అమరావతి
లోక్ భవన్ లో సాయుధ దళాల జెండా దినోత్సవం కార్యక్రమం.
ముఖ్యఅతిథిగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, హోం మంత్రి వంగలపూడి అనిత.
మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన ‘మన మార్గదర్శి’ పుస్తకాన్ని గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారితో కలిసి ఆవిష్కరించిన హోం మంత్రి అనిత.
హోం మంత్రి అనిత కామెంట్స్
సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్
గారి సమక్షంలో మాట్లాడే అవకాశం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఇది సాధారణ కార్యక్రమం కాదు. మన దేశానికి ప్రాణాలర్పించిన సైనికులను గుర్తు చేసుకునే రోజు.
వారికి మనం కృతజ్ఞతలు చెప్పుకునే రోజు.
భారత్ సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ గల, ధైర్య సాహసాలతో కూడిన దళాలు.
మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లో కాదు. వారి ధైర్యం త్యాగం ఎటువంటి పరిస్థితుల్లోనైనా విధులు నిర్వహిస్తారు.
అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు కూడా దేశ రక్షణ కోసం అప్రమత్తంగా ఉంటారు.
వర్షం, మంచు, వేడి, చలి ఏ పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయరు.
మన సైనికులు కేవలం యుద్ధాల్లోనే కాకుండా భూకంపాలు, వరదలు, తుఫాన్లు కొండ చర్యలు విరిగినప్పుడు ముందుగా అక్కడికి చేరేది మన సాయుధ దళాలే.
మన దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే దానికి కారణం మన సైనికులు త్యాగమే.
చాలామంది సైనికులు సంవత్సరాల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటారు.
కొంతమంది సైనికులు దేశం కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారు.
ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలు, యుద్ధంలో గాయపడిన సైనికులు వారు ఎంతో ధైర్యంగా జీవితం ముందుకు తీసుకెళ్తున్నారు.
వారికి అండగా నిలవడం మనందరి బాధ్యత.
ఈరోజు మనం సాయుధ దళాల జెండా నిధికి విరాళం ఇస్తున్న వారికి కృతజ్ఞతలు.
భారత ప్రభుత్వం మన సైనికుల సంక్షేమానికి ఎప్పటికీ ప్రాధాన్యత ఇస్తుంది.
ఆంధ్రప్రదేశ్ సైనిక్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 10 కోట్ల కార్పస్ నిధిని కేటాయించింది.
జూన్ 2024 నుండి ఇప్పటివరకు మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబాలకు చెందిన అర్హులైన ఆధారితులకు మొత్తం 13 కారుణ్య నియామకాలు చేసాం.
గౌరవ గవర్నర్ గారు సైనికుల సంక్షేమంపై చూస్తున్న ప్రత్యేక శ్రద్ధకు నా కృతజ్ఞతలు.
దేశ రక్షణలో సేవలందించిన పలువురిని సత్కరించడంతో పాటు, సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాలు అత్యధికంగా సేకరించిన కలెక్టర్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారులను సత్కరించిన గవర్నర్ గారు.






























































