On 26th monday 77th Republic Day Celebrations as follows…
1)on 26th monday @ 7.30 AM at AP Secretariat Block-1 Chief Secretary Sri.K.Vijayanand will unfurl the National Flag.
2)At APLC @ 8AM Hon’ble APLC Chairman Sri Koyye Moshen Raju will unfurl the National Flag..
3)At APLA @ 8.15 AM Hon’ble APLA Speaker Sri Chintakayala Ayyannapatrudu will unfurl the National Flag..
4)At AP High Court Nelapadu @10AM Hon’ble Chief Justice of APHC Justice Sri Dheeraj Singh Thakoor will unfurl the National Flag..
గణతంత్ర దినోత్సవ వేడుకలు…
26న రాష్ట్ర శాసన మండలి,అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
అమరావతి,23 జనవరి:77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 26వ తేది సోమవారం ఉ.8 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగే వేడుకల్లో శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
ఉ.8.15 గం.లకు రాష్ట్ర అసెంబ్లీ భవనం వద్ద రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
సచివాలయం మొదటి భవనం:
ఎపి సచివాలయం మొదటి భవనం వద్ద సోమవారం ఉ.7.30 గం.లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం:
నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద సోమవారం ఉ.10 గం.లకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.