తెలంగాణ మంత్రులు – శాఖలు
మల్లు బట్టి విక్రమార్క (రెవన్యూ శాఖ డిప్యూటీ సీఎం,)
ఖమ్మం జిల్లాలోని మధిర నుంచి వరుసగా నాలుగోసారి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మునిపటి అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ గా పనిచేశారు. 36 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 1,400 కిమీ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ విజయానికి బాటలు వేశారు. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. చీఫ్ విప్ గా 2009 నుంచి 2011 వరకు పనిచేశారు. 2014 2018,2023 ల్లో వరుసగా విజయం సాధించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి (హోం మంత్రి )
భారత వైమానిక దళంలో పైలెట్ గా పనిచేసిన ఉత్తమ కుమార్ రెడ్డి ఆరు సార్లు ఎ మ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోదాడ అసెంబీ నియోజక వర్గం నుంచి 1999 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో ఆయన హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నారు. టీపీసీసీ చీఫ్ గా ఆరేళ్లు అంటే 2015 ఫిబ్రవరి నుంచి 2021 జూన్ వరకు పనిచేశారు. 2018లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2019లో హైకమాండు ఆదేశం మేరకు ఆయన నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కోమటి రెడ్డి వెంకట రెడ్డి (పురపాలక శాఖ మంత్రి)
వెంకటరెడ్డి నాలుగు సార్లు ఐదుసార్లు ఎమ్మెల్యేగా భువన గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. 2018లో నల్గొండ నుంచి ఓడిపోయినప్పటికీ భువనగిరి ఎంపీగా గెలిచారు. ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డి మునుగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
పొన్నం ప్రభాకర్ (బీసీ సంక్షేమశాఖ మంత్రి)
ప్రభాకర్ మొదటి నుంచి కాంగ్రెస్ తో అనుబంధం కలిగి ఉన్నారు. 2009లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. టీపీసీపీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
దాన్సారి అనసూయ (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి)
సీతక్కగా పాపులర్ అయిన అనసూయ 14 ఏళ్లకే జనశక్తి నక్సల్ గ్రూపులో చేరింది. 2009లో ఆమె తెలుగుదేశం పార్టీ నుంచి ములుగులో పోటీ చేసి గెలుపొందింది. 2014లో ఆమె ఓడిపోగా, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచింది. 2023లో మళ్లీ ములుగు నుంచే గెలిచారు.
సి. దామోదర్ రాజ నర్సింహ (ఆరోగ్య శాఖ మంత్రి)
సమైఖ్య ఆంధ్రప్రదేశ్ లో రాజనర్సింహ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా 2011 నుంచి 2014 వరకు పనిచేశారు. ఆధోల్ నియోజక వర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉన్నత విద్య, వ్యవసాయశాఖ మంత్రిగా సేవలందించారు.
డి. శ్రీధర్ బాబు (ఆర్థిక మంత్రి)
మంథాని నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సరఫరాతోపాటు అనేక శాఖల్లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఏఐసీసీ కార్యదర్శిగాను పనిచేశారు.
తుమ్మల నాగేశ్వరరావు (రోడ్లు, భవనాల శాఖ మంత్రి)
వాస్తవానికి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు. సత్తుపల్లి నుంచి 1885,1994,2009 విజయం సాధించారు. 2014లో బీఆర్ ఎస్ లో చేరి చంద్రశేఖర్ రావు ప్రభుత్వంలో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. 2016లో పలాయ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచారు. ఎన్ టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ వద్ద మంత్రి పదవులు నిర్వహించిన ఘనత ఆయనదే.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( నీటిపారుదల శాఖమంత్రి)
వైఎస్ ఆర్ సీపీ టికెట్ నుంచి 2014లో ఖమ్మం లోక్ సభలో గెలుపొంది బీఆర్ ఎస్ లో చేరారు. 2019లో లోక్ సభ ఎన్నికలకు బీఆర్ ఎస్ ఆయనకు సీటు ఇవ్వలేదు. దీంతో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని పలయిర్ నుంచి ఆయన గెలుపొందారు.
కొండా సురేఖ ( స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి)
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మకమైన అనుచరురాలిగా కొండా సురేఖ పేరు తెచ్చుకున్నారు. ఆయన మంత్రి వర్గంలో మాతా శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. 2009లో ఆయన మరణానంతరం ఆయన కుమారుడు జగన్మోహన రెడ్డిని సీఎం చేయనందుకు నిరసనగా ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 2014లో ఆమె బీఆర్ ఎస్ లో చేరారు. 2018లో బీఆర్ ఎస్ టికెట్ ఇవ్వనందుకు ఆమె రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం తూర్పు వరంగల్ నుంచి ఆమె గెలిచారు.
జూపల్లి కష్ణారావు (పౌర సరఫరాల శాఖ మంత్రి)
కష్ణారావు కొల్లాపూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు. 2011లో ఆయన కాంగ్రెస్ ను విడిచి టీఆార్ ఎస్ లో చేరారు. 2018లో మొదటిసారి ఆయన ఓడిపోయారు. 2023లో బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆపార్టీకి బలాన్ని చేకూర్చారు.
నూతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2012లో ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ క్యాబినెట్ లో టెక్స్ టైల్ మంత్రిగా పనిచేశారు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఆయన వ్యవసాయదారుడు.