తేదీ.29.12.2025 సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు శ్రీ అనగాని సత్య ప్రసాద్, శ్రీ నాదెండ్ల మనోహర్ మరియు శ్రీ సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు…
1. రెవెన్యూ శాఖ:
ఎలూరు జిల్లా నుజివీడు టౌన్ & మండలంలో R.S.No.1065/1B లో 0.60 ఎకరాలు మరియు R.S.No.1065/2B లో 9.36 ఎకరాలు కలుపుకుని మొత్తం 9.96 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (IIPM) స్థాపన కోసం హార్టికల్చర్ & సెరికల్చర్ విభాగ డైరెక్టర్ కు 33 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
లీజు అద్దె రూ.13,7,00,000 పై 10% ప్రాత్రిపదికన 13,70,000 సంవత్సరానికి చెల్లించాలి. అయితే, ప్రతీ 5 సంవత్సరాల వ్యవధిలో ప్రస్తుత లీజు అద్దెపై 10% వరకు పెంచవచ్చు. లేదా BSO-24 నిబంధనల ప్రకారం ఉచితంగా, G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.9.2012 మరియు ఇతర సాధారణ నిబంధనల ప్రకారం కేటాయించవచ్చు.
2. రెవెన్యూ శాఖ:
Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామం & మండలంలో సర్వే నెం.972 (పాత R.S.No.971)లో 9.88 ఎకరాల లీజును మూడు (3) సంవత్సరాల కాలానికి పునరుద్ధరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని వేదాంత లిమిటెడ్ (I&I ద్వారా)కు ఆన్‌షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు.
లీజు అద్దె మార్కెట్ విలువపై 10% చొప్పున ఏడాదికి రూ.15,00,000/- (మొత్తం భూమి విలువ 9.88 ఎకరాలకు రూ.14,82,000) చెల్లించాలి. ఇది G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.09.2012 లోని 3(h)(d) నిబంధనల ప్రకారం ఉంటుంది.
3. రెవెన్యూ శాఖ:
తిరుపతి జిల్లా దామినేడు గ్రామం సర్వే నెం.193-8, 193-9 మొదలైన వాటిలో మొత్తం 28.37 ఎకరాల ప్రభుత్వ భూమిను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, తిరుపతి స్థానంలో SAAP కు “స్పోర్ట్స్ సిటీ” స్థాపన కోసం ఉచితంగా ఆ భూమిని బదిలీ చేసేందుకు తే.12.12.2025న రెవెన్యూ (భూములు-VIII) శాఖ ద్వారా జారీ చేసిన G.O.Ms.No.490 ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ముందుగా తే.28.11.2025న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కౌన్సిల్ రిజల్యూషన్ నెం.571/2025 ద్వారా ఈ భూమిని AP టూరిజం అథారిటీ (APTA)కు నేషనల్ స్టాండర్డ్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్థాపనకు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. తరువాత యువజన, పర్యాటక & సాంస్కృతిక శాఖ అభ్యర్థన మేరకు APTA స్థానంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (SAAP)కు “స్పోర్ట్స్ సిటీ” స్థాపన కోసం బదిలీ చేయాలని నిర్ణయించారు. తత్కాలిక అవసరం దృష్ట్యా తే.12.12.2025న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. BSO-24 మరియు G.O.Ms.No.571, రెవెన్యూ (అసైన్‌మెంట్-I) శాఖ, తే.14.9.2012 నిబంధనలు మరియు సాధారణ షరతులకు లోబడి ఉచితంగా బదిలీ చేయబడుతుంది.
4. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
తే.11.12.2025న విడుదల చేసిన G.O.Ms.No.269, MA&UD (CRDA) శాఖ ఆదేశాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో అమరావతిలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నుండి NABARD ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అసిస్టెన్స్ (NIDA) స్కీమ్ కింద రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు APCRDA కమిషనర్, విజయవాడకు అనుమతి ఇవ్వడానికి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
NABARD ద్వారా మంజూరు చేసిన రుణం నిబంధనలు మరియు షరతుల ప్రకారం 5% గ్యారెంటీ ఫీజు చెల్లింపుకు లోబడి అమలు చేయాలి. APCRDA కమిషనర్ లేదా కమిషనర్ చేత అధికారం పొందిన ఏ APCRDA అధికారికైనా ఆర్థిక శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వ హామీ మరియు కంఫర్ట్ లెటర్ పొందేందుకు, రూ.7,387.70 కోట్ల NABARD రుణానికి భద్రత కల్పించేందుకు, రుణ ఒప్పందం మరియు అథారిటీ నిర్ణయాల అమలుకు అవసరమైన ఇతర చర్యలు మరియు డాక్యుమెంట్లను అమలు చేసేందుకు అధికారం ఇవ్వడానికి ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
5. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
వరల్డ్ బ్యాంక్ మరియు ADB ఫైనాన్స్‌తో అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ప్యాకేజీ XXXXX కింద “సర్వే, ఇన్వెస్టిగేషన్, డిజైన్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్-2 కమిషనింగ్ (కెపాసిటీ 8400 క్యూసెక్) 15 సంవత్సరాల ఆపరేషన్ & మెయింటెనెన్స్‌తో లంప్‌సమ్ కాంట్రాక్ట్ (% టెండర్) ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి క్యాపిటల్ సిటీలో” పనికి L1 బిడ్‌ను ఆమోదించేందుకు చైర్‌పర్సన్ & M.D, ADCL, విజయవాడకు అధికారం ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కాంట్రాక్ట్ విలువ రూ.443,76,31,461.63 (ECV విలువపై +4.75% అదనంగా). ఈ పనిని L1 బిడ్డర్‌కు అప్పగించడానికి మరియు అవార్డు ఇవ్వడానికి, వరల్డ్ బ్యాంక్ మరియు ADB ఫైనాన్సింగ్ ద్వారా APCRDA నిధులు అందజేయడానికి, C&MD, ADCL అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. APCRDA అథారిటీ తన రిజల్యూషన్ నెం.617/2025, తే.22.12.2025 ద్వారా దీనికి ఆమోదం తెలిపింది.
6. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ల లేఔట్‌లలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో అనుబంధంగా జోన్-8 ఏరియాలోని కృష్ణయపాలెం (P), వెంకటపాలెం (P), పెనుమాక (P) మరియు ఉండవల్లి (P) గ్రామాల్లో మరియు ప్రక్కనే ఉన్న జోన్‌లలోని పెనుమాక లేఔట్‌లో ప్యాకేజీ XXXXXI కింద “రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై, సీవరేజ్, పవర్ & ICT కోసం యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్‌లైన్, STP & అవెన్యూ ప్లాంటేషన్” నిర్మాణానికి L1 బిడ్‌ను ఆమోదించేందుకు చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడకు అధికారం ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
లంప్‌సమ్ కాంట్రాక్ట్ (% టెండర్) ప్రాతిపదికన 2 సంవత్సరాల DLP తో కాంట్రాక్ట్ విలువ రూ.1358,00,19,392.34 (ECV విలువపై +4.03% అదనంగా). ఈ పనిని L1 బిడ్డర్‌కు అప్పగించడానికి మరియు అవార్డు ఇవ్వడానికి, APCRDA నిధులు అందజేయడానికి, C&MD, ADCL అవసరమైన అన్ని చర్యలు తీసుకునే విధంగా అనుమతి ఇవ్వడం జరిగింది. APCRDA అథారిటీ తన రిజల్యూషన్ నెం. 618/2025, తే.22.12.2025 ద్వారా దీనికి ఆమోదం తెలిపింది.
7. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
తిరుపతి జిల్లా సెట్టిపల్లి లాండ్ పూలింగ్ స్కీమ్ కింద తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (TUDA)చే అమలు చేయబడిన అన్ని కన్వేయెన్స్ డీడ్స్‌కు సంబంధించి లబ్ధిదారులకు/కేటాయింపుదారులకు ఇండియన్ స్టాంప్ యాక్ట్, 1899లోని సెక్షన్ 9(a) కింద స్టాంప్ డ్యూటీ మరియు A.P. రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908లోని సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
తిరుపతిలోని సెట్టిపల్లి గ్రామంలో దశాబ్దాలుగా టైటిల్ లేకుండా ప్రైవేట్ ఆక్రమణలో ఉన్న పెద్ద భూములను క్రమబద్ధీకరించేందుకు ఈ లాండ్ పూలింగ్ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. G.O.Ms.No.60 తే.24.01.2019 మరియు G.O.Ms.No.173 తే.15.02.2019 ద్వారా ఆమోదించిన ఈ పథకం కింద 2,206 హౌస్ సైట్ ప్లాట్ల యజమానులకు (123.09 ఎకరాలలో 50% భాగస్వామ్యం) మరియు 251 వ్యవసాయ భూ యజమానులకు (163.74 ఎకరాలలో 30% భాగస్వామ్యం) అభివృద్ధి చేసిన ప్లాట్లు ఉచితంగా రిజిస్టర్ చేయాలని నిర్ణయించారు. మొత్తం 2,457 మంది లబ్ధిదారులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు యొక్క ఆర్థిక భారం దాదాపు రూ.16.25 కోట్లుగా అంచనా వేయబడింది.
8. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
CRDA ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపుకు సంబంధించిన సమీక్షకు తే.22.12.2025న జరిగిన GoM సమావేశం సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతి లాండ్ అలాట్‌మెంట్ రూల్స్, 2017 మరియు అమరావతి లాండ్ అలాట్‌మెంట్ రెగ్యులేషన్స్ 2017 నిబంధనలకు అనుగుణంగా APCRDA కమిషనర్ కు అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.
9. పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ:
మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్-AS లో వికేంద్రీకృత అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి రూ.1673.51 కోట్లకు ప్రతిపాదన చేసేందుకు పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (HAM) కింద రెండు దశల్లో అమలు చేయనున్నారు. మొత్తం ఖర్చు రూ.1673.51 కోట్లు (CAPEX రూ.1111.03 కోట్లు + అన్యూటీల వడ్డీ రూ.428.81 కోట్లు + GST రూ.77.20 కోట్లు + OPEX రూ.56.47 కోట్లు). ఫేజ్-I లో 7 జోన్లలో 300 కి.మీ UGD నెట్‌వర్క్, 4 లిఫ్ట్ స్టేషన్లు, 26.48 MLD STP లతో రూ.604.32 కోట్ల ఖర్చు అవుతుంది. ఫేజ్-II లో 13 జోన్లలో 231 కి.మీ UGD నెట్‌వర్క్, 14 లిఫ్ట్ స్టేషన్లు, 21.03 MLD STP లతో రూ.563.18 కోట్ల ఖర్చు అవుతుంది. HAM మోడల్ కింద ప్రభుత్వం/ULB/APCRDA 40% (నిర్మాణ సమయంలో) మరియు ప్రైవేట్ డెవలపర్ 60% (సెమీ-యాన్యువల్ అన్యూటీ పేమెంట్ల ద్వారా 10 సంవత్సరాల్లో తిరిగి చెల్లించబడుతుంది) భాగస్వామ్యంతో అమలు చేయబడుతుంది.
10. పర్యావరణం, అటవీ, శాస్త్ర & సాంకేతిక శాఖ:
తే.10.02.2025న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు W.P.Nos. 24591 & 17319 of 2012 మరియు 16265 of 2014లో జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పిటిషనర్ శ్రీ K. సురేష్ కుమార్‌ను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ACF)గా నియమించడం, ACF క్యాడర్‌లో సూపర్‌న్యూమెరరీ పోస్ట్‌ను సృష్టించడం, రూ.61960-151370 వేతన స్కేల్‌లో నోటిఫికేషన్ నెం.23/2007 తే.06.12.2007లోని బ్యాచ్ మేట్స్‌తో సమానంగా సీనియారిటీతో నియమించడం, ఇతర అనుబంధ ప్రయోజనాలను నోషనల్‌గా పరిగణించడం, భవిష్యత్తులో ACF లో ఒక శాశ్వత పదవిని రద్దు చేయడం వంటివి ఈ ఆదేశాల్లో ఉన్నాయి.
APPSC నోటిఫికేషన్ నెం.23/2007 తే.06.12.2007 ద్వారా 22 ACF ఖాళీలకు నేరుగా నియామకం కోసం ప్రకటన జారీ చేయబడింది. మెరిట్ జాబితాలో శ్రీ K. సురేష్ కుమార్ 9వ ర్యాంక్ సాధించారు. అయితే APPSC వర్టికల్ రిజర్వేషన్‌తో పాటు స్వతంత్రంగా హారిజాంటల్ రిజర్వేషన్ వర్తింపజేయడం వల్ల నలుగురు మహిళా అభ్యర్థులను చేర్చడంతో ఆయన ఎంపిక కాలేదు. హైకోర్టు హారిజాంటల్ రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ చట్రంలోనే వర్తింపజేయాలని స్పష్టం చేసింది. న్యాయ శాఖ అభిప్రాయం ప్రకారం ఈ తీర్పుపై అప్పీల్ చేయడంలో విజయం సాధించే అవకాశం లేదు.
