Date :20-03-2023
అమరావతి:
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (SENSE) మరియు ఐట్రిపుల్ఈ (IEEE) సంయుక్త నిర్వహణలో మూడవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ (AISP’23) మూడురోజుల అంతర్జాతీయ సదస్సు
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (SENSE) మరియు ఐట్రిపుల్ఈ (IEEE) సంయుక్త నిర్వహణలో మూడవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ (AISP’23) మూడురోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మార్చి 18, 19, 20 తేదీల్లో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో జరిగింది. వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన సాంకేతికత, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల పాత్రలపై ఈ సదస్సులో చర్చించారు. ఆధునిక సమకాలీన ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ వినియోగం ఎలక్ట్రానిక్స్ మరియు రోబోటిక్స్ రంగాలలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్‌లో ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలను, అధ్యయనాలను పరిశ్రమల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించటానికి విస్తృతమైన వేదికను నెలకొల్పటమే ఈ సదస్సు యొక్క లక్ష్యం . ఈ సదస్సు యొక్క ఫలితాలు సామాజిక మరియు పారిశ్రామిక రంగాలలో ఏర్పడే సమస్యలను అధిగమించటానికి పరిష్కారాలు చూపుతోంది.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా,200 మంది ఒత్సాహిక పరిశోధకులు, రీసెర్చ్ స్కాలర్‌లు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన ముఖ్య అతిథి, గౌరవ అతిథి, ప్రతినిధులకు AISP’23 జనరల్ చైర్ డా|| బప్పదిత్య రాయ్ హృదయపూర్వక స్వాగతం పలికారు. AISP’23 జనరల్ చైర్ డా|| దీపక్ కుమార్ పాండా మూడురోజుల పాటు సదస్సులో చర్చించే అంశాలను, సదస్సు యొక్క లక్ష్యాన్ని అందరికి తెలియచేసారు.
ప్రత్యేక అతిధులు డా || ఈ . శ్రీనివాస రెడ్డి (ప్రొఫెసర్ & డీన్ (CSE), ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు వైస్ చైర్ IEEE, గుంటూరు సబ్ సెక్షన్) మరియు డా|| అతుల్ నేగి (IEEE చైర్,హైదరాబాద్ సెక్షన్) ప్రసంగిస్తూ IEEE నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ ప్రాముఖ్యతను తెలియచేసారు.
గౌరవ అతిథి డా || యు. చంద్రశేఖర్ (GMSIR సైంటిఫిక్ ఇన్నోవేషన్ & రీసెర్చ్ సెంటర్) మరియు ముఖ్య అతిధి శ్రీధర్ కొసరాజు (ప్రెసిడెంట్, ఆంధ్ర ప్రదేశ్ ఐటీ అసోసియేషన్) మాట్లాడుతూ వివిధ రంగాలలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ మరియు సిగ్నల్ ప్రాసెసింగ్ ల ఉపయోగాలను, భవిష్యత్తులో ఈ రంగాలలో ఏర్పడే ఉద్యోగ అవకాశాల గురించి తెలియచేసారు.
విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోటా రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో సాధిస్తున్న ప్రగతిని గణాంకాలతో వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి అనేక సదస్సులను నిర్వహిస్తామని తెలియచేసారు.
ఈ సదస్సులో విఐటీ – ఏపి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి , డా|| రవీంద్ర ధూలి (డీన్, అకడమిక్ రీసెర్చ్), డా|| ఉమాకాంత్ నందా (కన్వీనర్,AISP’23 మరియు డీన్, స్కూల్ అఫ్ ఎలక్ట్రానిక్స్), వివిధ విభాగాల డీన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
Date : 20-03-2023
Amaravati:
Three-day International Conference on Artificial Intelligence and Signal Processing (AISP’23) jointly organized by School of Electronics Engineering (SENSE) and iTripleE (IEEE) at VIT – AP University
Three-day International Conference on Artificial Intelligence and Signal Processing (AISP’23) jointly organized by School of Electronics Engineering (SENSE) and iTripleee (IEEE) at VIT-AP University. The conference was held on March 18, 19 and 20 at VIT – AP University. The conference discussed the roles of artificial intelligence, advanced technology, signal processing and electronics disciplines in various fields. In the modern contemporary world the use of artificial intelligence and signal processing has gained importance in the fields of electronics and robotics. The aim of this conference is to establish a broad platform to discuss recent research and studies in Artificial Intelligence and Signal Processing with industry representatives, scientists and experts. The results of this conference show solutions to overcome the problems arising in the social and industrial sectors.
A total of 200 enthusiastic researchers, research scholars, faculty and students participated in this conference. The Chief Guest, Guest of Honour, Delegates who attended the conference were AISP’23 General Chair Dr.|| Bappaditya Roy extended a warm welcome. AISP’23 General Chair Dr|| Deepak Kumar Panda informed everyone about the topics to be discussed in the conference for three days and the objective of the conference.
Special guests Dr || This Srinivasa Reddy (Professor & Dean (CSE), Acharya Nagarjuna University and Vice Chair IEEE, Guntur Sub Section) and Dr|| Atul Negi (IEEE Chair, Hyderabad Section) gave a speech explaining the programs conducted by IEEE and highlighted the importance of Artificial Intelligence and Signal Processing.
The guest of honor was Dr || U. Chandrasekhar (GMSIR Scientific Innovation & Research Centre) and Chief Guest Sridhar Kosaraju (President, Andhra Pradesh IT Association) spoke about the uses of artificial intelligence and signal processing in various fields and the future job opportunities in these fields.
VIT – AP University Vice Chancellor Dr S.V. Kota Reddy said that the progress of the university in the field of research was explained with statistics. He informed that many conferences will be held in the future.
In this conference, VIT – AP University Registrar Dr Jagdish Chandra Mudiganti, Dr Ravindra Dhuli (Dean, Academic Research), Dr|| Umakant Nanda (Convener, AISP’23 and Dean, School of Electronics), Deans of various departments, teachers, students and staff participated.