SEPT 02
#ఒక్కమరణం…..#వైఎస్సార్
ఒకే ఒక్క మరణం యావత్ ఆంధ్ర ప్రదేశ్ నే
చిన్నా భిన్నం చేసింది..
ఒక్క మరణం..యావత్ కాంగ్రెస్ పార్టీని మట్టి కొట్టుకుపోయేలా చేసింది..
ఒక్క మరణం దేశం లొనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలోకి శరవేగంగా వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ని కకా వికళం చేసింది..
ఒక్క మరణం..వేల ఉద్యోగస్థుల ఎదురు చూపులు నిరంతరం కోన సాగేలా చేసింది..
ఒక్క మరణం.. వందల గుండెలు
కుమిలిపోయే లా చేసింది..
ఒక్క మరణం.. రాయలసీమ అనాధగా
మిగిలేలా చేసింది..
ఒక్క మరణం.. రాష్ట్రభవిసత్తు 20 ఎల్లు
వెనక్కు వెళ్లేలా చేసింది..
ఒక్క మరణం..దేశం లొనే కొత్త రాష్ట్రానికి
నాంది పలికింది..
ఒక్క మరణం ..పడిపోయిన పార్టీ లు వెయ్యి ఏనుగుల బలంతో పరిగెత్తేలా చేసింది…
ఒక్క మరణం..సంక్షేమ పథకాలు నిద్రమత్తు లోకి జారుకున్నాయి..
ఒక్క మరణం..రైతులకుమద్దతు ధర లేక రుణమాఫీ వంటివి అడిగేవాడు ఇచ్చేవాడు లేక నిద్రలేని రాత్రులు కల్పించాయి..
అయినా యాడ పోతావ్..
ప్రతి అడుగులో నీ పేరు కనపడుతూ ఉంటుంది..
ప్రాజెక్టుల నీటి ప్రవాహం గుండా నువ్వే..
పేదల ఉచిత విద్యుత్ లో నీవే..
108,104 ల సైరన్ లో నీవే..
ఆరోగ్య శ్రీ వైద్యం లో నీవే..
ఫీజు రేయింబర్స్మెంట్ లో నీవే..
2 రూపాయల కిలో బియ్యం లో నీవే..
రైతుల పొలాల్లో ఉచిత విద్యుత్ లో నీవే..
పెట్రోల్,డీజిల్,గ్యాస్ రెట్లు పెరిగినప్పుడల్లా
నీ పేరు తలపులే నీ పాలనలో పెరగని రెట్లే..
అభివృద్ధి చూసినప్పుడల్లా నీవే..
రుణమాఫీ అన్న ప్రతి పదం లో నీవే..
డ్వాక్రా మహిళల రుణ మాఫీ లో నీవే..
ఎయిర్పోర్టులు..రింగురోడ్లు..సెజ్ లు
ఒకటేమిటి అభివృద్ధి పరుగులు పెట్టింది ని హయాంలో..
ఈ దేశం నిన్ను మరవదు నీ అకాల మరణం పూడ్చలేనిది..నిన్ను మరణపు టంచులకు తెసుకుపోయిన నల్లమల అడవులు కన్నీటి
వరదలు మేం ఇప్పటికీ మరువం..
అవి వరదలయ్ ముంచెత్తాయి ..
దేశం ఒక్క ధీరుడిని కోల్పోయింది..
రాష్ట్రము ఒక్క తండ్రిని కోల్పోయి అనాథలా
మిగిలి ఎవరి బాగం వారు పంచుకున్నారు..
రాయలసీమ కు నీవు లేనిదీ చూసి ద్రోహం
చేసారు..
నీ పేరే ఒక విప్లవం..
నీ నడక రాజసం..
నీ నవ్వు నిష్కల్మషం..
నీ పాలన అద్భుతం..
నీ ధైర్యం ఆమోఘం..
నీ మధుర స్మృతులు ఎన్ని సంవత్సరాలు అయినా మా జ్ఞాపకలనుండి పోవు నీ మరణమే మా ఓటమి.. మా కన్నీటి జ్ఞాపకం అందుకో రాజన్న..
ఆయన మరణం తరువాత ఆయన పాలన చూసిన తరువాత రాజన్న కు వీరాభిమాని గా మారిన కోట్లమందిలో నేను ఒకడ్ని..
