మీ బిడ్డ కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు
సామర్ల కోట బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారు.
పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంలో ప్రభుత్వం పనిచేస్తోంది.
నవరత్నాల్లోని ప్రతీ పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నాం.
సామర్లకోట లేఔట్లో వెయ్యికిపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
మన ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయి.
పేదవాడికి చంద్రబాబు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు బాబు సెంటు స్థలం ఇవ్వలేదు.
మన ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చాం.
పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.
కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు
చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది
వైయస్ జగన్ పేరు చెబితే స్కీంలు.. చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి
కాకినాడ: మీ బిడ్డ కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఇళ్లు లేని 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 14.33లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని సగర్వంగా చెప్పారు. లక్షల విలువైన ఆస్తిని అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు కంటిన్యూగా నెలరోజులపాటు మన రాష్ట్రంలో ఉన్నారా?. చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి జైలు సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రుడు, బాలకృష్ణ ఎవరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు సొంతిళ్లు పక్క రాష్ట్రంలో ఉంది. దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరంతో, గాజువాకతో సంబంధం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. హైదరాబాద్‌లో దోచుకున్నది పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాడు ప్యాకేజీ స్టార్. సొంత పార్టీని, సొంతవర్గాన్ని అమ్ముకేనే ఓ వ్యాపారి పవన్ అని విమర్శించారు. వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. సీఎం వైయస్ జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకువస్తాయి.. అదే చంద్రబాబు పేరు చెబితే స్కాంలు గుర్తుకు వస్తాయి. జగన పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తుకు వస్తుంది..బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుందన్నారు. గురువారం సామర్లకోట లో ఏర్పాటు చేసిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం.
- మనసు నిండా మమకారంతో చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచి పెడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు.
- పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే భవిష్య రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా, దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 31 లక్షల కుటుంబాలకు దాదాపుగా 20 శాతం పైచిలుకు ఇళ్లు లేని నిరుపేదల ముఖంలో సంతోషం చూడాలనే తపన, తాపత్రయంతో మనందరి ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ మంచి చేస్తూ పేదింటి అక్కచెల్లెమ్మల పేరుతో 31 లక్షల ఇంటి పట్టాలు అందించాను.
- ఇళ్ల పట్టాలు ఇచ్చిన వెంటనే 20 లక్షల ఇళ్ల ని ర్మాణాలకు శ్రీకారం చుట్టాం. వేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 13 వేల పంచాయతీలు ఉంటే ఇవాళ రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఈ కాలనీల్లో కాసేపటి క్రితమే వెళ్లి చూశాం. ఇక్కడ కడుతున్న ఇళ్లు చూశాను..ఇవి ఇళ్లు కాదు..ఊళ్లు అని చెప్పడానికి గర్వపడుతున్నాను.
- దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి దాదాపుగా 22 లక్షల ఇళ్లను నిర్మాణంలోకి తీసుకువస్తూ..ఈ రోజుకు 7.23 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశాం. ఈ రోజు మీ బిడ్డ ఇక్కడికి వచ్చి మీతో కలిసి సంతోషాన్ని పంచుకుంటున్నాను.
- ఈ రోజు కడుతున్న 7.23 లక్షలకు సంబంధించి అక్షరాల 5.25 లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. టిడ్కో 1.56 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. అన్ని కలిసి 7.43 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. మరో 14 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పేదవారి అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తుంటే దేవుడిని ఇంతకంటే ఇంకా ఏమీ అడగాలి. దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాడు.