11. సాంఘిక సంక్షేమ శాఖ:
షెడ్యూల్డ్ కులాల 11,479 మంది లబ్ధిదారుల ప్రయోజనం కోసం NSFDC మరియు NSKFDC కు సంబంధించి రూ.41.61 కోట్ల బకాయి వడ్డీ మొత్తాన్ని 4 నెలల వ్యవధిలో ప్రిన్సిపల్ (అసలు) మొత్తం చెల్లింపుకు లోబడి మినహాయించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
APSCCFC లిమిటెడ్ NSFDC మరియు NSKFDC సహకారంతో పేద షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు ఆదాయ కల్పన కోసం రుణాలు అందిస్తోంది. తే.30.11.2025 నాటికి NSFDC కింద 8,021 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.271.20 కోట్ల రుణం మంజూరు చేయబడింది, ఇందులో రూ.79.47 కోట్లు చెల్లించబడ్డాయి, రూ.190.70 కోట్లు బకాయి ఉంది మరియు రూ.32.56 కోట్ల వడ్డీ ఉంది. NSKFDC కింద 3,458 మంది లబ్ధిదారులకు రూ.68.39 కోట్ల రుణం మంజూరు చేయబడింది, ఇందులో రూ.6.23 కోట్లు చెల్లించబడ్డాయి, రూ.62.14 కోట్లు బకాయి ఉంది మరియు రూ.10.67 కోట్ల వడ్డీ ఉంది. లబ్ధిదారులు రుణ భారం నుండి ఉపశమనం పొందేందుకు మరియు NSFDC, NSKFDC లు తదుపరి రుణాలు అందించేందుకు వీలుగా ఈ వడ్డీ మినహాయింపు అవసరం. ఈ నిర్ణయం వలన 11,479 మంది లబ్ధిదారులు బకాయిల నుండి ఉపశమనం పొందడంతో పాటు కొత్త రుణాలు పొందే సౌకర్యం ఏర్పడుతుంది.
12. ఇంధన శాఖ:
2025-26 సంవత్సరానికి విద్యుత్ రంగంలో పనితీరుకు అనుసంధానించిన GSDP లో 0.50% వరకు అదనపు రుణాన్ని పొందేందుకు ప్రిపెయిడ్ స్మార్ట్ మీటరింగ్‌ను అన్ని ప్రభుత్వ శాఖల సేవలకు అమలు చేయడానికి సవరించిన పద్ధతులపై AP పవర్ కో-ఆర్డినేషన్ కమిటీ (APPCC) సభ్యుల కన్వీనర్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. నీటి వనరుల శాఖ:
కలంగి నది ఎడమ ఒడ్డున ఉన్న ఫ్లడ్ బ్యాంక్ అభివృద్ధి పనుల్లో Package–I కింద ఉన్న పనులను ముందుగానే ముగించడానికి (Pre-Closure) రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
M/s GVR Infra Projects Limited సంస్థకు అప్పగించ బడిన ఈ పనులు D.V. సత్రం మరియు తడ మండలాల పరిధిలో KM 0.000 నుండి KM 26.150 వరకు కలంగి నది సమీప ప్రాంతాల్లో ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం, పాత స్లూయిసులు మరియు నిర్మాణాల పునర్నిర్మాణం, కొత్త నిర్మాణాల ఏర్పాటు, WBM రోడ్ల రూపకల్పన మరియు నిర్మాణం వంటి అంశాలు ఉన్నాయి.
14. నీటి వనరుల శాఖ:
AVR HNSS ప్రాజెక్ట్-ఫేజ్-I-స్టేజ్-I లోని PS No.9 నుండి PS No.11 వరకు పంపింగ్ స్టేషన్లకు ఆమోదించబడిన డిజైన్స్/డ్రాయింగ్‌ల ప్రకారం ఇండక్షన్ మోటార్లలో పెరిగిన మెగావాట్ కెపాసిటీ కోసం అదనపు ఖర్చుకు రూ.76,80,000/- మొత్తానికి పరిపాలనా ఆమోదం ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమలు సమయంలో ఏర్పడిన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోబడింది.