===========================================
‘‘రాజు మరణించు నొకతార రాలిపోయే
కవియు మరణించు నొకతార గగనమెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’’
ఇక్కడ మహాకవి జాషువా పద్యపంక్తులు సందర్భోచితం. ఆయన సుకవిని కీర్తించినా రాజన్న విషయంలో సుపరిపాలకునికి అన్వ యించుకోవడం సముచితమే. తారగా రాలిపోయినా ధృవతారగా జనం గుండెల్లో వెలుగొందడం రాజన్నకే సాధ్య మయింది. అంతేకాదు.. సుపరిపాలకుడు ప్రజల నాలుకలపై జీవించే వుంటాడని రాజన్న శిలాశాసనం రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ప్రజల కోసం కలలు కన్నారో ఆ జనం గుండెల నిండా సుపరిపాలనా ప్రతిమగా నిలిచి నేడు పండువెన్నెల్లా ప్రకాశిస్తు న్నారు. అందరి నోటా రాజన్న తనయుడు జగనన్న నామస్మరణే నేడు మారుమోగుతోంది. నాటి అపరభగీరథుని శ్రమ నేడు ఆంధ్రప్రదేశ్ అంతటా హరితహారమై పరిమళిస్తోంది. రాజన్న కలల సాకారానికి జగనన్న పాలన నిండు నిదర్శనంగా నిలిచింది.
ప్రజాహృదయాల్లో జీవించే వున్న రాజన్న స్మృతి చిరస్మరణీయం. దశాబ్దకాలం రైతుల్ని కాలదన్ని, వ్యవసాయాన్ని వ్యర్థమన్న కార్పొరేట్ పాలన కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసిన విమోచకుడు వైఎస్సార్. 2004కి ముందు గడిచిన తొమ్మిదేళ్ళ పాలన రాజన్నకు ఎన్నో చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోనే భవిష్యత్’ అనే అబద్ధాన్ని నినాదంగా ప్రచారం చేసి మిగతా చదు వుల్ని, రంగాల్ని నిరుత్సాహానికి గురిచేసిన సందర్భాన్నీ ఆయన గుర్తుంచుకున్నారు. మిగతా చదువులు, రంగాల భవితవ్యాన్ని ఆలోచ నలో వుంచుకున్నారు. భారీగా విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదా రుల్ని నడ్డివిరిచిన నిర్ణయాన్ని ఆయన పత్రికల సాక్షిగా దుయ్యబ ట్టారు. నిరసనగా రైలుపట్టాల మీద కొచ్చిన కాల్దరి రైతుల రక్తం కళ్ళ చూసిన ప్రభుత్వ హత్యల్ని నిలదీశారు. రాజధానిలోనే విద్యార్థుల మీద బుల్లెట్ల వర్షం కురిపించిన కర్కశంపై రాజన్న కదం తొక్కారు.
ప్రతిపక్షనాయకునిగా ఆనాటి ప్రభుత్వ కఠిన నిర్ణయాల్ని కాలినడకన ప్రచారం చేసి ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిన మహాపాద యాత్రకుడా యన. రక్తం కార్చిన అరికాళ్ళ పాదముద్రల ప్రమాణంగా కోట్లాది మంది ప్రజానీకానికి బతుకు భరోసా కల్పించారు. కఠిన నిర్ణయాల మధ్య కాలం వెళ్లదీసిన ప్రజలు, సహకారం సన్నగిల్లి వ్యవసాయాన్ని పక్కనబెట్టిన రైతు, పనుల్లేక కునుకుతీసిన కూలీలు, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగులు రాజన్న వెంట నడి చారు. ఆయనకు ఊరూరా నీరాజనాలు అందించారు. జనం జనం కలిసి ప్రభంజనమై వైఎస్ రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. రైతులకు, పేదలకు ఉచిత విద్యుత్ దస్త్రం మీద తొలి సంతకాన్ని దస్తూరీగా చేసి మాటతప్పని మహానాయకునిగా అవతరించారు.
