అ
మరావతి- రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు
* మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి , సీఎం చంద్రబాబు
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూబీఐ, కెనరాబ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసీ, నాబార్డ్ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
* శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయా బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు ఉన్నతాధికారులు
అమరావతి :- రాజధానిలో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్
* గత పాలకుల వల్ల ఐసీయూలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం ఆక్సిజన్ అందించింది.
* దీనికి రాష్ట్ర ప్రజల తరపున కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం
* బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో దేశ ఆర్ధిక వ్యవస్థ అంతా ఏపీకి వచ్చినట్టు ఉంది
* ఆర్ధిక వనరుల విషయంలో ఆమె కాస్త కఠినంగానే ఉంటారు.
* మన ఇంట్లో అమ్మలాగే ఎప్పుడు ఏది అవసరమో, అప్పుడే నిధులు ఇస్తారు
* ఇంత పెద్ద భారత దేశంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థను నిర్వహించటం మాటలు కాదు
* మా రాజకీయ హెడ్ మాస్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఫలితాలు సాధించే విషయంలో కఠినంగానే ఉంటారు
* అందుకే ప్రతిఫలాలు ప్రజలకు అందిస్తున్నారు
* డబుల్ ఇంజన్ సర్కార్ కు ఇంధనం-ధనమే.
* వందేభారత్ రైళ్లు, డిఫెన్స్ సెక్టార్, విద్య, వైద్య రంగాల్లో నిధుల కేటాయింపు పెరుగుతోంది
* దేశం గుర్తు పెట్టుకునేలా కేంద్ర ఆర్ధిక మంత్రి సేవలు అందిస్తున్నారు
* జీఎస్టీ సంస్కరణల ప్రకటించినప్పుడు అత్యంత వేగంగా దానిని దేశవ్యాప్తంగా అమలు చేయటం ఆశ్చర్యపరిచింది
* పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి, విశాఖ ఉక్కుకు ఆర్ధిక సహకారం అందిస్తోంది కేంద్రం
పయ్యావుల కేశవ్
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి
* అమరావతి
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ..
* 8 మార్లు ఆర్ధిక మంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన చరిత్ర సాధించారు నిర్మలా సీతారామన్
* పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేసి ఖాయిలా ప్రమాదం నుంచి వాటిని కాపాడారు ఆమె
* కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి నిర్మలాసీతారామన్ స్పూర్తి
* 34 వేల ఎకరాలను రైతులు రాజధాని కోసం త్యాగం చేశారు.
* అమరావతి అంటే ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, రాష్ట్ర భవిష్యత్ కల
అమరావతి- రాజధానిలో బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించిన మంత్రి నారా లోకేష్
• దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి
• మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారు
• ఒక్క వ్యక్తికోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు
• ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారు.
• ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లాం
• అమరావతిని ఆపడానికి అది ఎవరి ఇంట్లోనో లైట్ స్విచ్ కాదు.
• పవర్ ఫుల్ ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని ఇది
• కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు పునఃప్రారంభించి జెట్ స్పీడ్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి
• ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్
• మంగళగిరి చేనేత వస్త్సాలను ధరించి ప్రమోట్ చేసినందుకు ఆమెకు ధన్యవాదాలు
• ఏపీ ఏ సాయం కోరినా ఆర్ధిక మంత్రి సహకారం అందిస్తున్నారు
• పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆదుకున్నారు
• భారత్ లో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ విశాఖకు వస్తోంది. దీనికి అండగా ఆమె నిలిచారు
• 15 బ్యాంకులు, బీమా కంపెనీలు రూ.1334 కోట్లతో తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి
• రాజధానిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని బ్యాంక్ స్ట్రీట్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా లావాదేవీలకు ఈ కార్యాలయాలు పనిచేస్తాయి
అమరావతి:- బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై ప్రసంగించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
• జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది
• ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయటం శుభసూచికం
• బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట ఉండటం అరుదు. అది అమరావతి సాధించింది
• ఈ కేంద్ర కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండటం ఆర్ధికంగా అందరికీ ప్రయోజనం కూడా
• రూ.1334 కోట్ల వ్యయంతో ఈ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి
• బ్యాంకులు వేస్తున్న ఈ పునాదులు అమరావతి ఆర్ధిక భవిష్యత్ నిర్మాణానికి కీలకం
• సీఎం చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు.
