మచిలీపట్నం అక్టోబర్ 30: ——-
గురువారం ఉదయం కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు, అవనిగడ్డ మండలంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర కార్మికులు కర్మ గారు కర్మాగారాలు మహిళలు బీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ తో పాటు రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్, రాష్ట్ర పర్యాటక అభ్యుదయం సీఈవో, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి కాటా ఆమ్రపాలి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ లతో కలిసి పర్యటించారు.
తొలుత ఉప ముఖ్యమంత్రి వర్యులు కోడూరు మండలంలోని ఇస్మాయిల్ బేగ్ పేట ఆర్ సి ఎం చర్చ్ దగ్గర మోంత తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు.
రైతులు కోట రామచంద్ర రావు, రమేష్, వెంకటేశ్వరరావు లతో ముఖాముఖి మాట్లాడి దెబ్బతిన్న వరి పంట నష్టం వివరాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు కోట వెంకటేశ్వరరావ, రమేష్ మాట్లాడుతూ తాము ఆర్సీఎం చర్చి యాజమాన్యం నుండి కౌలుకు తీసుకొని 35 ఎకరాల్లో వరి పంట సాగు చేశామని, మోంత తుఫాను కారణంగా విపరీతమైన ఈదురు గాలులు రావడంతో పంట మొత్తం నేలకు ఒరిగిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా పాలు పోయి పంట దెబ్బతినిందన్నారు.
వర్షపు నీరులో పంట మునిగిపోయిందని, నీరు ఎటు బయటకు పోలేకపోవడం వలన పంట మొత్తం కుళ్లిపోయే పరిస్థితి ఉందన్నారు.
ప్రతి సంవత్సరం ఇదే కాలంలో ఇలాగే నష్టం వాటిల్లుతుందని ఈసారి తుఫాను విపత్తుతో పూర్తిగా నష్టపోయామన్నారు.
ఎకరా వరి పంట సాగు కోసం 40 వేల రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు దెబ్బతిన్న పంటను తీసివేయాలంటే కూలి తదితర ఖర్చులతో కలుపుకుని 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు.
ఇప్పుడు దెబ్బతిన్న పంట నుండి కేవలం 5 బస్తాలు ధాన్యం మాత్రమే వస్తుందన్నారు.
ఇంకోసారి ఇలా జరగకుండా తగు ఏర్పాటు చేయాలని, మొలకల వడ్లు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆ రైతులు విజ్ఞప్తి చేశారు. ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు
అనంతరం ఉప ముఖ్యమంత్రి అవనిగడ్డ విద్యుత్ ఉపకేంద్రం వద్దకు వెళుతూ మార్గమధ్యలో అవనిగడ్డ గ్రామంలో కాసేపు ఆగి అక్కడ దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, ఎప్పుడు వేశారు రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతు తోట కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను 37 సెంట్లలో అరటి తోటలు వేసామని, తుఫాను గాలికి తోటలన్నీ నేల మట్టమయ్యాయన్నారు. మొత్తం 350 అరటి మొక్కలు పూర్తిగా దెబ్బ తిన్నాయని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
తదుపరి ఉపముఖ్యమంత్రి అవనిగడ్డ మండలంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద జిల్లాలో మోంత తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, ప్రభావిత ప్రాంతాలపై ఏర్పాటుచేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను పరిశీలించారు.
ఈ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి వెంట ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయలక్ష్మి, విస్తరణ సంచాలకులు డాక్టర్ శివ నారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, అదనపు ఎస్పీ సత్యనారాయణ, పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు ప్రసన్నలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా విద్యానాధికారి జే. జ్యోతి జిల్లా పర్యాటక అధికారి రామ్ లక్ష్మణ్, మార్క్ఫెడ్ జిఎం మురళీ కిషోర్, డిటిడబ్ల్యు ఫణి ధూర్జటి, ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సుధారాణి, వ్యవసాయ శాఖ ఏడి జయప్రద, తహసిల్దార్ కిరణ్మయి, మండల వ్యవసాయ అధికారి శ్రీధర్, సర్పంచ్ శ్రీ దుర్గా, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
—————————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణా జిల్లా మచిలీపట్నం


















































