With Operation Sindoor, the Armed Forces have given a fitting reply to the terrorists who wiped off the vermilion from Indian women’s foreheads
Salute to the soldiers fighting against terrorism
The army has responded strongly so that terrorists never dare to even look towards India
The strength and force of our nation lie in our armed forces
Prime Minister Modi is firm in his relentless fight against terrorism
– CM Chandrababu Naidu
On the occasion of the success of Operation Sindoor, CM participated in the Tiranga Rally held in Vijayawada
CM led chants of ‘Vande Mataram’ and ‘Bharat Mata Ki Jai’ along with citizens
Vijayawada, May 16: AP Chief Minister Chandrababu Naidu said that Operation Sindoor was a strong reply to the terrorists who wiped off the vermilion from women’s foreheads in India. He stated that Pakistan must realize its games will not work against India, and any attack on our country would mark their last day. He saluted the soldiers who are relentlessly fighting terrorism and said that in Modi, the country has found an able leader determined to eradicate terrorism. On the occasion of Operation Sindoor’s success, CM Chandrababu Naidu, Jana Sena President and Deputy CM Pawan Kalyan, AP BJP State President Daggubati Purandeswari, several ministers and MLAs participated in the Tiranga Rally held in Vijayawada. On this occasion, CM Chandrababu Naidu addressed the people on the following key topics.
Salute to the Armed Forces
“The incident in Pahalgam evokes valor and emotion in all of us. In front of their wives, husbands were killed; in front of their sons, fathers were brutally murdered in the name of religion. Operation Sindoor was launched to ensure that such terrorists, who wipe off the sacred Sindoor from women’s foreheads, are given a befitting response. I salute our armed forces who are fighting terrorism. I bow to the jawans who are protecting the nation under the harshest conditions. Because of their struggle, we are safe. Our nation’s pride, strength, and might lie in our armed forces. The defense forces have fought in a way that terrorists will not dare to target our country again. Not just Andhra Pradesh, the entire country is proud of our soldiers. The sight of the national flag fills us all with energy, emotion, and patriotism. It is a matter of pride for us all that Pingali Venkayya Garu, the designer of the national flag, hailed from this region,” said the Chief Minister.
Prime Minister Modi’s Relentless Fight Against Terrorism
“At the right time, our country found a capable leader in Prime Minister Modi. Terrorism is a menace gripping the world. We never initiate wars with other countries, but if provoked, we will deliver a strong response. Prime Minister Modi is waging a relentless war against terrorism. He is determined to eliminate terrorists wherever they are hiding in the world. Operation Sindoor has sent shockwaves through enemy nations. If they come to our country in the form of extremists, that will be their end. Our nation is progressing not just in defense, but as an economic power as well. No conspiracies, tactics, or envy can harm our country. By 2047, India will rank first or second in the world. For the nation’s security and integrity, we must all walk in unity. Let us move forward with the inspiration of Murali Naik, who gave his life for the country,” he added.
మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో త్రివిధ దళాలు బదులిచ్చాయి
ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనికులకు నా సెల్యూట్
అన్ని రంగాల్లో దేశం దూసుకుపోతోందనే అసూయతో కుట్రలు
భారత్‌పైకి ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా సైన్యం జవాబిచ్చింది
మనదేశ బలం, బలగం సాయుధ దళాలే
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం
-సీఎం చంద్రబాబు నాయుడు
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న సీఎం
వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ పౌరులతో నినాదాలు చేయించిన సీఎం
విజయవాడ, మే 16 :- మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ తో ధీటుగా బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ పై తమ ఆటలు సాగవని పాకిస్తాన్ గ్రహించాలని, మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…
సైనిక దళాలకు సెల్యూట్
పహల్గాం ఘటన గుర్తుకురాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం సాయుధ బలగాలే. రక్షణ దళాలు… ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు… దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం.
ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం
మన దేశానికి సరైన సమయంలో దొరికిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. మనం ఎప్పుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతాం. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కున్నా తుదముట్టించేందుకు ప్రధాని సంకల్పం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తీవ్రవాద రూపంలో మనదేశానికి వస్తే అదే వారికి చివరిరోజవుతుంది. మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగానూ ఎదుగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, అసూయ పడేవారెవరూ మన దేశాన్ని ఏం చేయలేరు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ స్పూర్తితో ముందుకు వెళదాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.