విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
అమరావతి:
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.