- ఇదే కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇంటి స్థలాలకు సంబంధించి పేదలకు ఇళ్లను చూశాను. నాన్నగారి విగ్రహాన్ని ప్రారంభించి వచ్చే సమయంలో నాయకులను అడిగాను. దొరబాబును అడిగాను..ఇక్కడ ఇంటి స్థలం ఎంత ఉంది అని అడిగితే..ఈ లేవట్‌లోనే అక్షరాల రూ.12 లక్షలు ఉందని దొరబాబు చెబుతున్నాడు. ఇన్ని లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి విలువ పెరిగిందని సంతోషంగా ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
- ఇక్కడే 54 ఎకరాల లే అవుట్‌తో ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ఇక్కడే వెయ్యి ఇళ్లు పూర్తి అయ్యాయి. అందరూ సంతోషంగా గృహ ప్రవేశాలు చేస్తుంటే సంతోషంగా ఉంది. ఇళ్ల పట్టాల విషయమే కాదు..ఇళ్ల నిర్మాణం ఒక్కటే కాదు..నవరత్నాల్లోని ఏ పథకం తీసుకున్నా కూడా డీబీటీ, నాన్ డీబీటీ తీసుకున్నా కూడా ఇదే బాధ్యతతో అడుగులు వేశాం. రాష్ట్రవ్యాప్తంగా 35 పైచిలుకు కార్యక్రమాలు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో ఈ రోజు జరుగుతున్నాయి. పేదవాడి మీద ఉన్న ప్రేమతో వారి జీవితాలను మార్చాలని తపనతో ఈ 52 నెలల పాలనలోఅడుగులు వేస్తూన్నాను.
- గత ప్రభుత్వం ఏ నాడైనా కూడా పేదలపై ప్రేమ, బాధ్యత చూపలేదు. మనం అధికారంలోకి వచ్చే నాటికి అక్షరాల కోటిమందికి పైగా సొంతిళ్లు లేని నిరుపేదలు కనిపించారు. అదే ప్రభుత్వం, అదే రాష్ట్రం..కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఈ రోజు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. పేదల ముఖంలో సంతోషం కనిపిస్తోంది.
- రుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్జం చేస్తుంటే రాక్షసులు కుట్రలు చేస్తారని విన్నాం. నిజంగా ఇలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే..ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఏకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసి ఆపాలనే ప్రయత్నాలు ఎన్నో చేశారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి మీ బిడ్డ తపన, తాపత్రయంతో అడుగులు వేస్తుంటే ఎన్నో అవరోధాలు కల్గించారు.
- మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్ వచ్చింది. రెండేళ్ల పాటు రాష్ట్రానికి రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్ నియంత్రణకు ఖర్చులు పెరిగాయి. కానీ ఎక్కడా కూడా కారణాలు చెప్పలేదు. మీ బిడ్డ ఏదో ఒకటి చేసి మీ ముఖాల్లో చిరునవ్వులు చూడాలని అడుగులు వేశాడు.
- ఈ రోజు 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రయాణం ఎలాంటిదో గమనించండి.
- నా ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో చిరునవ్వు చూడాలని తపన, తాపత్రయంతో కనివీని ఎరుగని విధంగా 77 వేల ఎకరాలు సేకరించి 30.70 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నిజంగా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాల మార్కెట్ విలువ చూస్తే..ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటిస్థలం విలువ రూ.2 లక్షల నుంచి 12 లక్షల వరకు విలువ ఉంది. 31 లక్షల ఇళ్ల విలువ కేవలం రూ.2 లక్షలు అనుకున్నా అక్షరాల రూ. 75 వేల కోట్లు ఉంటుంది.ఇంతటి అవకాశం ఇచ్చిన దేవుడికి సదా రుణపడి ఉంటాను.
- అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కట్టించే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. 22 లక్షల ఇళ్లు ఈ రోజు వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికి రూ.2.70 లక్షల వ్యయం అవుతుంది. ఇంటి నిర్మాణానికి ఇచ్చేది రూ.1.80 లక్షలు ఇస్తున్నాం. మరో 30 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి మంచి జరిగిస్తూ ఉచితంగా ఇసుకను ఇస్తున్నాం. దీని విలువ రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్, తదితర నిర్మాణ సామాగ్రి ధర తగ్గించి ఇస్తున్నాం. దీని విలువ మరో రూ.40 వేలు ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం.
- కాలనీల మధ్య డ్రైనేజీ, నీటిసరఫరా, కరెంటు సరఫరా మరో రూ.32 వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇన్నివేల కోట్లు ఖర్చు చేస్తూ పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నాం. ఇన్నీ జరగాలంటే కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి తేడా..మీ బిడ్డకు మనసుంది. మీపై ప్రేమ, బాధ్యత ఉంది.
- మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రతి అక్కచెల్లెమ్మకు శాశ్వత చిరునామా ఉండాలని విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ పరిష్కారం చూపుతూ 52 నెలల పరిపాలన సాగిందని సంతోషంగా చెబుతున్నాను.
- ఒకవైపు నా పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ అడుగులు వేస్తుంటే..ఇలాంటి మనసు గత పాలకులకు ఏ రోజు కనిపించదు. 2014–2019 పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక సెంట్ స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు తేడా గమనించమని కోరుతున్నాను.
- చంద్రబాబుకు వేల కోట్ల సంపద ఉంది కానీ, తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఒక్క సెంట్ స్థలం కూడా ఇవ్వలేకపోయాడు. ఆ కుప్పంలో 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు జరిగాయంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే.
- ఈ రోజు ఆ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అయినా కూడా అక్కడ పెదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించాలంటే, ప్రతి గడపకు మంచి జరిగింది ఎప్పుడూ అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తరువాతే జరిగింది.
- ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ, చివరకు కుప్పం మీద అభిమానం, అనురాగం లేదు. ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈయన చరిత్ర చూస్తే 14 ఏళ్లు సీఎం, 35 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యే. ఈయనకు మాత్రం కుప్పంలో ఇళ్లు లేదు. పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో ఈ పెద్ద మనిషికి ఇళ్లు ఉంది. అది రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం.
- గత ఐదేళ్లలో మీరే చూసి ఉంటారు. మీ బిడ్డ ప్రభుత్వం 52 నెలలుగా ఉంది. చంద్రబాబు అనే వ్యక్తి కంటిన్యూస్‌గా ఒక నెల అయినా రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచన చేయమని అడుగుతున్నాను. అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను.
- ఆంధ్ర రాష్ట్రం ఆయనకు గాని, ఆయనను సమర్ధించేవారికి మన రాష్ట్రంపై ప్రేమ ఉందా అని అడుగుతున్నా..వీరేవ్వరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన పార్ట్‌నర్ దత్తపుత్రుడు రాష్ట్రంలో ఉండడు. ఆయన కొడుకు, ఆయన బావ మరిది ఉండదు. ఆయన గజదొంగల ముఠాలో పార్ట్‌నర్లు ఈనాడు రామోజీ, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలంటే ఏపీని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకునేందుకు మన రాష్ట్రం కావాలి. ఇది వీరికి మన రాష్ట్రంపై ఉన్న ప్రేమ. ఇవన్నీ నిజాలు అవునా కాదా ఆలోచన చేయండి.
- బాబు దత్తపుత్రుడి స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. దత్తపుత్రుడి ఇళ్లు హైదరాబాద్‌లోనే శాశ్వతంగా ఉంటుంది. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడేళ్లకు ఒకసారి మారిపోతుంటారు. ఒకసారి లోకల్, మరోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్, తరువాత ఎక్కడికి పోతాడో తెలియదు. ఆడవాళ్లు అన్నా, పెళ్లిళ్ల వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏంటో ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా నిజాలు.
- మన ఇళ్లలో అక్కచెల్లెమ్మలను మనం గౌరవించకపోతే..మనమే లీడర్లుగా ఉంటూ మూడేళ్లకు ఒకసారి ఇల్లాల్లను మార్చుతుంటే, ఆడవాళ్లను చులకనభావంతో చూస్తే..మనం ఎలాంటి నాయకులమో ఆలోచన చేయండి.
- ఈ ప్యాకేజీ స్టార్ మన రాష్ట్రం విషయంలో కూడా అంతే..ఈ ప్యాకేజీ స్టార్ పోటీ చేసి ఓడిపోయిన భీమవరం, గాజువాకాతో సంబంధం లేదు. కేవలం ఈ నియోజకవర్గాలను పనిముట్లుగా చూసి యూజ్ అండ్‌త్రోగానే భావిస్తారు.
- ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటారు. పోతుంటారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సరుకులను, సరంజామాను అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ సొంత పార్టీని, సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే ఈ పెద్ద మనిషి రూపంలో చూస్తాం.
