ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు పల్లెలలో సేవ చేస్తున్నాడు
విదేశీ భాషలలో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న పూలబాల
14 సంవత్సరాల క్రితం విజయవాడ లో ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్ సంస్థ స్థాపించి ఫ్రెంచ్ జర్మన్ వంటి విదేశీ భాషలను బోధిస్తున్న పూలబాల గ్రామీణ ప్రాంతాల పిల్లలకి ఉచితంగా ఇస్తున్నానని చెప్పారు ఈజీ ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్ డైరెక్టర్ వెంకట్ పూలబాల.
ఈయన కలం పేరు పూలబాల ఈయన ఫ్రెంచ్ జర్మన్ , స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లిష్ జాపనీస్ – ఆరు విదేశీ భాషలలో అనర్గళంగా మాట్లాడే బహుభాషి , ఈ భాషలన్నీ బోధిచడమే కాకుండా వాటిలో అత్యధికంగా పుస్తకాలు రచించిన ఏకైక ఎక్స్ ఫోనిక్ రైటర్.
యు జీ సి జాతీయస్థాయి సమావేశాల్లో ఫ్రెంచ్ జర్మన్ శాస్త్రీయ సాహిత్యం పై ప్రసంగించి ప్రశంసలు అందుకొన్నారు ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ , ఇంగ్లీష్ , జాపనీస్ భాషల్లో 60 పుస్తకాలు రాసి విదేశీభాషలపైన తనదైన ముద్రవేసి విదేశాలు వెళ్లే అవకాశాలు వదులుకుని, అనేక గ్రామాలలో ఉన్న స్కూల్స్ ను సందర్శిస్తూ డబ్బు ప్రసక్తి లేకుండా ఉచితంగా గ్రామీణ విద్యార్థులకు విదేశీభాషలను బోధిస్తున్న పూలబాలని గుర్తించి ఈ టీవీ బృందం కలిసింది.
వణుకూరు , గోశాల విద్యార్థులకి ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ ఇంగ్లిష్ వంటి విదేశీ భాషలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్న పూలబాలను, అతడి విద్యార్థులను ఇంటర్వ్యూ చేసింది. పూలబాల ఆరు భాషలలో చేసిన రచనల గురించి, వణుకూరికి చేస్తున్న సేవలగురించి తెలుసుకుని ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.
గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ , మరియు పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తానని ప్రయాణ ఖర్చులు కూడా తీసుకోకుండా అనేక చోట్ల సేవచేసినట్టు పూలబాల చెప్పారు. ఎవ్వరైనా తనని ఎప్పుడైనా సంప్రదించవచ్చని 9700877409 చెప్పారు.