• కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో పాటు సివిల్స్ సర్వీసెస్ కు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందజేశాం
• 2024-25 సంవత్సరానికి 83 మందికి సివిల్స్ శిక్షణ ఇచ్చాం..
• శిక్షణ పొందిన వారిలో పలువురు అభ్యర్థులు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాలు సాధించారు…
• 2025-26 వ సంవత్సరానికి సంబంధించి 100 మందికి ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వబోతున్నాం
• ఉచిత సివిల్స్ శిక్షణకు ఈ నెల 7వ తేదీన రాష్ట్రంలోని 7 జిల్లా కేంద్రాలలో (Visakhapatnam, Rajahmundry, Guntur, Nellore, Kurnool, Tirupati, Anantapuramu) స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాం
• 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 723 మంది పరీక్షకు హాజరయ్యారు.
• వారిలో 100 మంది అభ్యర్థులను ఎంపిక చేశాం…
• రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100 మందితో కూడిన తుది జాబితాను సిద్ధం చేశాం
• ఆ ఫలితాలు ఈ రోజున విడుదల చేస్తున్నాం
• 100 సీట్లలో, బీసీలకు 66 %, ఎస్సీలకు 20 %, ఎస్టీలకు 14 % రిజర్వేషన్ కల్పించాం.
• బీసీలలో A, B, C, D గ్రూపులకు, ఎస్సీలలో గ్రూప్–I, గ్రూప్–II, గ్రూప్–IIIలకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాం.
• మహిళలకు 33 1/3 % రిజర్వేషన్ కూడా కల్పించాం
తుది జాబితా లో ఎంపికైన వారి వివరములు
GROUP PERCENTAGE % MALE FEMALE TOTAL
BC 66% 44 22 66
SC 20% 14 06 20
ST 14% 09 05 14
TOTAL 100% 67 33 100
• ఈ నెల 12వ తేదీన గొల్లపూడి లోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
• అదే రోజు అభ్యర్థులకు వసతి గదుల కేటాయిస్తాం
• స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వసతి కల్పిస్తున్నాం
• ఈ నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ కోచింగ్ ప్రారంభిస్తున్నాం…
• Hyderabadకు చెందిన La-Excellence IAS Institute ద్వారా కోచింగ్ అందిస్తున్నాం
• బీసీ స్టడీ సర్కిల్ ద్వారా మెగా డీఎస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా 6,500 మందికి ఉచిత శిక్షణ అందించాం
• 250 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపిక
• బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత కోచింగ్ అందజేసినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది..
• బీసీ హాస్టళ్లు, గురుకులాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
• హాస్టళ్ల మరమ్మతులకు, నిర్మాణాలకు రూ.141 కోట్లు మంజూరు చేశాం
• ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం













