- రెండు షూటింగ్‌ల మధ్య విరామంలో ఇక్కడికి వచ్చి పోతుంటాడు. వచ్చి ఇల్లాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి విలువలు లేవు. మన రాష్ట్రమైనా, మన ప్రజలైనా, మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమీ ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. వీరందరిది కూడా ఒక్కటే మనస్తత్వం. ఏపీకి మంచి చేయాలని వీరికి అధికారం కావాల్సింది. వీరు దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకోవడానికి. ఇదీ మన రాష్ట్రంపై వీరికి ఉన్న ప్రేమ.
- మన రాష్ట్రంపై ప్రేమ లేని వారు..మన రాష్ట్ర ప్రజలపై ప్రేమ లేని వారు. మన రాష్ట్రంలో కనిపించని వారు అనుక్షణం మన రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు. కోపంతో ఊగిపోతుంటారు. అధికారం చంద్రబాబుకు పోయే సరికి వీరందరికీ ఫ్యూజులు పోతాయి.
- ఈ రోజు మన మట్టితో కానీ, మన మనుషులతో ఏరకమైన బంధం, అనుబంధం లేదు. వీరంతా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమేచేస్తారు. మన ఎస్సీలను నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని కూడా వీరు చెప్పుకోలేరు. చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా చెప్పుకోలేరు. నా పేదవాడు అని కూడా చెప్పుకోలేరు. ప్రేమ, అనురాగం,బాధ్యత వీరు చూపరు. పైపెచ్చు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అంటారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దంటారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేస్తారు. మన గురించి వీరికి పట్టనే పట్టదు. వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని చూస్తారు. ఎంతటి దుర్మార్గాలు చేస్తున్నా కూడా అందరూ చంద్రబాబును సమర్ధిస్తారు. మసి పూసి మారడి కాయ చేస్తారు.
- ఈ గడ్డ మీదే, మన రాష్ట్రంలో లేని వీరందరికీ కూడా ఉన్నది ఏంటో తెలుసా..అరడజన్ టీవీ చానల్స్, రెండు పేపర్లు, ఎల్లో సోషల్ మీడియా, వీరికి అదనంగా ఒక దత్తపుత్రుడు సపోర్టు. ఇలాంటి రాజకీయాలు మనం సమర్ధించవచ్చా? రాజకీయాలు అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి. రాజకీయాలు అంటే అర్థం ఏంటో తెలుసా..చనిపోయిన తరువాత కూడా బతకాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేయడం. దీన్నే రాజకీయం అంటారు. విలువలు, విశ్వసనీయత అంటారు. చెప్పాడంటే చేస్తాడని అంటారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడుతాడు అన్నవాడే రాజకీయ నాయకుడు. అలాంటి విలువలు, విశ్వసనీయత వీరికి ఉందా?
- మరో వంకా మనందరి ప్రభుత్వం ఈ 52 నెలల్లో ఏం చేశామో ప్రతి పేదవాడి గడపలో కనిపిస్తుంది. మార్పు కనిపిస్తుంది.
- 99 శాతం వాగ్ధానాలను పూర్తి చేశాం. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి హామీలు అమలు చేశాం. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా డబ్బులు అందిస్తున్నాం. ఇంటింటికీ ప్రతి నెల ఒకటో తారీఖున సెలవు, పండుగ రోజైనా సరే 1వ తారీఖున సూర్యోదయం కంటే ముందు చిక్కటి చిరునవ్వులతో గుడ్‌మార్నింగ్ అవ్వాతాతా అంటూ పింఛన్లు ఇస్తున్నారు.
- మీ బిడ్డ పరిపాలనలో ఇంటి ముందుకే వస్తున్న రేషన్ కనిపిస్తుంది. పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. మీ ఇంటివద్దే రేషన్ ఇస్తున్న మార్పు మీ బిడ్డ పాలనలోనే కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు..ఇంటివద్దకే కుల, ఆదాయ ధ్రువ పత్రాలు ఇస్తున్నారు.
- మీ బిడ్డ పాలనలో గ్రామాలు మారాయి. గ్రామాల్లో పరిపాలన మారింది.
