పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.
New Delhi: గణతంత్ర వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శించిన శకటానికి, సాంస్కృతిక ప్రదర్శనలకు లభించిన బహుమతులను కేంద్ర మంత్రి అజయ్ భట్ చేతుల మీదుగా రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్ స్వీకరించారు. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో ఏపి శకటానికి, కళా ప్రదర్శనలకు తృతీయ బహుమతులు లభించాయి.
75వ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న శకటాలకు నిర్వహించిన జూరీ ఎంపికలు, దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ ఎంపిలలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన శకటాలకు రిపబ్లిక్ డే క్యాంపులో రక్షణ శాఖ మంగళ వారం బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించారు.
పీపుల్ ఛాయస్ కేటగిరీలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది.
ఆంధ్ర ప్రదేశ్ శకటం పై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్,ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఆంధ్ర ప్రదేశ్ శకటం రూపకల్పన చేయటం దానికి తగినవిధంగా సకల విద్యలకు మేమే సాటి…విశ్వ విద్యకు మేమే పోటీ
డిజిటల్ చదువులే భవితకు తరగని ఆస్థి.. ఇది మా డిజిటల్ క్లాస్ రూమ్ …
ఆట పాటల అక్షర దోస్తీ ..అఆ ఇఈ అంటూ పలక బలపం పట్టాం
ABCD అంటూ ఇంగ్లీష్ మీడియం తెచ్చ్చామ్.. ట్యాబులను చేతిన పట్టీ విశ్వ విద్యను నేర్పం…దేశ ప్రగతికిది సోపానం ..విశ్వ విధ్యే మా లక్ష్యం
జయహో ఆంధ్రప్రదేశ్
జయ జయహో ఆంధ్రప్రదేశ్
జయ జయహో భారత దేశ్ అంటూ సాగిన నేపద్య గానం అందరిని ఆకట్టుకుంది.
26,27 తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపి శకటానికి మూడో స్థానం వచ్చేటట్టు చేసాయి.
తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం.. ద్వితీయ స్థానంలో యుపి శకటం నిలిచాయి.
మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ చేతుల మీదుగా ఈ అవార్డును రెసిడెంట్ కమీషనర్ శ్రీ లవ్ అగ్రవాల్ మరియు ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ జేడీ కిరణ్ కుమార్, ఆర్ట్ డిమానిస్త్రేటర్ మధు అందుకున్నారు.
ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక పోటీలలో సైతం ఆంధ్ర ప్రదేశ్ కు తృతీయ స్ధానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్ర ప్రదేశ్ కళాకారులూ ప్రదర్శించిన నృత్య ప్రదర్శన సభికులందరిని సమ్మోహనపరచింది.