రాజమండ్రిలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్
రాజమహేంద్రవరం:
ఆర్ట్స్ కాలేజీలో కార్యక్రమం అనంతరం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీలో రూ.34 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మూడు భవనాలను లాంఛనగా ప్రారంభించారు.
ముందుగా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంజీరా బ్లాక్ పేరుతో నూతనంగా నిర్మించిన ఎగ్జామినేషన్ బిల్డింగ్, గౌతమి బ్లాక్ పేరుతో నిర్మించిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇంద్రావతి బ్లాక్ పేరుతో నిర్మించిన స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ స్టడీస్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఎస్.ప్రసన్న శ్రీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి.జ్యోతిర్మయి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి.విజయ నిర్మల, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగం ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.







































































