అమరావతి…
రాజధాని గ్రామాల అభివృద్ధిపై గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రి నారాయణ
MLA శ్రావణ్ కుమార్,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు తో కలిసి మూడు గ్రామాల్లో స్థానికులతో సమావేశాలు నిర్వహణ
బోరుపాలెం,అబ్బరాజు పాలెం,రాయపూడిలో గ్రామసభల్లో ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన మంత్రి
అమరావతి నిర్మాణంతో సమానంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌళిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపకల్పన
ఆయా గ్రామాల్లో పలువురు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి నారాయణ
బోరుపాలెం లో 13.75 కోట్లు,అబ్బరాజు పాలెం లో 7.9 కోట్లు,రాయపూడిలో 22.12 కోట్లతో సిమెంట్ రోడ్లు,డ్రెయిన్లు, స్ట్రీట్ లైట్లు వంటి వసతులు కల్పించేలా డీపీఆర్ రూపొందించిన సీఆర్డీయే
…..నారాయణ,మంత్రి కామెంట్స్….
2014-19 లో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్లతో టెండర్లు పిలిచాం
గత ప్రభుత్వం రాజధానిపై మూడుముక్కలాట ఆడింది
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నాం
గత ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటంతో పనులు కొంచెం నెమ్మదిగా జరిగాయి
ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి
వర్షాకాలం నాటికి అన్ని గ్రామాల్లో మౌళిక వసతుల పనులు పూర్తి చేస్తాం
















