15. ఆర్థిక శాఖ:
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2024 జనవరి 1వ తేదీ నుండి డీఏ/డీఆర్ 3.64% పెంపు చేస్తూ అమలులోకి వచ్చే విధంగా ఆర్థికశాఖ 2025 అక్టోబర్ 20 & 21 తేదీల్లో జారీ చేసిన G.O.Ms.No.60, 61, 62 & 63 ఆదేశాలను ఆమోదించే (ratification) ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ, వ్యయ విభాగం 7వ కేంద్ర జీతాల కమిషన్ (2016) ప్రకారం వేతనాలు పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA ను 46% నుండి 50%కు w.e.f. 01.01.2024 నుండి పెంచేందుకు O.M.No.1/1/2024-E.II(B) తే.12.03.2024 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 6వ కేంద్ర జీతాల కమిషన్ (2006) ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు DA ను 230% నుండి 239%కు w.e.f. 01.01.2024 నుండి పెంచేందుకు O.M.No.1/3(1)/2008-E.II(B) తే.03.06.2024 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు DA/DR @ 3.64% పెంపు (33.67% నుండి 37.31%కు) తే.01.01.2024 నుండి అమలు చేస్తూ అక్టోబర్ 2025 జీతం నుండి ప్రయోజనం అందించేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
16. గ్రామ, వార్డు సచివాలయాలు:
GSWS శాఖ, డైరెక్టరేట్, గ్రామ / వార్డు సచివాలయాలు మరియు జిల్లా GSWS కార్యాలయాల నామకరణాలను (Nomenclatures) మార్చేందుకు “ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు చట్టం, 2023”లో సవరణ చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలను సాధించడంలో గ్రామ/వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి, అంటే, మానవ వనరులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు పారిశ్రామిక అభివృద్ధి పౌరుల వ్యక్తిగత, కుటుంబ మరియు సమాజ అవసరాలను తీర్చడానికి అభివృద్ధి స్వర్ణ ఆంధ్ర విజన్ డాక్యుమెంట్ ప్రకారం కార్యనిర్వాహకుల పాత్రలు & బాధ్యతలను సవరించాల్సిన అవసరం ఉంది. GSWS విభాగం యొక్క ప్రస్తుత పేరు ఇకపై శాఖ యొక్క ప్రస్తుత కార్యకలాపాలు, బాధ్యతలు లేదా అందించాల్సిన సేవల పూర్తి శ్రేణిని ఖచ్చితంగా వివరించదు.
వ్యూహాత్మక కార్యాచరణ కారణాల దృష్ట్యా నామకరణాన్ని మార్చడం అవసరం మరియు శాఖ & దాని ప్రస్తుత విధులు, పరిధి మరియు వ్యూహాత్మకం మెరుగ్గా ప్రతిబింబించేదుకు ఈ మార్పు తప్పనిసరి.
17. న్యాయ – హోం (కోర్టులు) శాఖ:
ఈ-కోర్ట్స్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టుల్లో 13 సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు (₹40,970–1,24,380 వేతన శ్రేణి) మరియు 26 సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు (₹25,220–80,910 వేతన శ్రేణి) కల్పనకు రాష్ట్ర మంచి మండలి ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న సిబ్బందిని ఈ కొత్త పోస్టుల్లో విలీనం చేయడం, అలాగే మిగిలిన ఖాళీలను కాంట్రాక్టు విధానంలోనే భర్తీ చేయడానికి ప్రతిపాదించబడింది.
