• Anantapuran zilla, Penukonda Constituency, Anantapuranzilla near Palasamudram Industrial Park, representatives of Uppara (Sagara) community under Hindupuram Parliament expressed solidarity with youth leader Nara Lokesh’s padayatra.
• Submitted separate petitions on the issues faced by them.
Summary of the petition given by the representatives of Uppara (Sagara) community of Anantapur District:
• An acre of land should be earmarked for constructing a community building for upper caste people in Penukonda Constituency.
• A place should be reserved for the installation of Bhagiratha idols in every mandal centre.
• Upper castes should be converted from BC(D) to BC(A).
• The post of MLC should be reserved for upper castes.
Summary of the petition given by the upper community representatives of Hindupuram Parliament
• Upper social class should be changed from BC(D) to BC(A).
• The post of Chairman of the State Housing Board should be reserved for upper castes.
• The post of MLC should be allotted to our community.
• A GO should be issued to take strict action against those who make inappropriate comments like Uppara Sodi, Uppara Meeting.
• Pensions should be granted to upper social class people above 50 years of age.
• An acre of land should be allocated for setting up a community hall and skill development center for the upper community in Amaravati, the capital of AP.
Youth leader Nara Lokesh reacts on two petitions…
• It should be remembered that TDP is credited with giving a platform to BCs in all fields.
• Late NTR and Telugu Desam Party gave BCs economic, social and political independence. The person who is continuing it is Chandrababu.
• There is awareness of the problems faced by upper (middle) society.
• After TDP comes to power we will build community buildings for upper castes.
• We will discuss all other issues with the party leaders and take an amicable decision.
• The self-esteem of the upper castes should not be disturbed under any circumstances. I promise that TDP will take tough decisions for that.
• We will study the Satyapal committee report on BC category changes and take a positive decision.
• అనంతపురంజిల్లా, పెనుకొండ నియోజకవర్గం, పాలసముద్రం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో అనంతపురంజిల్లా, హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఉప్పర(సగర) సామాజికవర్గం ప్రతినిధులు యువనేత నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
• తాము ఎదుర్కొంటున్న సమస్యలపై విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు.
అనంతపురంజిల్లా ఉప్పర(సగర) సామాజికవర్గ ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రం సారాంశం:
• పెనుకొండ నియోజకవర్గంలో ఉప్పర సామాజికవర్గ ప్రజల కోసం కమ్యూనిటీ భవనం నిర్మించడానికి ఎకరా స్థలం కేటాయించాలి.
• ప్రతి మండల కేంద్రంలోనూ భగీరథ విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలి.
• ఉప్పర కులస్థులను బీసీ(డీ) నుండి బీసీ(ఏ)లోకి మార్చాలి.
• ఉప్పర కులస్థులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి.
హిందూపురం పార్లమెంట్ ఉప్పర సామాజికవర్గ ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రం సారాంశం
• ఉప్పర సామాజికవర్గాన్ని బీసీ(డీ) నుండి బీసీ(ఏ)లోకి మార్చాలి.
• రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని ఉప్పర సామాజికవర్గానికి కేటాయించాలి.
• మా సామాజికవర్గానికి ఎమ్మెల్సీ పదవి కేటాయించాలి.
• ఉప్పర సోది, ఉప్పర మీటింగ్ వంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జీఓ ఇవ్వాలి.
• 50ఏళ్లు పైబడిన ఉప్పర సామాజికవర్గ ప్రజలకు పెన్షన్లు మంజూరు చేయాలి.
• ఏపీ రాజధాని అమరావతిలో ఉప్పర సామాజికవర్గానికి కమ్యూనిటీ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు నిమిత్తం ఎకరా స్థలం కేటాయించాలి.
రెండు వినతిపత్రాలపై యువనేత నారా లోకేష్ స్పందిస్తూ…
• బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీఠ వేసిన ఘనత టీడీపీదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
• ఆర్థిక,సామాజిక,రాజకీయ స్వాతంత్ర్యాన్ని బీసీలకు ఇచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి చంద్రబాబు.
• ఉప్పర(సగర) సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉప్పర కులస్తులకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తాం.
• ఇతర సమస్యలన్నింటిపై పార్టీ పెద్దలతో చర్చించి, సమంజన నిర్ణయం తీసుకుంటాం.
• ఉప్పర కులస్తుల ఆత్మగౌరవానికి ఎట్టిపరిస్థితుల్లో భంగం కలగనివ్వం. దానికోసం కఠినమైన నిర్ణయాలను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నా.
• బీసీ క్యాటగిరీ మార్పులపై సత్యపాల్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, సానుకూల నిర్ణయం తీసుకుంటాం.