- ఎవరైనా అనుకున్నారా? సంక్షేమపథకాలు లంచాలు, వివక్ష లేకుండా నేరుగా ఇస్తారా అని అనుకున్నారా? ఈ రోజు గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, లంచాలు లేని వ్యవస్థ మన గ్రామాల్లోనే కనిపిస్తుంది. గ్రామాల్లోనే విప్లవం కనిపిస్తోంది. గ్రామాల్లోనే ఆర్‌బీకేలు, సచివాలయాలు వచ్చాయి.
- నాడు–నేడు ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, మన బడులు ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. ఐబీ, డిజిటల్ బోధన వచ్చింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్, బైలివింగబూల్ టెక్స్›్టబుక్స్ వచ్చాయి. అమ్మ ఒడి ఇస్తూ పిల్లల చదువులను ప్రోత్సహిస్తున్న మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి రోజు కొత్త మెనూతో జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, విద్యా కానుక కనిపిస్తోంది.
- వైద్య రంగంలో గొప్ప మార్పులు కనిపిస్తున్నాయి. విలేజ్ క్లినిక్స్ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. కొత్తగా 108, 104 వాహనాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ పరిధి 3,300 రోగాలకు విస్తరించింది. ఆపరేషన్ తరువాత విశ్రాంతి సమయంలో కూడా నెలకు రూ.5 వేల చొప్పున ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం. ప్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ కనిపిస్తోంది. పేదవాడు మందుల కోసం ఇబ్బందులు రాకుడదని, ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదవాడికి తోడుగా నిలబడుతోంది.
- పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా ఈ 52 నెలల పాలనలోనే మన కళ్లేదుటే మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి రైతు, అక్కచెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మీకు కనిపిస్తుంది. అవ్వాతాతల పెన్షన్ ఇలా ప్రతి పథకాన్ని తీసుకురావడమే కాదు..మనసా,వాచా, కర్మనతో అడుగులు వేస్తున్నాం.
- మనం ఇచ్చిన ఉద్యోగాలు 2.07 లక్షల ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద స్వాతంత్య్రం నుంచి ఇంతవరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే..మనం వచ్చిన తరువాత 2.07 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. రాష్ట్ర కేబినెట్లో సామాజిక న్యాయం కనిపిస్తుంది. అక్క చెల్లెమ్మల ఫోన్లలో దిశ యాప్‌లు కనిపిస్తున్నాయి. ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే పోలీసులు ఇంటికి వచ్చి రక్షిస్తున్నారు. కోటి 24 లక్షల ఫోన్లలో దిశ యాప్‌లు డౌన్‌లోడ్లు అయ్యాయి. ఒక మంచి అన్నగా తోడుగా నిలబడ్డాడు. ఇవన్నీ కూడా 52 నెలల మీ బిడ్డ పాలనలో మాత్రమే జరిగింది. ఇంతకు ముందు ఇవన్నీ జరిగాయా?. రూ.2.38 లక్షల కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాను.అదే రాష్ట్రం, అదే బడ్జెట్..ఇంతకు ముందు ఎందుకు జరగలేదు. అప్పులు కూడా అప్పటి కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో తక్కువ. 99 శాతం వాగ్ధానాలు అమలు చేసిన ప్రభుత్వం మీ బిడ్డ ముఖం చూస్తే గుర్తుకు వస్తుంది.
- మీ బిడ్డగా ఈ రోజు ఒక్క విషయం గర్వంగా చెబుతున్నాను. మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండి. మీ బిడ్డ నమ్ముకున్నది ఈ పొత్తులను, గజదొంగల ముఠాను కాదు. పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్మాడు. చేసిన మంచిని మీ బిడ్డ నమ్ముకున్నాడు. ఆ మంచితోనే, ఆత్మ విశ్వాసంతోనే మీ బిడ్డ అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి పాలనకు మీరందరూ మద్దతు తెలపాలని కోరుతున్నాను. నా పక్కనే దొరబాబు ఉన్నాడు. నాకు తమ్ముడి లాంటి వాడు. రేపు పొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేYour son JAGAN is building not just houses…but villages