18. యువజన వ్యవహారాలు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ:
APTDC VC&MD ప్రతిపాదన మేరకు, తిరుపతి జిల్లా పెరూరు గ్రామం Sy.No.604లోని ప్రభుత్వ భూమిలో “Hyatt Regency” పేరుతో ఐదు నక్షత్రాల లగ్జరీ హోటల్ స్థాపనకై M/s MRKR Constructions & Industries Pvt. Ltd.తో 2024 ఫిబ్రవరి 14న కుదిరిన లీజ్ ఒప్పందాన్ని రద్దు చేసి, పెట్టుబడిదారు చెల్లించిన చట్టబద్ధ రుసుములను తిరిగి చెల్లించడానికి పర్యాటక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది
ముందుగా G.O.Ms.No.14 తే.21.7.2023 ద్వారా పెరూరు విలేజ్ సర్వే నెం.604లో 3 ఎకరాలు, తరువాత G.O.Ms.No.23 తే.08.11.2023 ద్వారా అదనంగా 2 ఎకరాలు (మొత్తం 5 ఎకరాలు) రూ.218 కోట్ల పెట్టుబడితో కేటాయించబడింది. పెట్టుబడిదారు రూ.6.03 కోట్లు (అడ్వాన్స్ లీజు అద్దె, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు, పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ మొదలైనవి) చెల్లించి ఫైర్ మరియు ఎయిర్‌పోర్ట్ NOC లు పొంది, TUDA కు డిజైన్స్ సబ్మిట్ చేశారు. అయితే అదే సర్వే నెం.604లో ఓబెరాయ్ గ్రూప్ ప్రాజెక్ట్‌పై విస్తృత ప్రజా వ్యతిరేకత మరియు ధార్మిక సంస్థల నిరసనల కారణంగా తిరుమల పవిత్రత పరిరక్షణ కోసం TTD బోర్డు రిజల్యూషన్ నెం.102 తే.18.11.2024 ద్వారా భూ కేటాయింపు రద్దు చేయాలని సిफార్సు చేసింది. తదనుగుణంగా G.O.Ms.No.22 తే.07.08.2025 ద్వారా ప్రభుత్వం ఓబెరాయ్ గ్రూప్ కేటాయింపు రద్దు చేసింది. అదే సర్వే నెంబర్‌లో ఉన్న MRKR కన్‌స్ట్రక్షన్స్ లీజ్ కూడా లీజ్ డీడ్ క్లాజ్ 12.2(iii) (పబ్లిక్ పర్పస్ నాన్-ఫాల్ట్ టెర్మినేషన్) కింద 60 రోజుల నోటీసుతో రద్దు చేయబడింది.
19. మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ:
తిరుపతి జిల్లా దుగరాజుపట్నంలో Shipbuilding Development Scheme (SbDS) కింద గ్రీన్‌ఫీల్డ్ పోర్టు మరియు షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు అవసరమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ సముద్ర మండలి (APMB) తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20.మౌలిక వసతులు మరియు పెట్టుబడుల శాఖ:
SPSR నెల్లూరు జిల్లా దామవరం గ్రామం Sy.No.1/1లో ఉన్న 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL)కు అనుమతి ఇవ్వడం, అలాగే జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన ప్రకారం శాశ్వత లీజ్ హోల్డర్లకు ఎకరాకు ₹13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
21. రవాణా, రోడ్లు & భవనాల శాఖ:
లైఫ్ టాక్స్ వర్తించే మోటార్ వాహనాలపై లైఫ్ టాక్స్‌లో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
AP మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్, 1963లో సెక్షన్ 3-C ను కొత్తగా చేర్చడం మరియు AP MVT యాక్ట్ 1963లో తొమ్మిదవ షెడ్యూల్ తర్వాత పదవ షెడ్యూల్‌ను జోడించడం ద్వారా సవరణ చేయబడుతుంది. ఈ విధంగా సేకరించబడే మొత్తాన్ని AP రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, కీలకమైన రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడం మరియు రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలను తగ్గించడం కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది.
రాష్ట్రంలో ప్రతినెలా సుమారు 73,000 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా నెలకు రూ.22.5 కోట్లు, సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాలపై GST ను 28% నుండి 18%కు తగ్గించడంతో వాహన కొనుగోలుదారులకు గణనీయమైన ఆదా కలుగుతోంది. అందువల్ల ఈ చిన్న సెస్ విధించడం వల్ల వాహన యజమానులపై అధిక ఆర్థిక భారం ఉండదు. రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనందున బిల్లు స్థానంలో ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది.
22. రెవిన్యూ శాఖ:
బాపట్ల మండలంలోని వెస్ట్ బాపట్ల గ్రామం Sy.No.1341-3Aలో ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టిడిపి జిల్లా అధ్యక్షుడు, బాపట్లకు లీజ్ పద్ధతిలో కేటాయించి, టిడిపి జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ భూమికి గాను ఎకరాకు సంవత్సరానికి ₹1,000 చొప్పున లీజ్ రుసుము చెల్లిస్తూ, 33 సంవత్సరాలపాటు లీజ్‌పై భూమిని వినియోగించుకునేలా ప్రతిపాదించబడింది.
23. రెవెన్యూ శాఖ:
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం, గుడివాడ గ్రామంలోని Sy.No.27/3లో ఉన్న 18.57 ఎకరాల ప్రభుత్వ భూమిని రాష్ట్రీయ సేవా సమితికి (Rashtriya Seva Samithi) బదిలీ చేయడానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి ఆమోదం తెలిపింది.
