణాలు మారతాయి
• నీటి భద్రత అనే అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని రిజర్వాయర్లలో నీటిని నింపాం
• సోమశిల, కందలేరు లో కూడా నీరు ఉంది. వేసవి వచ్చినా రిజర్వాయర్లలో 60 శాతం నీరుంది
• నీటి పొదుపు కోసం ప్రజలు చూపించే స్పూర్తి ఇలాగే కొనసాగాలని పిలుపుఇస్తున్నాను
• 2019-24 మధ్య అరాచక, విధ్వంస పాలన కొనసాగింది. అలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు
• రాష్ట్రమంతా విధ్వంసం పాలైంది. ప్రజలంతా మార్పు కోరుకున్నారు. అదే సుపరిపాలనకు నాంది పలికింది
• ఇక్కడి నుంచే ఒంటి మిట్టకు వెళ్లి సీతారాముల కల్యాణోత్సవంలో పాలు పంచుకుంటాను















