• అమరావతి పునర్నిర్మాణం కోసం, పోలవరం కోసం, స్టీల్ ప్లాంట్ కోసం నిధులు ఇచ్చి సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు
• ఆంధ్రప్రదేశ్ ను అడుగడుగునా ఆదుకుంటున్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్ధిక మంత్రికి ధన్యవాదాలు
అమరావతి :- రాజధానిలో 15 బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
• గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు.
• రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు
• ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి
• రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు
• రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకం
• బ్యాంకులు, బీమా కంపెనీల ఏర్పాటుతో 6,556 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరిట బ్యాంకులు, ఆర్ధిక సంస్థల కోసం అమరావతిలో స్థలం కేటాయించాం
• స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
• ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఆప్కాబ్, నాబార్డ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లు వచ్చాయి
• ఈ సంస్థలన్నీ తమ ప్రధాన కార్యాలయాలను అద్భుతంగా నిర్మించాలని కోరుతున్నాను
• ప్రతీ ఇంట్లో మహిళలే ఆర్ధిక మంత్రులు. మన దేశానికి కూడా మహిళా ఆర్ధిక మంత్రే ఉన్నారు.
• దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు
• దేశాన్ని ప్రధాన మంత్రి అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే…ఆర్థికమంత్రి ఆదేస్థాయిలో సహకరిస్తున్నారు
• జీఎస్టీ సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ పెరగటంతో పాటు సామాన్యులకూ లబ్ది కలిగింది
• ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థ ఓ కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఒప్పందం జరిగింది
• ప్లానెటోరియం ఏర్పాటు చేసేందుకు అమరావతిలో స్థలం కూడా కేటాయించాం
• ధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థ, గతంలో విభజన వల్ల జరిగిన నష్టాల నుంచి ఇప్పుడే గాడిన పడుతున్నాం
• ఇంకా ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి సాధించగలం అన్న విశ్వాసం మాకు ఉంది
• త్వరలోనే సీడ్ యాక్సెస్ రహదారి కూడా పూర్తి అవుతుంది. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయి
• 7 జాతీయ రహదారులు, రైల్వేలైన్లు అమరావతికి కనెక్టు అవుతాయి
• అమరావతి పూర్తిగా గ్రీన్, బ్లూ సిటీగా అభివృద్ధి చేస్తున్నాం.
• భారతదేశం గర్వపడేలా అమరావతిని నిర్మాణం చేస్తాం.
• విట్,ఎస్ఆర్ఎం, బిట్స్ పిలానీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి వచ్చాయి.
• క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ట్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా ప్రణాళిక చేశాం
• 2047కి భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. అందులో ఏపీది కీలక పాత్ర పోషిస్తుంది
• ఆశ వదులుకున్న పోలవరాన్ని మళ్లీ రీస్ట్రక్చర్ చేసేందుకు కేంద్రం సహకరించింది
• రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రాం వాల్ ధ్వంసం అయితే మళ్లీ రూ.1,000 కోట్లు ఇచ్చి డయాఫ్రాం వాల్ నిర్మాణం చేసేందుకు నిధులిచ్చారు
• 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అలాగే 2028 నాటికి కూడా అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయి
• పరిశ్రమలు రాకుండా పారిపోయిన ఏపీకి మళ్లీ కూటమిపై భరోసాతో పెట్టుబడులు వస్తున్నాయి
• రూ.1.37లక్షల కోట్ల పెట్టుబడులతో గూగుల్ విశాఖకు వస్తోంది.
• గోదావరి, కృష్ణా నదుల నుంచి వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి
• పోలవరం నుంచి నల్లమల సాగర్ లింక్ ద్వారా నీళ్లు తీసుకెళ్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది
• సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలు వాడుకుని దేశసంపద పెంచేలా రాయలసీమకు నీళ్లు పారించాలని భావిస్తున్నాం
• ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి ఆదుకోవాలని ఆర్ధిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను.
• రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్టటంలో ఈ నీరు కీలకం అవుతుంది. ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది
• పూర్వోదయ ప్రాజెక్టు కింద ఉదారంగా నిధులు ఇస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి
• కేంద్ర సహకారం వల్ల చాలా వరకూ రాష్ట్రం రికవర్ అవుతోంది.
• నిలదొక్కుకుని దేశప్రగతికి, సంపదకు బ్యాక్ బోన్ గా ఏపీ నిలబడుతుందని హామీ ఇస్తున్నాను.
• కేంద్ర సహకారంతో అమరావతి అన్ స్టాపబుల్.
అమరావతి :- రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
• ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం
• దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు
• నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు
• అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది
• ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్‌యూ సంస్థలు ప్రధాన కార్యాలయాలు వస్తున్నాయి
• 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి
• ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయం
• రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు
• బ్యాంకులన్నీ రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవటం బాధ్యత
• బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కావొద్దు. దానిని మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలి
• 25 కోట్ల మందిని ఇప్పటి వరకూ దేశంలో దారిద్ర్యరేఖ నుంచి బయటకు వచ్చారు
• మధ్యతరగతి ఆస్పిరేషన్స్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి
• రైతులు దేశానికి పౌష్టికాహారం అందిస్తున్నారు.
• మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ఢిల్లీ , ముంబై లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయి
• అలాగే ఇతర పంటలకూ ఈ తరహా మార్కెటింగ్ సౌలభ్యాలు ఉంటే వారికి ఆర్ధిక ప్రయోజనాలు అందుతాయి
• ఏపీలోని రాయలసీమలో ఉన్న 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలి
• కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణం ద్వారా ఇది సరిపోదు.
• ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమల్ని కూడా ప్రోత్సహించాలని గుర్తుంచుకోండి
• భవిష్యత్ ఆలోచనలు, సమీకృత ఐడియాలను బ్యాంకులు కలిగి ఉండాలి.
• గతంలో మహిళల్ని బీమా ఏజెంటుగా మార్చేందుకు మహిళా సఖి పేరిట కార్యక్రమం ప్రారంభిస్తే అద్భుత ప్రయోజనాలు వచ్చాయి
• ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ తక్షణం అమోదిస్తారు.
• విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు
• క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణ పొందేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
• కేవలం ఐటీ గురించే కాదు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోంది.
• ఏపీ ప్రభుత్వంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థ ఇవాళ ఒప్పందం చేసుకోవటం సంతోషకరం
• ఏడాదిన్నరలో ఏపీ ఫ్యూచరిస్టిక్ కేపిటల్ నగరం అవుతుంది. అమరాతిలో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మించాలని కోరుతున్నా
• ఆచార్య నాగార్జునుడు లాంటి శాస్త్రీయ పరిశోధకులు నివసించిన ప్రాంతం ఏపీ
• రేర్ ఎర్త్ మినరల్స్ పై కూడా కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ రంగంలో కూడా ఏపీ పనిచేయాలని కోరుతున్నాను.
అమరావతి
• రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఎంఓయూ
• కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ మార్చుకున్న ఏపీ సీఆర్డీఏ- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
* అమరావతి
* – పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు
* పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపిన కేంద్ర ఆర్ధిక మంత్రి
* రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు
* పూర్వోదయ పథకం కింద ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు రూ.39 వేల కోట్ల మేర ప్రణాళికలు రూపోందించిన ఏపీ ప్రభుత్వం
* 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని సూచించిన కేంద్ర ఆర్ధిక మంత్రి
* కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించిన నిర్మలా సీతారామన్
* ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ ఊతం ఇవ్వటం ద్వారా రైతులకు సహకరించాలని స్పష్టం
* మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలుతున్నాయని వెల్లడి
* అదే తరహాలో 9 జిల్లాల్లోని ఉద్యాన రైతుల పండించిన ఉత్పత్తులు ఇతర మార్కెట్లకు తరలించేందుకు అన్ని విధాలా సహకరించాలని స్పష్టం
* దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని బ్యాంకులకు సూచించిన కేంద్ర మంత్రి
రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్న మంత్రి











