రాజన్నగా తన పేరును ప్రజల పిలుపుగా మార్చుకున్నారు. ప్రజల కలల సాకారానికి నిలువెత్తు సాక్షిగా నిలిచిన పాలకుడు రాజన్న. రాజకీయాల్లో యువతరం ప్రాధాన్యత పెంచడానికి ఒక చారిత్రక అవసరంగా రాజన్న రాజకీయ అరంగేట్రం జరిగింది. 1978లో పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పులిబిడ్డగా తొలిసా రిగా ఎన్నికైన తర్వాత ఆయన విజయపరంపర అంతిమక్షణం వరకు వెన్నుతట్టి విజయపథం వైపు నడిపించింది. శాసనసభలోనైనా, లోక్ సభలోనైనా తనదైన బాధ్యతాయుతమైన పాత్ర జనం మెచ్చిన నిజమై రగిలింది. అంతర్గత ఆధిపత్య పోరుల్లో కోల్పోయిన అవకాశాలు తనలో పట్టుదలను రేకెత్తించాయి. చెవులతో వినడమే తప్ప కళ్ళతో చూడటం తెలియని అధిష్టానం కళ్ళు తెరిపించిన ఘనత అప్పటి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్దే.
చివరిగా తనకు తాను కాలినడకన ప్రత్యక్షంగా ప్రజలందరినీ పలకరిస్తే తప్ప అధిష్టానం కళ్ళుతెరచి నిజాన్ని చూడలేకపోయింది. అనంతరం ముఖ్యమంత్రిగా అవతరించిన డాక్టర్ వైఎస్ సంక్షేమ సంతకంగా, మాటల మనిషిగా కాదు చేతల మనిషిగా ప్రజాజీవితాలతో మమేకమైపోయారు. వైఎస్సార్ రైతు సాగు నీటి కోసం, తాగు నీటి కోసం వెలిగొండ, గుండ్లకమ్మ, రామతీర్థ ప్రాజెక్టులై ప్రవహించారు. కోట్లాది రూపాయల రుణమాఫీతో నష్టాల్లో ఉన్న రైతులను వైఎస్సార్ ఆదుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే అభివృద్ధి సాధ్యమని భావించిన రాజన్న అపర భగీరథునిగా అవతరించారు. నిలువనీడ లేనివారికి పక్కా ఇళ్లు, భూమి పంపిణీ చేశారు. వృద్ధాప్య పింఛన్లు రాష్ట్రంలో గొప్ప పేదరిక నిర్మూలన విప్లవం. తనను మహానేతను చేసిన ప్రజలకు తన పాలనను కళ్ళారా చూపించాలని ఆలోచన చేసిన రాజన్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కోట్లాదిమంది జనం ఆయుష్షు పెంచారు. అన్ని కులాల, మతాల, వర్గాల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. ఉచిత విద్యుత్తుతో ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్మిన విశాలహృదయుడు రాజన్న.
సంక్షేమంలో ‘చెరగనిముద్ర’గా, రాయితీల్లో ‘రైతు పక్షపాతి’గా, విద్యావిషయకమై ‘విశాలహృదయుని’గా, ప్రజారోగ్యంలో ‘ఆరోగ్య శ్రీమంతుని’గా అశేషప్రజానీకానికి విశేషసేవలందించిన ‘విశ్వన రుడు’ రాజన్న. ‘రచ్చబండ’ దగ్గరే రాజకీయం నిగ్గు తేల్చాలనుకు న్నారు. ఊరిజనాన్ని ఒక్కచోట, ఒకేతాటిపై నిలపాలనుకున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారం ఇవ్వాలనుకున్నారు. సకలజన సౌభాగ్యాన్ని స్వాగతించాలనుకున్నారు. ప్రమాదవశాత్తూ స్వప్నకథగా మిగిలిన ఆయన జీవితం జనజీవన స్రవంతిలో సాక్షాత్కారమయింది. తండ్రి పోరాట జవసత్వాలతో రాజకీయంగా జనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి స్వాభిమాన పోరాటాన్ని పతాకగా ఎగురవేశారు. అభిమానంతో ప్రజలే సహజ కవచకుండలాలుగా జగన్తో జతకట్టారు. రాజన్న సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ప్రజాభిమానం చూరగొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అలుపెరగలేదు. తనయుడు జగన్మోహన్రెడ్డి సైతం అంతే.. తండ్రి అడుగుల్లో అడుగులేసి సమస్త జనావళి ముఖారవిందాలను ప్రేమగా ముద్దాడే తీరునే సొంతం చేసుకున్నారు. తండ్రి జ్ఞాపకాల్నీ తనివితీరా ఆస్వాదించే పాలనే చేస్తున్నారు. జనం గుండెల్లో రాజన్న సంక్షేమాన్ని నిండా నింపుతున్నారు.
======