ఈ భూమికి గాను ఎకరాకు ₹80 లక్షల చొప్పున, మొత్తం ₹14,85,60,000 పరిహారం చెల్లించాలనే జిల్లా కలెక్టర్, విశాఖపట్నం ప్రతిపాదన మేరకు భూస్వామ్య హక్కుల బదిలీకి అనుమతి ఇచ్చేందుకు ప్రతిపాదించడమైంది.
24. పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ:
అమరావతి రాజధానిలో “అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC)” నిర్మాణానికి రూపకల్పన మరియు నిర్మాణ (Design-Build) విధానంలో టెండర్ మంజూరు చేయడానికి మరియు ఈ ప్రాజెక్టుకు ₹137 కోట్లు పరిపాలనా ఆమోదం ఇవ్వడం, అలాగే టెండర్ ప్రక్రియలో అతి తక్కువ బిడ్ సమర్పించిన L1 బిడ్డర్ అయిన లార్సన్ & టూబ్రో సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించేందుకు అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ పాల్గొన్నారు.
తే.29.12.2025 దీ సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వభజన అంశంపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ వివరిస్తూ…..
జిల్లాల పునర్విభజనపై సుదీర్ఝంగా జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 17 జిల్లాల్లో మార్పులు కోసం ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఈ 17 జిల్లాల్లో 25 మార్పులు చేయడం జరిగింది. మిగిలిన 9 జిల్లాల్లో అంటే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ,గుంటూరు, పల్నాడు మరియు అనంతపురం జిల్లాల్లో ఎటు వంటి మార్పులు లేవన్నారు. గజిట్ జారీ చేసిన తదుపరి ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ మార్పులు చేయడం జరిగింది. అవసరం ఉన్న చోట మండలాలు, డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా రంపచోడవరం నియోజక వర్గాన్ని పోవలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలవరం గ్రామాన్ని అభివృద్ది పర్చి రెవిన్యూ డివిజన్ గా భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రజలకాంక్ష మేరకు గూడూరు లోని కోట, చిలకూరు, గూడూరు మూడు మండలాలను నెల్లూరులోకి తీసుకురావడం జరిగింది. క్రింద నున్న రెండు మండలాలను తిరుపతిలోకి తీసుకురావడం జరిగింది. సామర్లకోట మండలాన్ని పెద్దాపురంలోకి, మండపేటను రాజమండ్రిలోకి మార్చడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చడం జరిగింది. అద్దంక్కి నియోజక వర్గాన్ని బాపట్ల నుండి ప్రకాశం జిల్లాలోకి మరియు దర్శి నియోజక వర్గం మొత్తం అద్దంక్కి సబ్ డివిజన్ లో ఉంచుతూ ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా మార్చడం జరిగింది. మార్కాపురం, కనిగిరి, ఎరగొండపాలెం, గిద్దలూరును కలిపి నూతనంగా మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి, రాజంపేటను కడప జిల్లాలోకి మార్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరిగింది. రాయచోటి నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయలేము కాబట్టి, దాన్ని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ జిల్లా కేంద్రంగా మదనపల్లెను మార్చడం జరుగుచున్నది. బనగానిపల్లె ఒక సబ్ డివిజన్ గా ఏర్పాటు అవుతున్నది. అనకాపల్లి జిల్లాలోని అడ్దరోడ్దను ఒక సబ్ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరుగుచున్నది. సిద్దవటం, ఒంటిమెట్టను కడపలోనే ఉండే విధంగా మరియు మడకసిరను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని-1 మరియు ఆదోని -2 అన ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పాటు అవుతున్న పోలవరం, మార్కాపురం జిల్లాలను కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉంటాయి.
జిల్లాల పునర్విభజనకు సంబందించి తే.27.11.2025 దీన గజట్ జారీచేసి, తే.27.12.2025 దీ వరకు అన్ని అభ్యంతరాలను స్వీకరించి చర్చించడం జరిగింది కాబట్టి, వెనువెంటనేనోటిఫికేషన్ ఇచ్చి మార్పులు అన్నీ 2025, డిసెంబర్ 31వ తేదీ నుండి ఆచరణలోకి వస్తాయన్నారు.












































