-
జీవితమంతా మౌనప్రేమలో మహా కవి – లారా డే నోవెస్
-
పెద్ద రచనల వెనుక ప్రేరణ ప్రేమే సుమా
అతడు ఇటాలియన్ కవి పండితుడు లాటిన్ లో గొప్ప గ్రంధం వ్రాసి అంతర్జాతీయ కీర్తి నార్జించాడు. అతడిపేరు పెట్రార్చ్. 366 సొనెట్స్ రాసిన ప్రపంచంలో అతిపెద్ద సోనెటీర్ . షేక్స్ పియర్ కంటే తోపు.
చాలా పెద్ద మనిషే కానీ పాపం ప్రేమలో పడ్డాడు. అందులో తప్పేంలేదు కదా అనొచ్చు. కానీ ఆమె వివాహిత. ఒక రాజు కి భార్య .
లారా దే నోవెస్ ను పెట్రార్చ్ తన జీవితకాలం మౌనంగా ప్రేమించాడు. ఆమె కోసం పరితపిస్తూ సొనెట్‌ను రాసాడు. పెట్రార్చ్ ఆమెను మొదటిసారి అవిన్యాన్ నగర చర్చ్ లో 1327లోచూసాడు. అప్పటికి ఆమె వయసు 15 సంవత్సరాలే. కానీ ఆమెకు అప్పటికే పెళ్లి అయిపోయింది. ఆమె ఆడిబర్ట్ డి నోవ్స్ అనే రాజు భార్య. పెళ్లి అయినస్త్రీ అని తెలిసినా ప్రేమ ను చంపుకోలేక పోయా డు. జీవిత కాలం మౌనంగా ఆమెను ఆరాధకుడిగా మిగిలిపోయాడు. ఆమె చర్చికి వచ్చేటప్పుడు చూడడానికే అతడు అక్కడ చర్చిలోనే ఉండిపోయాడు. ఆమె సమీపంలో ఉండటానికి వాక్లూస్‌లో ఒక చిన్న ఎస్టేట్‌ను కూడా కొనుగోలు చేశాడు.
పెట్రార్క్ ప్రేమ సాహిత్యం సుమారు 20 సంవత్సరాలు వ్రాసాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షేక్స్ పియర్ తన జీవిత కాలంలో 154 సొనెట్స్ వ్రాయగా పెట్రార్క్ 366 సొనెట్స్ వ్రాసాడు. పెట్రార్క్ సొనెట్స్ చాలా శ్రావ్యంగా ఉంటాయి. షేక్స్పియర్ సొనెట్స్ లో ఈ శ్రావ్యత ఉండదు. ఉప్పెనలా పొంగిన ప్రేమకు సొనెట్స్ రూపాన్ని ఇచ్చి పెట్రార్చ్ ఇటాలియన్ కవిత్వానికి ప్రసిద్ధి చెందాడు కవిరాజుగా వెలిగాడు. పెట్రార్క్ రాసిన సొనెట్స్ ప్రేమ గురించిన కవితలు. లారా పట్ల తన ప్రేమను “లారా” సొనెట్‌లో వ్యక్తపరుస్తాడు. పెట్రార్చ్ వసంతం రాకను సంతోషం రాకతో పోల్చాడు. తన ప్రేమలో మాధుర్యాన్ని ప్రపంచానికి అద్భుతంగా తె ర్సా రీమా లో కవితా మాధుర్యంగా పంచాడు అతని ప్రేమ దక్కలేదు. దుఃఖమే దక్కింది.
పెట్రార్చ్ అంతర్జాతీయ పండితుడు మరియు కవి, దౌత్యవేత్త వేరొక చోటకి వెళ్లగలిగిన సమర్థుడే కానీ అవిన్యాన్లోనే జీవితం గడిపేశాడు. చర్చి కెరీర్ అతన్ని వివాహం చేసుకోవడానికి అనుమతించలేదు. అతడు తన ప్రేమను మౌనంగా సమాధిచేసినా అతడి సొనెట్స్ అతడి హృదయాన్ని తెరిచి ప్రపంచానికి చూపాయి.
పెద్ద రచనల వెనుక ప్రేరణ ప్రేమే సుమా