మచిలీపట్నం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత అయూబ్‌ఖాన్ పేరు పరిశీలన…
రాజధాని వార్తలు, పెడన: మచిలీపట్నం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి స్థానిక వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేత అయూబ్‌ఖాన్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయూబ్‌ఖాన్ వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిన తొలినాళ్ల నుంచి తన సేవలందించారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ అంటే అభిమానం. గతంలో 1982-1985 వరకు యాన్ ఎస్ యు ఐ ప్రెసిడెంట్ గా , తరువాత యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గా , ఫై సి సి మెంబెర్ గా తన సేవలందించారు. వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావానికి ముందు రాష్ట్ర కోఆర్డినేటర్గా వైస్ జగన్ తో ఉన్నారు. వైస్సార్సీపీ మైనారిటీ జిల్లా ప్రెసిడెంట్ గా పార్టీ కార్య క్రమాలను , సంక్షేమ , అభివృద్ధి పధకాలను ముఖ్యంగా మైనారిటీ , యస్ సి , యస్ టి, బి సి ప్రజల కు చేర్చటంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
వైస్సార్సీపీ పార్టీ పెట్టినప్పటినుండి వైఎస్ జగన్‌తోనే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. వైస్సార్సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు స్థానిక ప్రజలకు చేర్చటంలో ఆయూఖాన్ చేసిన కృషి తో ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టింది. దీంతో మచిలీపట్నం ప్రాంతంలో ఆయనకు ఎక్కువ జన ప్రాబల్యం ఉండటం ఆయనకు కలిసి వచ్చే మరో అంశం. మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఆయన ఒక నిరంతర శ్రామికుడు.
చాలా మంది వైఎస్సార్సీపీ నేతలకు సుపరిచితమైన వ్యక్తి. సమాజంలోని ప్రతి వర్గంతో సమస్యలను చర్చించి, పరిష్కార దిశగా అడుగులేస్తున్న వైస్సార్సీపీ విధేయ కార్యకర్తగా ఉన్నారు. తన చరిష్మాతో చాలా మంది ముస్లింలు ఇంకా ముస్లిమేతరులు అతనికి సపోర్ట్ గ ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశంగా స్థానికులు తెలుపుతున్నారు. మచిలీపట్టణం పార్లమెంట్ లోక్ సభ నియోజకవర పరిధిలో దాదాపు 4 లక్షలకు పైగా ముస్లిం ఓటర్లు ఉండటం అయూబ్ ఖాన్ కు కలిసి వచ్చే మరో అంశం గా ఉంది.
మచిలీపట్టణం వైస్సార్సీపీ నుండి ముస్లిం అభ్యర్థి గా మచిలీపట్టణం పార్లమెంట్ లోక్ సభ నియోజకవర్గం స్తానం అయూబ్ ఖాన్ కు ఇస్తే ఆయనే తోలి ముస్లిం పార్లమెంట్ లోక్ సభ అబ్యర్థి గా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.