Andhra Pradesh Library Parishad Chairman and Ongolu Constituency Observers . Mandapati Seshagiri Rao participated in the “Manam-Mana Library” program organized at Vizianagaram District Central Library.
Speaking on the occasion, the Chairman said that the Chief Minister of the State, YS. Just as Jaganmohan Reddy brought reforms in the education system to inspire the development of libraries in that direction, Jaganmohan Reddy initiated the development of libraries by bringing digital libraries in the state and everyone is talking about libraries on this day and libraries are bustling with new arrivals.
It is in this spirit that the “Manam-Mana Granthalayam” program is continued on the first Saturday of every month. On the occasion of bringing digital libraries to Andhra Pradesh for the first time in India, Jaganmohan Reddy has named the Telugu year as Jagan Digital Shobhakrit Nama year from this Ugadi.
Chairman of District Library Organization Reddy Padmavathy, Library Secretary Lalitha, Srinivas and staff participated in the program.
Andhra Pradesh Library Parishad Chairman and Ongole Constituency Observers Thaksha Seshagiri Rao visited the digital library under construction in Badangi village of Vizianagaram district.
“మనం-మన గ్రంధాలయం” కార్యక్రమం – విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో – ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ నియోజకవర్గ మందపాటి శేషగిరిరావు
విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో నిర్వహించిన “మనం-మన గ్రంధాలయం” కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ , ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి YS. జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన విధంగానే గ్రంథాలయాలను కూడా ఆ దిశగా అభివృద్ధికి స్ఫూర్తినిచ్చే విధంగా రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాలను తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ఒక్కరూ గ్రంథాలయాల గురించి మాట్లాడుకునే విధంగా , గ్రంథాలయాలు నూతన వరవడితో కళకళలాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గ్రంథాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
ఆస్ఫూర్తితోనే “మనం-మన గ్రంధాలయం” కార్యక్రమం ప్రతి నెల మొదటి శనివారం కొనసాగించబడుతుంది. డిజిటల్ గ్రంథాలయాలను భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ కి తెచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఉగాది నుండి తెలుగు సంవత్సరాన్ని జగన్ డిజిటల్ శోభకృత్ నామ సంవత్సరము గా నామకరణం చేయటమైనది.
కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి పద్మావతి ,గ్రంధాలయ సెక్రెటరీ లలిత ,శ్రీనివాస్ ,స్టాఫ్ పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా బాడంగి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ , ఒంగోలు నియోజకవర్గ పరిశీలకులు మందపాటి శేషగిరిరావు