భూ బ్రమణం ఆగిపోతుందా ?
2040ల నుంచి భూ బ్రమణం వ్యతిరేక దిశలో ఉంటుందని చైనాలోని బీజింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది ప్రతి 20,30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ జియో శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. భూమిలోపలి పలకాలు సర్దుకోవడంలో ఏర్పడే సమయంలో సంభవించే భూకంపాల వల్ల భూ బ్రమణాలు ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. భూగోళం ఎడమ వైపు నుంచి కుడివైపుకు తిరుగుతుంది. విశ్వంలోని గ్రహాల ఆకర్షణ వికర్షణ బలాలు, చంద్రుడి ప్రభావం, సముద్ర అలల వల్ల వాతావరణం ఏర్పడుతుంది. దీంతో 12 గంటలు పగలు, 12గంటలు చీకటిగా (రాత్రి )ఉంటుంది.
ఒక్కసారి భూ బ్రమణం ఆగిపోతే మనం గాల్లోకి ఎగిరిపోతాం.
భూమిపై ఉన్న సకల జీవులు సర్రున జారిపోతూ, 1609 కిమీ వేగంతో బలంగా ఢీ కొడతాయి. దీంతో అంతా సర్వనాశనమే.సముద్రదాల్లో నీరు, పర్వతాలపైమంచు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి భూమిపై పడతాయి.
భూమిపై జీవరాశి మిగలదు. భూబ్రమణం ఆగిపోతే సముద్రాలు కుతకుతా ఉడుకుతాయి. నీరు ఆవిరై పోతుంది,
ఫ్యాక్టరీలు, అణువిద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు , ఆయుధ అన్ని పేలిపేతాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలుతుంది. అప్పుడు సముద్ర ప్రవాహం ఆగిపోతుంది. సముద్రపై గాలి భూమిని చేరదు.
భూమిపై జీవరాశి మిగలదు. భూమి వేడితో అగ్ని గోళంగా మారుతుంది. చెట్లు, చేమలు అన్నీ కాలిపోతాయి. భూమి ఒక నిర్జన గ్రహంగా మారుతుంది.
చందమామ తన శక్తితో భూమిని తన దగ్గరకు లాక్కుంటుంది. భూమి ఉపగ్రహాలన్ని చందమామపై పడి పేలిపోతాయి. అది కూడా పెనువినాశనం చెందుతుంది.
అయితే ఇప్పుడవన్నీ జరగవు. మరో 450 కోట్ల సంవత్సరాలకు ఇవన్నీ జరగగలవని సైంటిస్టులు భావిస్తున్నారు.
విశ్వం వయస్సు
సౌరమండలం (సోలార్ సిస్టం) 4.5 బిలియన్ ఏళ్ల క్రిందట ఏర్పడింది. సౌరమండలంలో భూమి కంటే గురుగ్రహం 3 మిలియన్ల ఏళ్లు పెద్దది. అందుకే అది పెద్దగ్రహంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సౌరమండలం మధ్యలో ఉన్న భూమికి సుడులు తిరిగే వాయువులు ధూళికణాలతో గురుత్వాకర్షణ శక్తి ఏర్పడింది.
ఈశాన్య కెనడాలో దొరకిన రాళ్లను బట్టి భూగోళం వయస్సు దాదాపు 50 బిలియన్ ఏళ్లుగా శాస్త్రవేత్తలు అంచనావేశారు.
భూగోళం ఉత్తర దక్షిణ దృవాల మధ్య దూరం 7,900 మైళ్లు. భూమధ్య రేఖ వ్యాసం ఇంకొంచెం ఎక్కువగా 7930 మైళ్లు భూ వైశాల్యం 25 వేళ మైళ్లు.
భూమిని నాలుగు రకాలుగా విభజించారు. ఒకటి పైపొర , రెండు దాని కిందపొర, భూబ్రమణానికి ఉపయోగపడే మూడవపొర, భూమి లోపలి పొర. బ్రమణానికి లోపలిపొర ముఖ్యమైందని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు భూమిని ఒక కెమికల్ కంపోజిషన్ అని చెబుతారు.
భూమి దిగువన ఉన్న పలకాలు (ప్లేట్లు)100 కిలోమీటర్ల లోతులో 2,400 ఫారిన్ హీట్ వేడిలో ఉంటాయి. బయటి భూపొరకు, దానితర్వాత ఉండే పొర 1,800 మైళ్ల కలిగి సుమారు 5000 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. భూమి మధ్యలో ఉంటే పొర 6 400 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ దీనిని తవ్వడానికి వీలుపడదు.
భూమిపై ఉండే సముద్రం లోతు 3.7 కిలోమీటర్లు. సముద్రపు సగటు లోతు 3,688 మీటర్లు (12,100 అడుగులు)
భూమిలోని లోపొలిపొరలో బ్రమణ శక్తి తగుగ పోతుందని, మరీ ముఖ్యంగా వ్యతిరేక దిశలో తిరగబోతోందని కొంతమంది శాస్ర్తవేత్తల పరిశోధనలను నాచుర్ జియో సైన్స్ పత్రికలో 2009లో ప్రచురించారు. జియోలాజికల్, వాతావరణ మార్పులతోనే ఇది సంభవిస్తుందని చెబుతున్నారు. భూమిలోపలి 5000 కిలోమీటర్ల మేర ఉండే భూ పలకాలు స్వతంత్రంగా తిరుగుతుంటాయి. 1970 వదశకాల్లో వ్యతిరేక దిశలో మెల్లమెల్లగా బ్రమణం ప్రారంభం అయిందని జపాన్ శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. భూమి లోపలి పొరల్లో జరిగే ఈ మార్పుతో తరచుగా భూకంపాలు ఏర్పడతున్నాయంటున్నారు.
భూమి మధ్యలో జరిగే బ్రమణానికి కారణం ద్రావణం (సాలిడ్) రూపంలో ఉన్న ఇనుము, నికెల్ ఉండటం ఇది దాదాపు 44 ట్రిలియన్ వాట్స్ హీట్లో ఉంటుంది. దీని చుట్టూ సెమీ సాలిడ్ భూ పొర ఉంటుంది. దీంతో డైనమో ఎఫెక్ట్ ఏర్పడి భూమికి బ్రమణ శక్తి ఏర్పడుతుంది.